ఆ ఇద్దరిని చంపింది నయీమ్ ముఠానే | Nayeem gang itself killed that two | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరిని చంపింది నయీమ్ ముఠానే

Published Wed, Nov 2 2016 3:53 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

ఆ ఇద్దరిని చంపింది నయీమ్ ముఠానే - Sakshi

ఆ ఇద్దరిని చంపింది నయీమ్ ముఠానే

- 11 ఏళ్ల తర్వాత వీడిన జంట హత్యల మిస్టరీ
- గ్యాంగ్‌లో చేరనందుకు జోడు ఆంజనేయులు,బెస్తా కిష్టయ్యలను మట్టుబెట్టిన వైనం
- డైరీ ఆధారంగా వెలుగులోకి..
- పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
 
 తూప్రాన్ : ఓ జంట హత్యల కేసు మిస్టరీ 11 ఏళ్ల తర్వాత వీడింది. మావోయిస్టుల సానుభూతిపరులుగా కొనసాగిన మెదక్ జిల్లా తూప్రాన్  మండలం ఇస్లాంపూర్‌కి చెందిన జోడు ఆంజనేయులు, బెస్తా కిష్టయ్యను గ్యాంగ్‌స్టర్ నయీమ్ హత్య చేరుుం చినట్టు పోలీసులు నిర్ధారించారు.  నయీమ్ డైరీ ఆధారంగా ఈ విషయం వెలుగుచూసింది. మంగళవారం సీఐ రమేశ్‌బాబు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. తూప్రాన్  మండలం ఇస్లాంపూర్‌కు చెందిన బెస్తా కిష్టయ్య, జోడు ఆంజనేయులు విప్లవపార్టీల సానుభూతిపరులుగా.. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నారుు. వారిని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు నయీమ్ యత్నిం చాడు. తన అనుచరుడైన కుంట యాదగిరితో వారి కదలికలపై నిఘా పెట్టి వారిద్దరినీ కిడ్నాప్ చేశారు.

 గ్యాంగ్‌లో చేరనందుకు హత్య
 బెస్తా కిష్టయ్య, జోడు ఆంజనేయులు మావోయిస్టు సానుభూతిపరులుగా కొనసాగుతున్న విషయం తెలుసుకొని.. వారిని తన గ్యాంగ్‌లో చేరాల్సిందిగా నయీమ్ రాయబారం పంపాడు. వారు వ్యతిరేకించడంతో అంతమొందించాలని నిర్ణరుుంచాడు. ఈ క్రమంలో 2005 మార్చి 15న భూమి రిజిస్ట్రే ్టషన్  కోసం వారిద్దరూ వస్తున్న విషయం తెలుసుకున్న నయీమ్.. తన అనుచరులైన డ్రైవర్ జెల్ల సత్యనారాయణ, యాదగిరి గుట్టకు చెందిన నర్సింగం పురుషోత్తం, మరికొందరిని ప్రజ్ఞాపూర్ వద్ద ఉంచాడు. భోజనం చేసేందుకు వచ్చిన ఆంజనేయులు, కిష్టయ్యను తమ వాహనంలో ఎక్కించుకెళ్లారు. అక్కడి నుంచి  మరికొందరు వేరొక వాహనంలో రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని నయీమ్ ఇంటికి తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి నయీమ్ వారితో మాట్లాడాడు. గ్యాంగ్‌లోకి రావడానికి వారిద్దరూ వ్యతిరేకించడంతో హత్య చేయమని అనుచరులను ఆదేశించాడు. దీంతో నయీమ్ డ్రైవర్ జెల్ల సత్యనారాయణ, నర్సింగం పురుషోత్తం, నయీమ్ మేనకోడలు తనియా అలియాస్ సాజిదా షాహినా తర్వాత రోజు ఉదయం ఆంజనేయులు, కిష్టయ్యను ఓ వాహనంలో శ్రీశైలంలోని దట్టమైన అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే హత్య చేసి కాల్వలో పడేశారు.

 డైరీ ఆధారంగా వీడిన మిస్టరీ
 నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత తన డైరీలో రాసుకున్న అనేక విషయాల ఆధారంగా ఆంజనేయులు, కిష్టయ్య హత్య జరిగినట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు అనుమతితో తూప్రాన్  పోలీసులు నయీమ్ డ్రైవర్ సత్యనారాయణ, పురుషోత్తంను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారిచ్చిన సమాచారంతో ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కుంట యాదగిరిని అదుపులోకి తీసుకుని విచారించారు. త్వరలో నయీమ్ మేనకోడలు తనియా అలియాస్ సాజిదా షాహినాను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, నయీమ్ అత్త సుల్తానా పేరు మీద ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సోమశిల టౌన్ షిప్‌లోని సుమారు 1000 చదరపు అడగుల వైశాల్యం గల ఇంటిని యాదగిరి తన భార్య శారద పేరుమీద రిజిస్ట్రేషన్  చేరుుంచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement