గ్యాంగ్‌స్టర్ నయీమ్ నుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు ఎదుర్కొన్న తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యాపారి గంపా నాగేందర్ ఆ సంభాషణల్ని రికార్డు చేశారు. నయీమ్ ఉదంతంపై ఈ నెల 17న నల్లగొండ జిల్లా భువనగిరి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సంభాషణల రికార్డునూ అందించారు.