మిర్యాలగూడ కోర్టుకు నయీం అనుచరులు
Published Thu, Nov 3 2016 12:53 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
మిర్యాలగూడ: గ్యాంగ్ స్టర్ నయీం కేసుకు సంబంధించి 25 మంది నిందితులను పోలీసులు ఈరోజు మిర్యాలగూడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులను పలు కేసుల్లో విచారణ నిమిత్తం ఈ రోజు మిర్యాలగూడ కోర్టుకు తీసుకొచ్చారు. వారిలో నయీం భార్య, సోదరి, అత్త ఉన్నారు. విచారణ అనంతరం తిరిగి వారిని చర్లపల్లికి తరలించారు.
Advertisement