అమ్మను నాన్నే చంపాడు  | Wife Murderd by husband in madchal | Sakshi
Sakshi News home page

అమ్మను నాన్నే చంపాడు 

Mar 8 2023 4:29 AM | Updated on Mar 8 2023 4:29 AM

Wife Murderd by husband in madchal - Sakshi

మేడ్చల్‌: కట్టుకున్న భార్యను హత్య చేసి పథకం ప్రకారం ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త దురాగతాన్ని ఆయన కూతురు బట్టబయలు చేసింది. సిద్దిపేట ములుగు మండలం తుంకిబొల్లారం గ్రామానికి చెందిన తిరునగర్‌ నవ్యశ్రీ(33), నాగేందర్‌ భార్యాభర్తలు. వీరికి కూతుళ్లు చందన, మేఘన ఉన్నారు. మేడ్చల్‌ పట్టణంలోని సూర్యనగర్‌ కాలనీలో నివాసముంటున్నా రు.

శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 20న నవ్యశ్రీ పూజ చేయడానికి అగ్గిపెట్టెను వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తూ అగ్గిపుల్ల చీరపై పడి మంటలు చెలరేగాయని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా అలానే పేర్కొంది.  నవ్యశ్రీని ప్రాథమిక చికిత్సల అనంతరం గాంధీ ఆస్పత్రికి తర లించగా ఈ నెల 5న మృతి చెందింది.

ఈ నెల 6న పెద్ద కూతురు చందన మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తల్లి నవ్యశ్రీని తండ్రి నాగేందర్‌ చంపాడని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తల్లి ఒంటిపై నాగేందర్‌ శానిటైజర్‌ పోసి నిప్పటించాడని,  అడ్డం వెళ్లిన తనపై కూడా శానిటైజర్‌ పోశాడని ఫిర్యాదు చేసింది. నాగేందర్‌ నవ్యశ్రీ ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పటించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో  రికార్డయ్యాయి. ఈ మేరకు నాగేందర్‌పై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement