Nagender
-
‘దానం’పై వేటు వేయకుంటే కోర్టుకు వెళతాం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చి 12 రోజులు కావస్తున్నా స్పందన లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. దానం అనర్హత పిటిషన్‌పై స్పీక ర్ చర్య తీసుకోని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపా ల్, బండారి లక్ష్మారెడ్డితో కలిసి శనివారం తెలంగాణ భవన్లో కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనర్హత వేటుకు సంబంధించి అదనపు అఫిడవిట్ సమరి్పంచేందుకు శనివారం సభాపతిని కలిసేందు కు వెళ్లినా అసెంబ్లీలో ఎవరూ అందుబాటులో లేరన్నారు. కార్యదర్శి కూడా అందుబాటులో లేకపోవడంపై ఆయనపై ఒత్తిళ్లు ఉన్నాయనే అభిప్రాయం కలుగుతోందన్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యరి్థగా దానంను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తే దేశమంతా హర్షిస్తుందని కౌశిక్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లినా కనీసం తమ వినతిపత్రం కూడా తీసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక పార్టీ లో గెలిచి మరో పారీ్టలోకి వెళ్లడం సిగ్గుచేటని, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారడం నమ్మించి గొంతు కోయడమే అని పేర్కొన్నారు. -
స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయవచ్చా?
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఒక ఓటర్ పిటిషన్ వేయవచ్చా? దీనిపై స్పీకర్ విధుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా? ఆయన ముందు వినతిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల ని చెప్పవచ్చా? అలా గతంలో ఏవైనా తీర్పులుంటే తమ ముందు ఉంచాలని ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు దాఖలు చేసిన పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ‘2023, నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో నేను ఆయనకు ఓటు వేశాను. ఆ ఎన్నికల్లో గెలిచిన దానం.. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాదు సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి.. మరో పార్టీలో చేరిన దానంను అనర్హుడిగా ప్రకటించాలని మార్చి 23న స్పీకర్‌కు ఈ–మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించాం. ఇంకా దానిపై ఆయన నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుని దానంను అనుర్హుడిగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వండి’అని కోరుతూ ఖైరతాబాద్‌కు చెందిన బొల్లబోయిన రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ రిట్ పిటిషన్‌ను దాఖలు చేయడంలో పిటిషనర్‌కు ఎలాంటి అర్హత ఉందని అతని తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి మూడు నెలలు తిరగకుండానే కాంగ్రెస్‌కు విధేయుడిగా మారిన ఎమ్మెల్యేకు పిటిషనర్ ఓటేశారని న్యాయవాది చెప్పారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. గత తీర్పుల కాపీలుంటే తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు. -
రాజీనామా చేశాకే పోటీ!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ అంశం తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉండి.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారనే ప్రచారం గందరగోళం రేపుతోంది. వాస్తవానికి దానం నాగేందర్ చేరిక సందర్భంగా జరిగిన చర్చల్లో సికింద్రా బాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని, ఖైరతా బాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయనకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పష్టతనిచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయా లనే ప్రతిపాదన మేరకే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని పార్టీ అధి ష్టానానికి వివరించాకే.. నాగేందర్‌కు ఎంపీ అభ్యర్థిత్వా న్ని ఏఐసీసీ ఖరారు చేసింది. కానీ ఆయన రాజీనామా పై ఊగిసలాటలో పడ్డారు. ఎంపీగా గెలిచాకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ పెద్దలు ఏం చేస్తారనే చర్చ మొదలైంది. ప్రత్యామ్నాయంపై ఆలోచన! గాంధీభవన్ వర్గాల్లో, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చల మేరకు.. దానం నాగేందర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం సాధ్యం కాదని ఏఐసీసీ పెద్దలు తేల్చినట్టు సమాచారం. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుందని.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేయిస్తే ఆ రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహారాన్ని తప్పుపట్టలేని స్థితికి వెళతామని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో నాగేందర్ అభ్యర్థి త్వంపై పునః సమీక్ష చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచా రం. నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీగా పోటీచేస్తారని.. ఆయన రాజీనామాకు ససేమిరా అంటే మరో అభ్యర్థిని పోటీకి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లేదా మరో నేతను ప్రత్యామ్నాయంగా పోటీ చేయించేందుకు సిద్ధంగా ఉంచాలని కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర నేతలకు సూచించినట్టు సమాచారం. కడియం శ్రీహరి విషయంలోనూ! స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్‌లో ఇదే తరహా చర్చ జరుగుతోంది. కడియంతోపాటు ఆయన కుమార్తె కావ్య నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి వరంగల్ లోక్‌సభ ఎంపీగా పోటీచేస్తారని, ఖాళీ అయ్యే స్టేషన్‌ఘన్‌పూర్‌లో కావ్యను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారనే చర్చ జరుగుతోంది. లేదా కావ్యను ఎంపీగా పోటీచేయించి.. శ్రీహరి ఎమ్మెల్యేగా కొనసాగుతారని అంటున్నారు. మొత్తమ్మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీచేసే అంశం ఆ పార్టీలో కొంత గందరగోళానికి దారిస్తోంది. -
జంపింగ్‌లు షురూ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన మరుసటి రోజే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడవకుండానే ఎమ్మెల్యేలు పార్టీ మారడం ప్రారంభమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పక్షాన గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి గానీ, శాసనసభ్యత్వానికి గానీ రాజీనామా చేయకుండానే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, ఇక నుంచి తన రాజకీయం ఏంటో చూపిస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వక భేటీ పేరిట కలిసినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ పార్టీ మారలేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ పార్టీలోకి, నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే రావడంతో రాజకీయం రసకందాయంలో పడిందని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా, ఏమైనా జరగవచ్చనే ఆలోచనతోనే ఎమ్మెల్యేలను అధికారికంగా పార్టీలో చేర్చుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, ఆపరేషన్ ఆకర్‡్షకు ఇక మరింత పదును పెట్టే క్రమంలో గేమ్ స్టార్ట్ చేసిందని చెబుతున్నారు. టచ్‌లో 26 మంది? ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆ సంఖ్య 38 అయ్యింది. అయితే వీరిలో మూడింట రెండొంతుల మంది అంటే 26 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు, రంగారెడ్డి నుంచి ఇద్దరు, మేడ్చల్ నుంచి ఇద్దరు, కొత్తగూడెం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వీరంతా కాంగ్రెస్‌లో చేరతారా లేక మర్యాదపూర్వకంగానే కలిశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే తాము అండగా నిలుస్తామని తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఈ రోజే గేట్లు తెరిచానని, అవతలివైపు ఎంతమంది ఉంటారో తనకు తెలియదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠకు తావిస్తున్నాయి. నాటి బీఆర్ఎస్ తరహాలోనే! ఓటుకు కోట్లు వ్యవహారం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమై భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రమాదం లేకుండా ఉండేందుకు అనే కారణం చూపుతూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతూనే ఉంది. ఒక పార్టీలో గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా గతంలో పలుమార్లు నిలదీశారు. పార్టీ మారిన వారిని ఉరి తీయాలంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న ఓ నాయకుడు మాట్లాడుతూ ‘నాడు కేసీఆర్ సూత్రాన్నే మేం పాటిస్తున్నాం. మా కోట గోడలను పదిలం చేసుకుంటున్నాం. బలంగా చుట్టూ కంచె వేసుకుంటున్నాం. పార్లమెంటు ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని కొందరు, మూడు నెలల తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని మరికొందరు చేస్తున్న వ్యాఖ్య ల వెనుక ఆంతర్యం ఏంటో అందరికీ తెలిసిందే. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్లకు ఫిరాయింపుల రాజకీయం అలవాటే. మా జాగ్రత్తలో మేం ఉండకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు రాజకీయం చేస్తున్నారు. వాళ్ల శాసనసభాపక్షం మా పార్టీలో విలీనం అవు తుందేమో?’అని వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం, మున్షీ సమక్షంలో చేరికలు బీఆర్ఎస్కు చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిలు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో, రంజిత్‌రెడ్డితో కలిసి మొత్తం ముగ్గురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టయింది. కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు: రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రంజిత్‌రెడ్డి తన రాజీనామా లేఖను పంపారు. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రంజిత్‌రెడ్డి ‘ఎక్స్’లో తెలిపారు. ఇన్ని రోజులు చేవెళ్ల ఎంపీగా తనకు సేవలు చేసే అవకాశం కల్పించిన ప్రజలకు, కేసీఆర్, కేటీఆర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు. -
ఎఫ్‌సీఐ వల్లే సీఎంఆర్ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో మిల్లింగ్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటోందని రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సీఎంఆర్ విషయంలో మిల్లర్లను వేధించడ మే లక్ష్యంగా ఎఫ్‌సీఐ అధికారులు నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంప నాగేందర్ గుప్తా ఆరోపించారు. మంగళవారం నగరంలోని టూరిస్ట్ ప్లాజాలో మిల్లర్ల సంఘం సమావే శం జరిగింది. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. మిల్లర్లు మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్ల నుంచి తరలించాల్సిన ఎఫ్‌సీఐ నాలుగైదు నెలలైనా రైల్వే వ్యాగన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపడం లేదని, తద్వారా గోడౌన్లు నిండి పోయి మిల్లింగ్ జరగని పరిస్థితి నెలకొందని వివరించారు. ఒక్కో ఎఫ్‌సీఐ గోడౌన్‌కు వందలాది మిల్లుల నుంచి వచ్చిన బియ్యాన్ని కేటాయిస్తుండడంతో వారం రోజులైనా బియ్యం లారీలు అన్లోడింగ్ కావడం లేదన్నారు. దీంతో సమయానికి సీఎంఆర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాగైతే మిల్లింగ్ ఎలా? ప్రస్తుతం రాష్ట్రంలోని మిల్లర్ల వద్ద కోటి మె ట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, ఎఫ్‌సీఐ ఇలాగే వ్యవహరిస్తే ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం అసాధ్యమని గుప్త స్పష్టం చేశారు. ఎఫ్‌సీఐ కారణంగా 70 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయడానికి 24 నెలల కాలం పడుతుందన్నారు. మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లు, ఎఫ్‌సీఐ నుంచి రవాణా చార్జీలు రూ.700 కోట్లు రావలసి ఉందని, వాటిని వెంటనే చె ల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం పంపించే బలవర్ధక బియ్యం కెర్నల్స్ (ఎఫ్ ఆర్కే)లో నాణ్యత లేదని మిల్లులను ఎఫ్‌సీఐ డిఫాల్టర్లుగా ప్రకటించడం శోచనీయమన్నారు. సమావేశంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభాకర్ రావు పాల్గొన్నారు. -
అమ్మను నాన్నే చంపాడు
మేడ్చల్: కట్టుకున్న భార్యను హత్య చేసి పథకం ప్రకారం ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త దురాగతాన్ని ఆయన కూతురు బట్టబయలు చేసింది. సిద్దిపేట ములుగు మండలం తుంకిబొల్లారం గ్రామానికి చెందిన తిరునగర్ నవ్యశ్రీ(33), నాగేందర్ భార్యాభర్తలు. వీరికి కూతుళ్లు చందన, మేఘన ఉన్నారు. మేడ్చల్ పట్టణంలోని సూర్యనగర్ కాలనీలో నివాసముంటున్నా రు. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 20న నవ్యశ్రీ పూజ చేయడానికి అగ్గిపెట్టెను వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తూ అగ్గిపుల్ల చీరపై పడి మంటలు చెలరేగాయని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా అలానే పేర్కొంది. నవ్యశ్రీని ప్రాథమిక చికిత్సల అనంతరం గాంధీ ఆస్పత్రికి తర లించగా ఈ నెల 5న మృతి చెందింది. ఈ నెల 6న పెద్ద కూతురు చందన మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తల్లి నవ్యశ్రీని తండ్రి నాగేందర్ చంపాడని స్టేట్మెంట్ ఇచ్చింది. తల్లి ఒంటిపై నాగేందర్ శానిటైజర్ పోసి నిప్పటించాడని, అడ్డం వెళ్లిన తనపై కూడా శానిటైజర్ పోశాడని ఫిర్యాదు చేసింది. నాగేందర్ నవ్యశ్రీ ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఈ మేరకు నాగేందర్‌పై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
నెలలో సస్తననుకుంటున్నావ్రా?
-
నెలలో సస్తననుకుంటున్నావ్రా?
నన్ను సంపిద్దామని ప్లాన్ చేస్తున్నవ్లే - చచ్చేది నువ్వో, నేనో చూద్దాం - సీఎం దగ్గరైనా కూర్చో.. నీకు దేవుడే గతి - వ్యాపారి గంపా నాగేందర్‌కు నయీమ్ బెదిరింపులు - ఫోన్ సంభాషణలు రికార్డు చేసి పోలీసులకిచ్చిన బాధితుడు సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్ నుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు ఎదుర్కొన్న తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యాపారి గంపా నాగేందర్ ఆ సంభాషణల్ని రికార్డు చేశారు. నయీమ్ ఉదంతంపై ఈ నెల 17న నల్లగొండ జిల్లా భువనగిరి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సంభాషణల రికార్డునూ అందించారు. సోమవారం మీడియాకు చేరిన ఆ ఆడియో రికార్డులోని అంశాలు... నయీమ్: అన్నా నమస్తే అన్నా నాగేందర్: నమస్తేనే నయీమ్: ఏమన్నా, అన్ని ఫోన్లూ బంద్ చేసినవ్ నాగేందర్: హాస్పటల్లో ఉన్నా. మొత్తం కరువుంది. దాంతో అమౌంట్ అరేంజ్ కాలేదు. ఒక్క నెలలో, మే 31 వరకు చేయిస్తా నయీమ్: నువ్వు ఇట్ల మాట మార్సుడు మంచిదేనా అన్నా? నాగేందర్: నేనట్ల చెయ్యనే. మీకు మాటిచ్చినాక ఏ పరిస్థితుల్లోనూ మార. తప్పకుండా చేయిస్తా. 15 రోజుల నుంచి సన్‌స్ట్రోక్‌తో హాస్పటల్లో ఉన్నా నయీమ్: సరే. నువ్విచ్చినా ఇంక తీసుకోను కానీ నేను... నాగేందర్: అన్నా, నువ్వట్లనకే... నయీమ్: నీకు రెస్పెక్ట్ ఇచ్చినం. నువ్వు నిలబెట్టుకోలేదన్నా. నువ్వెఎట్లుంటవో మాకు తెల్వదు. రికార్డు చేసుకుంటే చేసుకో. నాకేం భయం కాదు. నా మీద ఓ కేసు అయితాది. అంతకంటే ఎక్కువ ఏం కాదు. నాగేందర్: నీకు దండం పెడుత. కాల్మొక్కుత. ఒక్క నెల టైమియ్యి నయీమ్: నీ కొడుకుల్లో ఒకరు దేవుని దగ్గరకు వెళ్తడు నాగేందర్: మే 31 వరకు 100 శాతం చేయిస్తా. దయచేసి ఈ ఒక్కసారీ నా మాట విను నయీమ్: నన్ను చంపిద్దామని ఏం ప్లాన్ చేస్తున్నావ్లే! నాకన్నీ తెల్సన్నా. నువ్వు చస్తవో, నేను చస్తనో చూద్దాం నాగేందర్: అన్నా, నేనలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. ప్రమాణంగా చెప్తున్నా నయీమ్: ప్లాన్ వేస్తున్నావ్ కదా. సచ్చేదెవరో ఇప్పుడు చూస్తానింక నాగేందర్: నీకు దండ పెడతనే. అట్లేంలేదు. నయీమ్: నువ్వు ప్లాన్ వేస్తే వెయ్. నువ్వెక్కడికి పోతున్నవ్? ఏమేం చేస్తున్నవ్? నా పిల్లల (అనుచరుల) మీద హరాస్మెంట్లు చేయిస్తున్నావ్. పీడీ యాక్ట్ పెట్టిస్తున్నావ్. నువ్వేమేం చేసినవో అన్నీ నాకు తెల్సన్నా. నాగేందర్: అన్నా... అన్నా... అన్నా... నయీమ్: పో... సీఎం దగ్గరికి పోయి కూర్చో, ఎవరి దగ్గరైనా కూర్చో అన్నా. నీకింక దేవుడే గతి. నీ శక్తి సరిపోతే నువ్వు చేపియ్. నా శక్తి సరిపోతే నేన్ చేపిస్తా నాగేందర్: నేనట్లా చేసేటోణ్ణి కాదే. నీ మెసేజ్ రాంగానే నీకు ఫోన్ చేసినాను కదే నయీమ్: మెసేజ్ రాంగానే ఫోన్ చేసినానంటే నీ సద్ది ఇంతేనా అన్నా? తిక్క లెక్క ఉన్నదా నీకు? భయం లేదా నీకు? నాగేందర్: నన్ను అర్థం చేసుకుని నెల టైమివ్వు (వణుకుతున్న గొంతుతో). అప్పటికీ చెయ్యకపోతే నన్ను అడుగు. నయీమ్: వన్ మంత్ అని ఈ రోజు చెప్తున్నవ్. మరి ఆ రోజు. ఇక (అమౌంట్) నువ్విచ్చినా నేను తీసుకోను. నీకేమైనా అయితే నాకు తెల్వద్. కేసు పెట్టుకో, ఏమైనా చేసుకో నాగేందర్: అన్నా, నేను కేసు పెట్టేటోణ్ణి కాదు. పోలీసోళ్ల కాడికి పోయేదుంటే నీకెందుకు ఫోన్ చేస్తనే? అట్లైతే నీ ఫోనే ఎత్త కదే..! నయీమ్: నువ్వు అక్కడికి పోతే ఏం పీక్తరన్నా.. మాట్లాడితే... నాగేందర్: నాకన్న పెద్ద పెద్దోళ్లే భయపడ్తరు, దాంట్ల నేనెంతన్నా? వన్ పర్సెంట్ కూడా కాదు నయీమ్: మరి ఇప్పటివరకు నాకు మాటిచ్చి ఎవరైనా తప్పి ఉంటరా? అంత ధైర్యం చేసి ఉంటరా? నువ్వు చేసినవ్ మరి? నా బాధ్యత ఏందంటే, నీకు ఏం జరుగుతదో ముందో చెప్తున్నా. కాపాడుకోగలిగితే కాపాడుకో ఇంక నాగేందర్: నీకు దండం పెడ్తనే. కాల్మొక్తనే. వన్‌మంత్ టైమ్ ఇయ్యవే నయీమ్: ఎట్లా కన్పిస్తున్నా అన్నా నేను? (అమౌంట్) నువ్విచ్చినా నేను తీసుకోను నాగేందర్: అన్నా, ఈ ఒక్క... ఒక్క...సారికీ (భయపడుతూ) నన్ను కాపాడే నయీమ్: నువ్వు ఏమనుకుంటన్నవంటే, ‘వన్ మంత్‌లో ఈడు సచ్చిపోతాడు కదా, సచ్చిపోతే పోతాది అనుకుంటున్నావ్ కదా...’ అని. నేను చావన్రా అరేయ్! నాగేందర్: అన్నా... అన్నా... ప్రమాణంగా ఆ ఆలోచనే లేదన్నా నాకు. నేను భువనగిరికి రాక కూడా తొమ్మిది నెలలయితాందన్నా. నువ్వు చెప్పినావనే వచ్చిన. భువనగిరిల ఉంటలేను నయీమ్: నువ్వు ఇట్లా చేస్తే నీకు బాగుండదన్నా. నువ్వే పీడీ యాక్ట్, గీడీ యాక్ట్ అన్నీ ప్రెషర్ చేసి చేయించినావని డౌటుంది. కాబట్టి నీకు నెల టైమియ్యలేను. ఈ సాయంత్రం వరకు సగం పేమెంట్ చేసుకో. 15 రోజుల్లో మిగిలింది చేసుకో నాగేందర్: అన్నా అన్నా అన్నా నీ కాల్మొక్తనే. దండం పెడత. కనీసం వన్‌మంత్ ఇయ్యవే నయీమ్: ఇయ్యలేనన్నా. ఇయ్యలేను. ఈ రోజు సగం, 15 రోజుల్లో సగం నాగేందర్: నువ్వు ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదన్నా.. నీతో డెరైక్ట్‌గా మాట్లాడదామంటే నీ నెంబర్ నాకాడ లేక, ఎవరిని కాంటాక్ట్ చెయ్యాలో తెలుస్తలేదన్నా నయీమ్: ఎవరికియ్యాలేంది? నీకు పాశం అన్న (ఫోన్) చేస్తడని చెప్పినాను కదా. పిల్లలు వస్తరు, ఇయ్యాలని చెప్పినా కదా నీకు నాగేందర్: అన్నా నెల రోజుల ఆపన్నా. నీ కాల్మొక్తనే. నీకు దండం పెడతనే. ఈ ఒక్కసారీ కాపాడే (వణుకుతున్న గొంతుతో) నయీమ్: నెల రోజులైతే కాపాడలేనన్నా. నేను చెప్తన్నా చూడన్నా. నీకేమైనా ఇబ్బంది అయితే... ఫోన్ పెట్టేస్త నాగేందర్: అన్నా, నా జీవితంలో ఎవర్నీ ఇంతల్లా రిక్వెస్ట్ చెయ్యలేదు. వన్‌మంత్ ఆపే. నీ కాల్మొక్కుత. పువ్వుల్ల పెట్టిస్త. నాకు నువ్వు కాంటాక్ట్ అవ్వడమే నా అదృష్టం నయీమ్: 15 రోజుల టైమ్ తీస్కో. వన్ మంత్ ఇయ్యట్లేదు. నువ్వు ఫోన్ ఎందుకు లేప్తలేవ్ చెప్పు నాగేందర్: అన్నా, అన్నా. వన్ మంత్ నయీమ్: సరే. ‘పది రూపాయలు’ (అంటే రూ.10 లక్షలు) ఎక్కువియ్యాలె నాగేందర్: నాకేం పెట్టకే ఇంక. 31 వరకు టైమ్ ఇయ్యవే నయీమ్: నువ్వు మళ్ళీ 31వ రోజు కూడా కాల్మొక్తవ్ నాగేందర్: అన్నా, ఈసారి తప్పకుండా చేస్తనే. మొక్క ఇక నయీమ్: చెయ్యకపోతే నేనింక కాల్ చెయ్య మరి నాగేందర్: చెయ్యకన్నా నయీమ్: చెయ్యను. తర్వాత ఏం జెయ్యాల్నో జేస్కుంట నాగేందర్: సరే మంచిదన్నా. 31 లోపట చేయిస్తా. మంచిది. నయీమ్: 31 లోపట అంటే మన పిల్లలు (అనుచరులు) ఎప్పుడు (కాల్) చెయ్యాలె? నాగేందర్: కాల్ అవసరం లేదే. మనిషిని పంపియ్ ఇచ్చేస్త నయీమ్: 31 నాడు మనిషిని పంపియ్యాల్నా? నాగేందర్: అవ్ అన్నా నయీమ్: సరే నాగేందర్: నమస్తే నయీమ్: సరే అన్నా..31 నాడు ఎక్కడ పంపియ్యాలె మనిషిని? నాగేందర్: భువనగిరిలో అరేంజ్ చేస్తా నయీమ్: భువనగిరిల వద్దు. హైదరాబాద్‌ల అరేంజ్ చెయ్ నాగేందర్: సరే. నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ చేస్తనే నయీమ్: ఔనూ, నీకు ఫోన్ ఎప్పుడు చెయ్యాలె? నాగేందర్: ఫోనెందుకే? 31 నాడు చేపిస్తనే. టైమ్ ఇచ్చినవుగా నయీమ్: 31 నాడు చెయ్యద్దా ఫోన్ మరి? నాగేందర్: 31 నాడు చెయ్యవే నయీమ్: అప్పుడు మళ్ల ఫోన్లు బంద్ పెట్టుకుంటవా? నాగేందర్: ఇప్పుడు బంద్ ఏమీ పెట్టుకోలేదే నేను నయీమ్: సరే. ఒక నెలల నేను సచ్చిపోతే పైసలు మిగుల్తాయని అనుకుంటున్నావేమో! నువ్వు, శ్రీధర్‌బాబు ఎవడెవడు కల్సి ఏం చేస్తున్నరో గానీ, నేన్ చెప్తున్నా నువ్వు మంచిగుంటే నేను మంచిగుంటా. నువ్వు చెడ్డగుంటే నేను చేసేది నేను చెయ్యాల్సి వస్తది. నాగేందర్: అన్నా నీతోటి కల్సిన తర్వాత నేను ఎవర్నీ, శ్రీధర్‌బాబు అన్నను కూడా కల్వలేదు. నేతి విద్యాసాగర్‌ని కూడా నువ్వు కల్వద్దు అన్నాక నేను కల్వలేదు నయీమ్: సరే. నేను 31 తారీఖు ఫోన్ చేస్తా. నేను లేదా పాశం అన్న చేస్తడు. ఫోన్ ఆన్ పెట్టుకో (ఈ సందర్భంలో వాహనాల హారన్ శబ్దాలు వినిపించాయి. దీన్ని బట్టి ఆ సమయంలో నయీమ్ ఏదైనా హైవేపై ఉండి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు) నాగేందర్: మంచిదన్నా. ఉంటనే