సాక్షి,పెద్దపెల్లిజిల్లా: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ మూడు దఫాలుగా చేశామని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి తప్పకుండా చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో బుధవారం(ఆగస్టు21) జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘మహిళలకు వడ్డీ లేని రుణాలు మొదట ప్రవేశపెట్టింది కాంగ్రెస్. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సంకల్పించి పనిచేస్తోంది. మహిళలను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
మంథని, కాటారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంథని మున్సిపల్ కార్యాలయం నిర్మిస్తాం. మంథనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించి, అభివృద్ది చేస్తాం’అని శ్రీధర్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment