థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకుని 18 రోజుల నరకం తర్వాత బయటపడిన పిల్లలు, వారి ఫుట్‌బాల్ జట్టు కోచ్ తొలిసారి ప్రజల ముందుకొచ్చారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ చిన్నారులు, వారికి చికిత్స అందిస్తున్న వైద్యులతో కలసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిన్నారులు మాట్లాడుతూ.. గుహలో తాము ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. తొలుత చిన్నారులు అందరికి నమస్కారం చెబుతూ, ఫుట్‌బాల్ చేతిలో పట్టుకొని వేదికగా వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్థలంలో కొద్ది సేపు ఫుట్‌బాల్ ఆడారు. వారు సరాదాగా ఫుట్‌బాల్ ఆడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.