miryalaguda court
-
మిర్యాలగూడ కోర్టుకు నయీం అనుచరులు
మిర్యాలగూడ: గ్యాంగ్ స్టర్ నయీం కేసుకు సంబంధించి 25 మంది నిందితులను పోలీసులు ఈరోజు మిర్యాలగూడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులను పలు కేసుల్లో విచారణ నిమిత్తం ఈ రోజు మిర్యాలగూడ కోర్టుకు తీసుకొచ్చారు. వారిలో నయీం భార్య, సోదరి, అత్త ఉన్నారు. విచారణ అనంతరం తిరిగి వారిని చర్లపల్లికి తరలించారు. -
నయీం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
గ్యాంగ్స్టర్ నయీం కేసులోనల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టు ఆరుగురికి రిమాండ్ విధించింది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి అయిదుగురిని జిల్లా జైలు నుంచి, ఒకరిని చంచల్గూడ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. వీరందరికీ కోర్టు రేపటి వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగా, ఇదే కేసులో నయీం సోదరి హసీనా, మరదలు సాజిదాలకు ఏడు రోజుల పోలీస్కస్టడీ ముగియటంతో రాజేంద్రనగర్ కోర్టు రిమాండ్కు పంపింది. -
మిర్యాలగూడలో కోర్టు సిబ్బంది ర్యాలీ
మిర్యాలగూడ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ కోర్టు ఉద్యోగులు శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. న్యాయాధికారుల సస్పెన్షన్ను రద్దుచేయాలని, హైకోర్టును వెంటనే విభజించాలని వారు డిమాండ్ చేశారు.