దక్షిణాన గోల్ఫ్‌ సిటీ 10 వేల మందికి ఉపాధి: మంత్రి శ్రీధర్‌బాబు | Golf City to come up in Hyd will create 10000 jobs: Sridhar Babu | Sakshi
Sakshi News home page

దక్షిణాన గోల్ఫ్‌ సిటీ 10 వేల మందికి ఉపాధి: మంత్రి శ్రీధర్‌బాబు

Oct 20 2024 6:09 AM | Updated on Oct 20 2024 6:09 AM

Golf City to come up in Hyd will create 10000 jobs: Sridhar Babu

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెషనల్‌ గోల్ఫర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అమె రికా (పీజీఏ), స్థానిక భాగ స్వామి స్టోన్‌ క్రాఫ్ట్‌ తో కలిసి సిటీ దక్షిణాన విస్తారమైన గోల్ఫ్‌ సిటీని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడించారు. తెలంగాణ ప్రభు త్వం సహకరిస్తే గోల్ఫ్‌ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పీజీఏ, స్టోన్‌ క్రాఫ్ట్‌ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపారు. పీజీఏ ప్రస్తుతం ముంబైలో షాపూర్జీ పల్లోంజి సంస్థతో కలిసి గోల్ఫ్‌ సిటీ నిర్మాణం చేపడుతోందని, ఇక్కడ స్టోన్‌ క్రాఫ్ట్‌ భాగస్వామ్యంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిందని వివరించారు.

గోల్ఫ్‌ సిటీ నిర్మాణం పూర్తయితే వచ్చే పదేళ్లలో పదివేల మందికి ఉపాధి దొరుకు తుందని శ్రీధర్‌ బాబు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి మానస పుత్రిక ఫోర్త్‌ సిటీలో ఎటువంటి కాలుష్యం వెలువడని నెట్‌– జీరో సిటీని నిర్మిస్తుందని పేర్కొన్నారు. అమెరికా టెక్సస్‌ రాష్ట్రంలోని ఫ్రిస్కో ప్రధాన కేంద్రంగా ఉన్న పీజీఏ ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో మంత్రితో భేటీ అయింది.

నిర్మాణాలకు మూడింతలు ప్రకృతి వనాలను పెంచడం ద్వారా ఆహ్లాదకర నివాస ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సంస్థలు తమ ప్రెజెంటేషన్‌లో వెల్లడించినట్టు శ్రీధర్‌ బాబు చెప్పారు. పీజీఏ కన్సార్టియం 200 ఎకరాల్లో ‘18 హోల్‌’ ప్రామాణిక గోల్ఫ్‌ కోర్సును ఏర్పాటు చేస్తుంది. మియావాకి పద్ధతిలో అడవిని పెంచడం ద్వారా సహజ సిద్ధమైన డెక్కన్‌ శిలలకు, స్థానిక నీటి వనరులకు ఒక అలంకారప్రాయమ వుతుందన్నారు. భేటీలో స్టోన్‌ క్రాఫ్ట్‌ సీఈ వో కీర్తి చిలుకూరి, అలోక్‌ తివారి, పీజీఏ ప్రతినిధులు టిమ్‌ లాబ్, అలెక్స్‌ హే, డేవిడ్‌ బ్లమ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement