గ్యాంగ్‌స్టర్ నయీం కేసులోనల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టు ఆరుగురికి రిమాండ్ విధించింది.
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులోనల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టు ఆరుగురికి రిమాండ్ విధించింది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి అయిదుగురిని జిల్లా జైలు నుంచి, ఒకరిని చంచల్‌గూడ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. వీరందరికీ కోర్టు రేపటి వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగా, ఇదే కేసులో నయీం సోదరి హసీనా, మరదలు సాజిదాలకు ఏడు రోజుల పోలీస్‌కస్టడీ ముగియటంతో రాజేంద్రనగర్ కోర్టు రిమాండ్‌కు పంపింది.