మానుకోట బంద్ విజయవంతం
మహబూబాబాద్ : మానుకోటను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎనిమిది రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. విద్యా, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. బంద్‌కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. బంద్ రోజునే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి పర్యటన కూడా ఉండటంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డారుు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీపీఐ నాయకుడు రేశపల్లి నవీన్ ఆధ్వర్యంలో తెల్లవారుజామునే స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేశారు.
బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఐ, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీడీపీ, బీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బి.విజయసారథి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి భూపతి మల్లయ్య, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యాప సీతయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి, బీఎస్పీ డివిజన్ అధ్యక్షుడు దార్ల శివరాజ్, సీపీఐ (ఎంఎల్) డివిజన్ కార్యదర్శి హెచ్.లింగ్యానాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మానుకోటను జిల్లాగా ప్రకటించకపోవడం దారుణమన్నారు.
జిల్లా సాధించుకునేంత వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు బి.అజయ్, చుక్కల ఉదయ్‌చందర్, మార్నేని రఘు, దాస్యం రాంమూర్తి, పెరుగు కుమార్, పాండురంగాచారి, మేక వీరన్న, చింతకుంట్ల వెంకన్న, శ్యాం, సుబ్బారావు, లూనావత్ అశోక్, రాఘవులు, రాజశేఖర్ రెడ్డి, భద్రయ్య, కొత్తపల్లి రవి, ఎస్‌కె.బాబు, గుజ్జు దేవేందర్, తాజ్‌పాషా, ఆదిల్, మురళి, రేఖ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో
వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు గుగులోత్ రాములు నాయక్, పట్టణ అధ్యక్షుడు సప్పిడి రంజిత్ మాట్లాడుతూ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరన్నారు. అన్ని హంగులతో మానుకోటను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సోమ నరేందర్ రెడ్డి, రఫి (లడ్డు), శ్రీఖర్ (పటాన్), నవీన్, ఖాజాపాషా, బూర్గుల పాప య్య, రాజా, శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..
కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జెన్నారెడ్డి భరత్‌చందర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ భూక్య ఉమ, గుగులోత్ సుచిత్ర, గిరిధర్‌గుప్తా, బా నోత్ రవి నాయక్, బానోత్ ప్రసాద్, వాహెద్, సంపంగి రాంచంద్రు, చిదిరాల జ్ఞానేశ్వర్, సింగం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల బంద్
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలను మూసివేరుుంచారు. కార్యక్రమంలో నాయకులు చింతకుంట్ల యా కాంబ్రం, పైండ్ల యాకయ్య, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో పట్టణంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సూర్యప్రకాష్‌లోయ, జయప్రకాష్‌లోయ, శ్యాంలో య, పున్నంచంద్ మాల్‌పాని, బిజ్జుగోపాల్, శర్మ, షవర్‌తన్ కలంత్రి, వ్యాపారులు పాల్గొన్నారు.