Published
Fri, Aug 26 2016 7:19 PM
| Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నయీం కేసును సీబీఐతో విచారణ జరిపించాలి
నల్లగొండ టౌన్ : నయీం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీంతో సంబంధం ఉన్న అధికార పార్టీ నాయకులను కేసుల నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానం కలుగుతుందన్నారు. నయీం ఆస్తులను అతని బాధితులకు పంపిణీ చేయాలని, అతనితో సంబంధం ఉన్న వారందరి పేర్లను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెలో సీపీఐ ప్రత్యక్షంగా పాల్గొంటుందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 11న బస్సుయాత్రను నిర్వహిస్తున్నారని. బస్సుయాత్ర కొలనుపాక గ్రామంలో ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, నెల్లికంటి సత్యం, కలకొండ కాంతయ్య, బి.వెంకటేశ్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.