నయీమ్‌తో శ్రీధర్‌బాబుకు లింకు: పుట్ట | Incorrect allegations: sridharbabu | Sakshi
Sakshi News home page

నయీమ్‌తో శ్రీధర్‌బాబుకు లింకు: పుట్ట

Published Tue, Oct 25 2016 4:29 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

నయీమ్‌తో శ్రీధర్‌బాబుకు లింకు: పుట్ట

నయీమ్‌తో శ్రీధర్‌బాబుకు లింకు: పుట్ట

మంథని: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు సంబంధాలు ఉన్నాయని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మంథనిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దీనిపై విచారణ కోసం సీఎం కేసీఆర్, డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మాజీ నక్సలైట్ జడల నాగరాజు ఆచూకీ లేకుండా పోయూడనిడన్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్యకేసులో సంబంధాలు ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు శ్రీధర్‌బాబు నయీమ్‌తో దోస్తీ చేసినట్లు ఆరోపణలున్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యే కాక ముందు హత్యకు కుట్ర జరిగిందని చెప్పారు.  

ఆరోపణలు సరికాదు : శ్రీధర్‌బాబు

గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో తనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేయడం సరికాదని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తన తప్పులను కప్పి పుచ్చకోవడానికి ఎమ్మెల్యే పుట్ట మధు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement