బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చి 12 రోజులు కావస్తున్నా స్పందన లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. దానం అనర్హత పిటిషన్‌పై స్పీక ర్ చర్య తీసుకోని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపా ల్, బండారి లక్ష్మారెడ్డితో కలిసి శనివారం తెలంగాణ భవన్‌లో కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనర్హత వేటుకు సంబంధించి అదనపు అఫిడవిట్ సమరి్పంచేందుకు శనివారం సభాపతిని కలిసేందు కు వెళ్లినా అసెంబ్లీలో ఎవరూ అందుబాటులో లేరన్నారు.
కార్యదర్శి కూడా అందుబాటులో లేకపోవడంపై ఆయనపై ఒత్తిళ్లు ఉన్నాయనే అభిప్రాయం కలుగుతోందన్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యరి్థగా దానంను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తే దేశమంతా హర్షిస్తుందని కౌశిక్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లినా కనీసం తమ వినతిపత్రం కూడా తీసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక పార్టీ లో గెలిచి మరో పారీ్టలోకి వెళ్లడం సిగ్గుచేటని, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారడం నమ్మించి గొంతు కోయడమే అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment