నయీంకు కొండాపూర్‌లో రూ.1500 కోట్ల ఆస్తి
పోలీస్ కాల్పుల్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం సేటిల్‌మెంట్లు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నయీం ఇంట్లో, అనుచరులు, బంధువుల వద్ద వందలాది డాక్యుమెంట్లు దొరుకుతుండడంతో శివార్లలో భూదందాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కొండాపూర్‌లో అత్యంత విలువైన స్థలాల డాక్యుమెంట్లు వెలుగు చూశాయి. హఫీజ్‌పేట్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న కొండాపూర్ సర్వే నెంబర్ 86, 87లో ఏకంగా 69 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది.
అక్కడ ఎకరం ధర రూ.20 కోట్లకు పైగానే ఉంటుంది. సర్వే నెంబర్ 86, 87, 88లో ఇప్పటికే లే అవుట్‌లు చేశారు. కొన్ని చోట్ల ఎకరాల కొద్ది కబ్జాలో ఉన్నాయి. నయీంతో తమ స్థలాలకు ఏలాంటి సంబంధం లేదని పొజిషన్‌లో ఉన్న వారు పేర్కొంటున్నారు. ఈ సర్వే నెంబర్‌లలో స్థలాలపై కోర్టులో కేసులున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే నెంబర్‌లో బడాబాబులున్నట్లు తెలుస్తోంది. పొజిషన్‌లో ఉన్న వారిని ఢీకొనలేక ఎవరైనా నయీంను ఆశ్రయించి ఉంటారనే ప్రచారం సాగుతోంది.