Navya Shree
-
అమ్మను నాన్నే చంపాడు
మేడ్చల్: కట్టుకున్న భార్యను హత్య చేసి పథకం ప్రకారం ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త దురాగతాన్ని ఆయన కూతురు బట్టబయలు చేసింది. సిద్దిపేట ములుగు మండలం తుంకిబొల్లారం గ్రామానికి చెందిన తిరునగర్ నవ్యశ్రీ(33), నాగేందర్ భార్యాభర్తలు. వీరికి కూతుళ్లు చందన, మేఘన ఉన్నారు. మేడ్చల్ పట్టణంలోని సూర్యనగర్ కాలనీలో నివాసముంటున్నా రు. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 20న నవ్యశ్రీ పూజ చేయడానికి అగ్గిపెట్టెను వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తూ అగ్గిపుల్ల చీరపై పడి మంటలు చెలరేగాయని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా అలానే పేర్కొంది. నవ్యశ్రీని ప్రాథమిక చికిత్సల అనంతరం గాంధీ ఆస్పత్రికి తర లించగా ఈ నెల 5న మృతి చెందింది. ఈ నెల 6న పెద్ద కూతురు చందన మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తల్లి నవ్యశ్రీని తండ్రి నాగేందర్ చంపాడని స్టేట్మెంట్ ఇచ్చింది. తల్లి ఒంటిపై నాగేందర్ శానిటైజర్ పోసి నిప్పటించాడని, అడ్డం వెళ్లిన తనపై కూడా శానిటైజర్ పోశాడని ఫిర్యాదు చేసింది. నాగేందర్ నవ్యశ్రీ ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఈ మేరకు నాగేందర్‌పై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
Navya Sri: అశ్లీల వీడియో తీసి వెబ్‌సైట్‌కు అమ్మాడు.. సమాజంలో...
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): ఉద్యానవన శాఖ అధికారి రాజకుమార టాకళెతో పెళ్లి, తనపై మోసం, బ్లాక్మెయిల్ కేసుకు సంబంధించి బెళగావి కాంగ్రెస్ నాయకురాలు నవ్యశ్రీ స్పందిస్తూ దీని వెనుక చన్నపట్టణకు చెందిన కాంగ్రెస్ నేత హస్తం ఉందన్నారు. ఆమె శనివారం బెళగావిలో విలేకరులతో మాట్లాడారు. తాను విదేశాలలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో చెడుగా పోస్టులుపెట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్న వేళ, టాకళె ఆ వెంటనే బెళగావి ఎపిఎంసి పోలీసులకు నాపై ఫిర్యాదు చేశాడన్నారు. తనను టాకళె 2020లో బెంగళూరులో కుమారకృపా గెస్ట్ హౌస్ వెనుకనున్న గణేశ్ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అతనే నా భర్త. అతడి వల్ల నాకు అన్యాయం జరిగింది, గతంలో టాకళెపై బెళగావి మహిళా పోలీసుస్టేషన్లో రెండుసార్లు ఫిర్యాదు చేశాను. మొదటి భార్య ఉండగానే నన్ను కిడ్నాప్ చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. అశ్లీల వీడియో తీసి వెబ్‌సైట్‌కు అమ్మాడు. సమాజంలో నా పరువు తీశాడు అని ఆమె ఆరోపణలు గుప్పించారు. -
ఆయనే నా భర్త.. ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ నేత నవ్యశ్రీ
యశవంతపుర: కర్నాటకలోని బెళగావి కాంగ్రెస్ నాయకురాలు, సామాజిక కార్యకర్త నవ్య శ్రీ రావు ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె నా భార్య కాదంటూ హార్టికల్చర్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రాజకుమార టాకళె తెలిపారు. తమ ఇద్దరికీ పెళ్లి జరిగినట్లు సాక్ష్యాలు లేవన్నారు. ఆమె నా భార్య కాకపోయినా పదేపదే భార్య అని ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. మూడు నెలల నుంచి నవ్యశ్రీ మానసికంగా హింసిస్తోందన్నారు. కష్టాల్లో ఉంటే ఆదుకున్నా నాకు భార్య, పిల్లలున్నారు. ఆమె కష్టాల్లో ఉందని నన్ను కలిస్తే ఎంతో సాయం చేశాను. రూ.రెండు లక్షలు ఇచ్చా, ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోందని టాకళె అన్నారు. పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. మరోవైపు వారిద్దరూ అన్యోన్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఎవరు చెప్పేది అబద్ధం, ఎవరిది నిజం? అని గందరగోళం ఏర్పడింది. ఆమె రూ.50 లక్షలు ఇవ్వాలని వేధిస్తోందని, ఇందుకు కొన్ని వీడియోలను వాడుకుంటోందని టాకళె చెప్పారు. ఆమె నుంచి కాపాడాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు నవ్యశ్రీ మాత్రం తమకిద్దరికీ పెళ్లయిందని స్పష్టం చేసింది. ఇప్పుడు తాను ఎవరో తెలియదని నాటకమాడుతున్నారని పేర్కొంది. వారిద్దరి సన్నిహిత వీడియోలు వైరల్ కావడం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. -
తల్లిదండ్రుల చెంతకు నవ్యశ్రీ
కిడ్నాప్ కథ సుఖాంతం సమాచారం ఇచ్చిన యాదయ్యకు అవార్డు అందజేస్తామన్న డీఎస్పీ మహబూబ్‌నగర్ క్రైం: అపహరణకు గురైన బాలిక నవ్యశ్రీ మంగళవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. జనవరి 29న తిరుపతిలో ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో కిడ్నాప్‌కు గురైన నవ్యశ్రీ సోమవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో దొరికిన విషయం విదితమే. మహబూబ్‌నగర్‌లో డీఎస్పీ భాస్కర్ కథనం ప్రకారం.. ఆనంతపురం జిల్లా తుమ్మచేర్ల గ్రామానికి చెందిన మహాత్మ, లక్ష్మిలు కూతురు నవ్యశ్రీతో కలసి తిరుపతి వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ఆవరణలో నిద్రించారు. అదే సమయంలో నవ్యశ్రీని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన బాలస్వామి అపహరించాడు. చిన్నారిని స్వగ్రామమైన అంతారం గ్రామానికి తీసుకువచ్చాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు పాప ఎక్కడిదని యాదయ్యను నిలదీశారు. దీంతో అతను బాలికను శ్రీశైలంలో వదిలిరావాలని నిర్ణయించుకుని సోమవారం రాత్రి మిడ్జిల్ మీదుగా ఆర్టీసీ బస్సులో వెళ్తుంటే తోటి ప్రయాణికుడు యాదయ్య పరిస్థితిని గమనించి నవ్యశ్రీ గురించి వివరాలు ఆరా తీశాడు. బాలస్వామి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు బాలస్వామిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నవ్యశ్రీని తిరుపతిలో అపహరించి తీసుకువచ్చానని ఒప్పుకున్నాడు. మహబూబ్‌నగర్ డీఎస్పీ ఆధ్వర్యంలో నవ్యశ్రీని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. నవ్యశ్రీ ఆచూకీని తెలిపిన యాదయ్యకు డీజీ చేతుల మీదుగా రివార్డు ఇస్తామని డీఎస్పీ తెకలిపారు.