Cave
-
అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం
ప్రతిరోజూ అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టేవారు ఒకరోజు ఒక రహస్య గుహను గమనించారు. వారు ఈ గుహ గురించి అందరికీ చెప్పగానే, అది స్థానికంగా సంచలంగా మారింది. ఆ కట్లెలు కొట్టేవారు ఆ గుహలోని వెళ్లి చూడగా, వారికి అక్కడ కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. బీహార్‌లోని జముయి జిల్లాలోని బర్హత్ బ్లాక్ ప్రాంతంలో ఈ రహస్య గుహ వెలుగు చూసింది. పంచకుల అడవిలో ఉన్న కొండలలో ఒక రహస్య గుహ ఉందని ఆ ప్రాంతానికి చెందిన కట్టెలు కొట్టేవారు చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యపోతూ, ఆ గుహను చూసేందుకు తరలివస్తున్నారు. గుహ లోపల ఒక శివలింగం ఉందని, ధ్యాన స్థితిలో కూర్చున్న ఒక ఋషికి సంబంధించిన ఒక పురాతన విగ్రహం కూడా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఆ గుహలోకి ప్రవేశించే మార్గం చాలా ఇరుకుగా ఉంది. అయినప్పటికీ కొందరు టార్చిలైట్లు చేతబట్టి, గుహలోనికి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు.గ్రామానికి చెందిన హీరా మాంఝీ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని కొంతమంది కలప సేకరించడానికి అడవిలోకి వెళ్లినప్పుడు ఈ గుహను గమనించారని తెలిపారు. ఆ కట్టెలు కొట్టేవారిలోని ఒక వ్యక్తి సాహసం చేసి, గుహలోకి వెళ్లాడని, అక్కడ అతనికి ఒక శివలింగం, ఒక ఋషి విగ్రహం కనిపించాయని తెలిపారు. ఈ గుహ జిల్లాలోని ప్రసిద్ధ కుకుర్జాప్ ఆనకట్టకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గుహ పైన పెద్ద బండ రాళ్ళు ఉన్నాయి. ఈ గుహగురించి తెలిసిన అనంతరం స్థానికులు గుహ వెలుపల కూర్చుని భజనలు, పూజలు చేస్తున్నారు. భక్తులు దర్శించుకునేందుకు వీలుగా గుహలోనికి మార్గం ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
Wayanad landslide: ఆరు ప్రాణాలు నిలబెట్టారు
వయనాడ్: దట్టమైన అడవిలో అదొక కొండ గుహ.. చుట్టూ చిమ్మచీకటి.. ఒకటి నుంచి నాలుగేళ్ల వయసున్న నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఐదు రోజులపాటు అక్కడే తలదాచుకున్నారు. తాగడానికి వర్షపు నీరు తప్ప తినడానికి తిండి లేదు. ఆకలితో అలమటించిపోయారు. అటవీ సిబ్బంది 8 గంటలపాటు శ్రమించి ఆ కుటుంబాన్ని రక్షించారు. ఆరుగురి ప్రాణాలను కాపాడారు. కేరళలో వరద బీభత్సానికి సాక్షిగా నిలిచిన వయనాడ్ జిల్లాలోని అట్టమల అడవిలో జరిగిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటవీ సిబ్బందే అసలైన హీరోలంటూ జనం ప్రశంసిస్తున్నారు.వయనాడ్‌లో పనియా జాతి గిరిజనులు అధికంగా ఉంటారు. ఇతర సామాజికవర్గాలకు దూరంగా జీవిస్తుంటారు. అటవీ ఉత్పత్తులను విక్రయించి జీవనోపాధి పొందుతుంటారు. అందుకోసం గిరిజన దంపతులు నలుగురు పిల్లలను వెంట తీసుకుని కొండల్లోకి వెళ్లారు. భీకర వర్షం మొదలవడంతో కొండ గుహలో తలదాచుకున్నారు. వర్షం తగ్గకపోవడం, కొండచరియలు విరిగిపడుతుండడంతో కిందికొచ్చే సాహసం చేయలేకపోయారు. ఆహారం కోసం వెతుకుతూ తల్లి ఐదు రోజుల తర్వాత కిందికి రావడంతో అధికారులు గమనించారు. గుహలో నలుగురు పిల్లలు, భర్త ఉన్నారని చెప్పడంతో అటవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. భారీ వర్షం, అడుగడుగునా రాళ్లు, బురదలో అడుగువేయడమే కష్టమవుతున్నా గుహకు చేరుకున్నారు. ముందుగా ఆకలితో నీరసించిపోయిన చిన్నారుల కడుపు నింపారు. వాళ్లను తాళ్లతో తమ ఒంటికి కట్టుకొని జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆ క్రమంలో కొండపై నుంచి తాళ్ల సాయంతో దిగాల్సి వచి్చంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో జనం విపరీతంగా షేర్ చేశారు.350 మందికిపైగా మృతులు! వయనాడ్ విపత్తు మృతుల సంఖ్య 350 దాటినట్లు తెలుస్తోంది. శనివారం అధికారులు మాత్రం 218 మంది చనిపోయినట్లు వెల్లడించారు. నిర్వాసితులకు సురక్షిత ప్రాంతంలో టౌన్íÙప్ ఏర్పాటుచేసి ఇళ్లు కట్టిస్తామని సీఎం పినరయి విజయన్ చెప్పారు. ప్రకటించారు. మోహన్ లాల్ రూ.3 కోట్ల విరాళం ప్రముఖ సినీ నటుడు మోహన్‌లాల్ శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. భారత ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ఆయన బాధితులను పరామర్శించారు. సహాయక సిబ్బంది సేవలను కొనియాడారు. వరద విలయానికి నామారూపాల్లేకుండాపోయిన నివాసాలను చూసి చలించిపోయారు. పునరావాస చర్యలకు రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. -
హత్రాస్ ఘటన: వెలుగులోకి ‘భోలే బాబా’ భవనం, ఖరీదైన కార్లు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్( భోలే బాబా)పై శనివారం తొలి కేసు నమోదైంది. అయితే భోలే బాబాకు సంబంధించి పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019కి ముందు భోలేబాబా కొన్ని రోజులు లఖింపూర్‌ఖేరిలో అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పడు నివసించిన విలాసవంతమైన భవనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ భవనంలో ఒక లగ్జరీ కార్లు, గుహ వంటి నిర్మాణంలో ఉన్న గది ఉన్నాయి. అందులో భోలే బాబా ఫొటోలు, మంత్రాల చిత్రాలు కనిపించాయి. ఈ బిల్డింగ్‌లోనే భోలే బాబా మూడునాలుగు సార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చివరిసారి ఇక్కడ 2019లో 15 రోజులపాటు ఉన్నట్లు ఈ భవనం యజమాని గోవింద్ పుర్వార్ తలిపారు. ఇక.. ఈ బిల్డిండ్ పూర్తిగా వ్యవసాయ భూములు, పెద్ద తోటల మధ్యలో ఉండటం గమనార్హం. ఈ భవనంలో విశాలమైన పార్కింగ్ స్థలం ఉంది. భోలే బాబాకు చెందిన రెండు లగ్జరీ కార్లు ఇక్కడ పార్క్ చేయబడి ఉన్నాయి. వంట చేసుకోవటం కోసం కిచన్, స్టవ్, సామాగ్రి కూడా ఉన్నాయి. వంటగది పక్కనే గుహవంటి రూం ఉంది. ఇందులో 2019 నాటి భోలే బాబా సత్సంగ్ పోటోలు ఉన్నాయి. మరో గదిలో గోధుమ కంటేయినర్లు, భోలే బాబా ఫోటోలు, హనుహాన్ చాలిసా మాదిరిగా చేతితో రాసిన హారతి చాలిసా ఉన్నాయి. అయితే భోలే బాబా ఈ భవనంలో విశ్రాంతి తీసుకునేవారని స్థానికంగా ఉండే ఆయన భక్తులు మీడియాతో తెలిపారు.ఇక తొక్కిసలాట ఘటన తర్వాత భోలేబాబా శనివారం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు పేర్కొన్నారు.మరోవైపు హత్రాస్ ఘటనపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం జూలై 3న హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. -
అమర్నాథ్కు పోటెత్తుతున్న భక్తులు
జమ్ముకశ్మీర్‌లో ప్రతీయేటా జరిగే అమర్నాథ్యాత్రకు ఈసారి భక్తులు పోటెత్తారు. మహాశివుని నామస్మరణలతో జరుగుతున్న యాత్రలో రెండవ రోజున (ఆదివారం) సుమారు 14,717 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 28 వేల మంది అమరనాథుని దర్శనం చేసుకున్నారు.అమర్నాథ్ యాత్ర చేసేందుకు తాజాగా పహల్గావ్, బాల్టల్‌ల నుంచి రెండవ బృందం బయలుదేరింది. మొత్తం 309 వాహనాలలో బాల్టన్ మార్గంలో 2,106 మంది పురుషులు, 11 మంది పిల్లలు, 115 మంది సాధువులు, 41 మంది సాధ్విలు యాత్రకు బయలుదేరారు. ఈ మార్గంలో స్థానికులు యాత్రికులకు స్వాగతం పలికారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానికులతో పాటు అమర్నాథ్ యాత్రకు వెళుతున్న భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు.శ్రీనగర్‌లోని వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై మొదటివారం నుంచి వర్షాలు కురియనున్నాయి. 25వ సారి అమర్నాథ్ యాత్ర చేస్తున్న కృష్ణకుమార్ మీడియాతో మాట్లాడుతూ గతంలోకన్నా ప్రస్తుతం ఏర్భాట్లు బాగున్నాయని అన్నారు. తాను కోవిడ్ సమయంలోనూ హెలికాప్టర్లో అమర్నాథ్ యాత్ర చేసుకున్నానని తెలిపారు. -
వామ్మో ఈ దారా? ప్రాణం పోయినంత పనైపాయె!!
మనం తెలియని ప్రదేశాలలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు మనలో మనకే చిన్నగా భయం మొదలవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భయం మరింత రెట్టింపవుతుంది. ప్రయాణించే దారిలో ఎలాంటి సంఘటనలు తారసపడుతాయో అనే సందేహం మనసులో ఏదో మూలన ఉండకమానదు. అదేవిధంగా ఈ వీడియోలో ఎదురైన ఈ సొరంగమార్గం కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసెయ్యండి!వామ్మో ఇది పాతాళమేనా అన్నట్లుగా..ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా తనకు ఓ కొండ ఎదురైంది. ఆ కొండ దాటడానికి సొరంగ మార్గం ఒక్కటే దిక్కు. చేసేదేమిలేక కారుని ముందుకు నడిపాడు. కారు ఆ గుహ మార్గంలోకి ప్రయాణించింది. అంతా చీకటిమయం. ఎదురుగా ఏముందో కనిపించే వీలులేదు. కారుకు ఉన్న లైట్లే అతని ధైర్యం. ఆ మార్గం కైలాసం ఆడుతున్నట్లుగా అన్నీ వంక మలుపులే. అక్కడక్కడా మనసు కుదుటపడేలా.. లెఫ్ట్, రైట్ టర్నింగ్ సంకేతాలు. ఇవేగానీ లేకపోతే ముందుకు సాగకపోవడమో, ప్రమాదం జరగడమో ఖాయం.వెళ్తున్నా కొద్ది సొరంగ మార్గం తనకు తానే దారి పొడవు పెంచుతున్నట్లుగా సాగుతూనే ఉంది. ఆ గుహలోంచి బయట ఎప్పుడు పడాల్లా అనేవిధంగా భయంతో కూడిన ఆతృత. కారు పైభాగం గుహకు తాకుతున్నట్లుగా ఆలోచన. చిమ్మని చీకటి... మరోసారి మళ్లీ ఈ దారిలోకి వద్దామా? బయటికి మార్గం ఉందా? లేక ఎక్కడైనా ఇరుక్కుపోతానా? వెనక్కి వెళ్లలేం! ముందుకే తప్ప మరేదిక్కులేదు! ఇప్పుడెలా? వెళ్తున్నానుగా... అనే ఆలోచనలు లోలోనే దిగమింగుతూ తేరుకునేలోపు సొరంగమార్గం ముగిసిపోయి.., బయటిదారి ఎదురయ్యేసరికి ప్రాణం గుప్పిట్లో దాచుకుని హమ్మయ్య!! అనుకున్నాడు ఆ డ్రైవర్. View this post on Instagram A post shared by Usha Vardhan (@usha.vardhan.96) ఇవి చదవండి: ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ -
అవును.. అది నిజంగా మృత్యుగుహే!
ఇది చూడటానికి మిగిలిన కొండగుహల మాదిరిగానే కనిపిస్తుంది గాని, నిజానికిది మృత్యుగుహ. ఈ గుహలోకి అడుగుపెడితే మృత్యువు తప్పదు. కోస్టారికాలోని పోవాస్ అగ్నిపర్వత శిఖరం వద్ద ఉన్న ఈ కొండగుహ మృత్యుగుహగా పేరుమోసింది.రెండు మీటర్ల లోతు, మూడు మీటర్ల పొడవు ఉన్న ఈ గుహ చిన్నా చితకా జంతువులు, పక్షులు తలదాచుకోవడానికి అనువైన ప్రదేశంలా కనిపించినా, ఇందులోకి జంతువులు, పక్షులు ఏవీ వెళ్లవు. పొరపాటున వెళితే, క్షణాల్లోనే అవి ఊపిరాడక మరణిస్తాయి. కంటికి కనిపించని, కనీసం ముక్కుపుటాలకు వాసనైనా తెలియని కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వాయువులు ఈ గుహ నిండా వ్యాపించి ఉండటం వల్లనే ఈ గుహలో ఎలాంటి జీవులైనా ప్రాణాలతో ఉండలేవు.వెలిగించిన కాగడాను ఈ గుహలోపల పెడితే అది క్షణాల్లోనే ఆరిపోతుంది. ఊపిరి పీల్చుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ బొత్తిగా లేకపోవడం, లోపల అంతా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వాయువులు వ్యాపించి ఉండటం వల్ల ఇది మృత్యుగుహగా తయారైంది.ఈ గుహ లోపల ప్రతి గంటకు కనీసం ముప్పయి కిలోల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. ఈ ప్రాంతంలో రిక్రియో వెర్డే కాంప్లెక్స్ నిర్మాణం జరుపుతున్నప్పుడు ఇంజినీర్లు ఈ గుహకు గల ప్రాణాంతక లక్షణాన్ని తొలిసారిగా గుర్తించారు. వారు దీనికి ‘కేవా డి లా మ్యూర్టె’ (మృత్యుగుహ)గా పేరుపెట్టారు.ఇవి చదవండి: ఈ సరికొత్త టెక్నాలజీ గురించి విన్నారా! వీటి పనేంటో తెలుసా!! -
గుహలు అనుకుంటే పొరబడ్డట్టే.. వాటి వెనుక చాలా పెద్ద కథే ఉంది!
ఈ భూమి కొన్ని ప్రదేశాలు అంతుచిక్కని మిస్టరీల్లా ఉంటాయి. అవి ఎవరు ఏర్పాటు చేశారన్నది కూడా కనిపెట్టలేం. కానీ వాటి నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యం ఇంతలా ఉండేదా అనిపిస్తుంది. అలాంటి అంతుచిక్కని మిస్టరీలాంటి సొరంగాలే ఇవి. చూసేందుకు గుహల్లా ఉంటాయి. అయితే ఇందులో ఎవరుండేవారన్నది ఓ మిస్టరీ. కానీ లోపల ఉండే భూగర్భ నగరం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడంటే.. దక్షిణ అమెరికాలో బ్రెజిల్ భూభాగంలో రెండు సొరంగాలును గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇవి చూడటానికి గుహల్లా కనిపించే సొరంగాలు మాదిరిగా ఉన్నాయి. అయితే ఎవరూ వీటిని చేశారనేది తెలియరాలేదు. అయితే ఇవి మానవులకు సంబంధించిన సొరంగాలా లేక జంతువులు వాటి సంరక్షణ కోసం చేసుకునేవా అనేది మిస్టరీగా ఉంది. అయితే దక్షిణ అమెరికాలో పాంపతేరియంకి చెందిన హోల్మెసినా అనే ఒక అంతరించిపోయిన జంతువు తాబేలు మాదిరి షెల్‌తో పెద్దగా ఉండేదని, అదే ఈ సొరంగాలు చేసి ఉంటుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అలా ఈ సొరంగాలు ఏ జాతుల జంతువులకు సంబంధించిన అని పరిశోధను చేయగా..పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ అధ్యయనంలో దక్షిణ బ్రెజిల్,అర్జెంటీనా అంతటా దాదాపు 15 వందలకు పైగా ఇలాంటి సొరంగాలను గుర్తించారు పరిశోధకులు. అలాగే 2009లో ఒక రైతు బ్రెజిల్‌లోని దక్షిణ ప్రాంతంలో తన మొక్కజొన్న పొలం గుండా వెళ్తున్నప్పుడూ ఇలాంటి సొరంగాన్ని చూసినట్లు తెలిపాడు. తాను ఆ టైంలో ట్రాక్టర్‌పై అటువైపుగా వెళ్తుండగా ట్రాక్టర్ ఒకవైపుకి ఒరిగిపోయి ఆగిపోయిందని, అప్పుడే వీటిని గుర్తించానని చెప్పుకొచ్చాడు. దీంతో పరిశోధకుల బృందం ఆ దిశగా అధ్యయనం చేయగా, ఆ సొరంగా మొక్కజొన్న పొలం నుంచి రైతు ఇంటి కింద ఉన్న భూగర్భం వరకు ఉండటం చూసి కంగుతిన్నారు. దాదాపు రెండు మీటర్లు ఎత్తు, రెండు మీటర్ల వెడల్పూ, 15 మీటర్ల పొడవాటి పొలం మీదుగా రైతు ఇంటి వరకు సొరంగం ఉన్నట్లు తెలిపారు. అయితే గోడలపై ఉన్న లోతైన పంజాగుర్తులను చూసి నాటి మానవుల గుర్తులే సూచిస్తున్నాయన్నారు. ఇక ఆ పరిశోధకులు బృందలోని ఓ శాస్త్రవేత్త ఇది దాదాపు 10 వేల ఏళ్ల నాటిదని నిర్థారించారు. ఇందులో సుమారు 20 వేల మంది ఉండేవారని అన్నారు. అయితే ఇలా సొరంగం తవ్వే ఇజనీరింగ్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ సొరంగా 280 అడుగు దిగువన ఉంది. బహుశా క్రీస్తూ పూర్వం 1200 ఏళ్ల క్రితం ఫిజియన్లు అనే పూర్వీకులు ఉండే వారని భావిస్తున్నారు. వారు గృహ జీవితం ఇలా ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కొందరూ మాత్రం రోమన సామ్రాజ్యంలో క్రైస్తవ నివాసులు గుహ వ్యవస్థ ఇలా ఉండేదని, ఇవి వారి ప్రార్థన మందిరాలుగా ఉండేవని అన్నారు. కాలక్రమేణ వైన్, ఆలివ్ వంటి వాటిని తయారు చేసే ప్రదేశాలుగా మారినట్లు భావిస్తున్నారు. బహుశా అప్పటి ప్రజలకు ఈ భూగర్భ నగరం భూతల స్వర్గంగా ఉండి ఉండొచ్చు అందువల్లే ఇలా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చన్నారు. అలాగే నాటి ప్రపంచంపై దండయాత్రలు జరిగేవి కాబట్టి నాటి విజేతలు, ఆక్రమణదారులు వీటిని ఉపయోగించి ఉండొచ్చు అని పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. అయితే చివరికి సొరంగాలు ఏంటన్నవీ శాస్తవేత్తలు నిర్థారించలేకపోయారు. దీంతో అవి ఓ అంతు చిక్కని మిస్టరీ సొరంగాలుగా మిగిలిపోయాయి. These tunnels were once believed to hide religious fortunes deep in their chambers, but the real treasure is found in who - or what - created them. In 2009, a farmer was driving through his corn field in the south of Brazil when he suddenly felt his tractor sink and lurch to… pic.twitter.com/leRQyDpkA5 — Fascinating (@fasc1nate) March 18, 2024 (చదవండి: రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెడితే..ఈ బ్రదర్స్ కారునే ఏకంగా..!) -
ఆ గుహలోకి వెళ్తే అంతే సంగతులు..!
ఎన్నో గుహలు చూసుంటారు. గుహ అన్వేషకులు వాటన్నింటి చూసుండొచ్చు కానీ ఈ గుహ జోలికి మాత్రం పోయుండరు. ఎందుకంటే వెళ్తే తిరిగి రావడం అంటూ లేని వింత గుహ. ఆ గుహను బయటి నుంచే చూస్తే హడలిపోతాం. ఇక లోపలకి వెళ్లే సాహసం చేస్తే ఇంక అంతే సంగతులు. ఆ గుహ ఎక్కడుందంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన గుహ. జార్జియాలోని నల్లసముద్ర తీరానికి చేరువలో ఉన్న ఈ గుహ మృత్యుగుహగా పేరుమోసింది. క్రాస్నోయార్స్క్కు చెందిన గుహాన్వేషకులు కొందరు దీనిని 1968లో తొలిసారిగా గుర్తించారు. వెరియోవ్కినా అనే ఈ గుహ 7,293 అడుగుల లోతు ఉంటుంది. బయట నిలబడి దీని లోపలకు చూపు సారిస్తే, లోపలంతా చీకటిగా భయంగొలిపేలా కనిపిస్తుంది. దాదాపు గడచిన యాబై ఏళ్లలో ముప్పయిసార్లు గుహాన్వేషకులు ఈ గుహ లోపలి చివరి వరకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడంతో దీనికి మృత్యుగుహ అనే పేరు స్థిరపడింది. పలుసార్లు ఈ గుహలో గుహాన్వేషకుల మృతదేహాలు బయటపడ్డాయి. చివరిసారిగా 2021లో సెర్జీ కోజీవ్ అనే రష్యన్ గుహాన్వేషకుడి మృతదేహం ఈ గుహలో మూడువేల అడుగుల లోతు వద్ద కనిపించగా, దానిని వెలికితీశారు. గుహ లోపల దిగువకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి పడిపోతాయి. ఈ పరిస్థితుల్లో అడుగు భాగానికి చేరుకునే ప్రయత్నంలో హైపోథెర్మియాకు లోనై గుహాన్వేషకులు మరణిస్తున్నారని, తగిన జాగ్రత్తలు లేకుండా, ఈ గుహ అడుగుభాగానికి చేరుకోవాలని ప్రయత్నించడమంటే కోరి చావును కొని తెచ్చుకోవడమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. (చదవండి: వావ్!..వాట్ ఏ డ్రై ఫ్రూట్ జ్యువెలరీ!) -
ధగధగ..సెగసెగ.. అతిపెద్ద స్ఫటికాల గుహ ఎక్కడంటే?
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్ఫటికాల గుహ. బయటి నుంచి లోపలకు చూస్తే, భారీ స్ఫటిక శిలలు ధగధగలాడుతూ కనిపిస్తాయి. గుహ లోలోపలికి వెళుతుంటే మాత్రం తాళలేనంత వేడిసెగలు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ స్ఫటికాల గుహ మెక్సికోలోని చిహువాహువా సమీపంలో ఉంది. నైకా గనితో ఈ గుహను అనుసంధానించారు. ఇందులో జిప్సమ్, క్యాల్షియమ్ ఖనిజాల వల్ల ఏర్పడిన స్ఫటిక శిలలు భారీ పరిమాణంలో కనిపిస్తాయి. ఈ గుహను పూర్తిగా పరిశీలించడం ఎవరికీ సాధ్యం కాదు. లోలోపలకు వెళితే, అక్కడి ఉష్ణోగ్రతలు 58 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. లోపలి గాలిలో తేమ 90–99 శాతం మేరకు ఉంటుంది. గని కార్మికులైన జువాన్, పెడ్రో అనే సోదరులు తవ్వకాలు జరుపుతున్న సమయంలో పాతికేళ్ల కిందట ఈ గుహను గుర్తించారు. గుహలోని నేలకు అడుగు భాగంలో కరిగే స్థితిలో ఉన్న లావా కారణంగానే ఈ గుహలో విపరీతమైన వేడి, ఉక్కపోత వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఆ గుహలోకి వెళ్తే ..ఆత్మలను లైవ్‌లో చూడొచ్చట!
ఆత్మల గురించి కథలు కథలుగా వినడం లేదా సినిమాల్లో చూడటమే. గాన్నీ ప్రత్యక్షం చూసిన అనుభవం ఎవరికీ ఉండదు. మహా అయితే దేన్నో చూసి ఊహించుకుని భయపటమే జరగుతుంది. ఈ గుహలోకి వెళ్తే ఆ కోరక తీరిపోతుందట. ఏంటీ..? అని నోరెళ్లబెట్టకండి. నిజంగా ఆత్మలను ప్రత్యక్ష్యంగా చూడాలనుకునేవాళ్లు నేరుగా ఈ గుహలోకి వెళ్లిపోతే ఆ ఫీలింగ్ దక్కుతుందట. పైగా ఆ అనుభవాన్ని అంత తేలిగ్గా మరిచిపోలేరట కూడా. ఆ గుహ ఎకడుందంటే..? ఇదేదో మామూలు కొండగుహ కాదు, దయ్యాల నిలయం. ఫిన్లండ్‌లోని కోలి అభయారణ్య ప్రాంతంలో ఉన్న ఈ గుహను స్థానిక ఫిన్నిష్ భాషలో ‘పిరున్కిర్కో’ అంటారు. అంటే, దయ్యాల ఆలయం అని అర్థం. ప్రేతాత్మల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక పర్యాటకులు అడపాదడపా ఇక్కడకు వచ్చి, ఈ గుహలో కాసేపు గడిపి వెళుతుంటారు. ఈ గుహలోకి అడుగుపెట్టిన తర్వాత గుహలో ఏదో ఆత్మ సంచరిస్తున్న అనుభూతి కలిగినట్లు ఇందులోకి వెళ్లి వచ్చిన చాలామంది చెప్పారు. ఇందులోకి అడుగు పెట్టగానే ఎవరో అదృశ్యంగా తాకుతున్న అనుభూతి కలిగిందని, చెవిలో ఎవరో గుసగుసలు చెబుతున్నట్లుగా అనిపించిందని పలువురు చెప్పారు. గుహలో ఎవరో రోదిస్తున్న ధ్వని వినిపించినట్లుగా కూడా కొందరు చెప్పారు. ఈ గుహ లోపలి పొడవు 34 మీటర్లు ఉంటుంది. అంతా ఖాళీగా, చీకటిగా ఉంటుంది. ఈ గుహలోని ఆత్మ గురించి ఫిన్లండ్‌లో చాలా కథలు శతాబ్దాలుగా ప్రచారంలో ఉన్నాయి. ఇందులోకి వెళ్లేవారికి అక్కడ ఏదో ఆత్మ సంచరిస్తున్న అనుభూతి ఎందుకు కలుగుతోందనే దానిపై నిగ్గు తేల్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఫిన్లండ్ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధనలు ప్రారంభించారు. (చదవండి: ఆ ఫౌంటెన్ కోసం ఏకంగా రూ. 16 కోట్లు ..! కానీ చివరికి..) -
ఇదు శ్రీలంక: రావణ్ ఫాల్స్... ఎల్లా!
శ్రీలంకలో హిందూమహాసముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంది ఈ జలపాతం. దట్టమైన అడవుల మధ్యలో ప్రవహించిన నీటిపాయలు వంద అడుగుల కిందనున్న భూభాగం మీదకు అలవోకగా జారిపడుతూ ఉంటుంది. శ్రీలంక పర్యాటక ప్రాధాన్యం గల దేశం కావడంతో ప్రతి ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటకులకు అనువుగా మలుచుకుంటుంది. పర్యాటకులు జలపాతాన్ని వీక్షించడానికి, జలపాతం బ్యాక్‌డ్రాప్‌లో ఫొటో తీసుకోవడానికి వీలుగా వాటర్‌ఫాల్స్ దగ్గర చక్కటి ప్లాట్పామ్ ఉంది. రావణుడి గుహలు రావణ్ జలపాతం... ఎల్లా అనే చిన్న పట్టణానికి దగ్గరగా, ఎల్లా రైల్వేస్టేషన్‌కి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. దాంతో ఈ జలపాతానికి రావణ్ ఎల్లా అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ జలపాతం వెనుకవైపు గుహలున్నాయి. రావణాసురుడు... సీతాదేవిని అపహరించిన తర్వాత కొంతకాలం ఈ గుహల్లో దాచి ఉంచాడని, అందుకే ఈ గుహలకు రావణుడి గుహలనే పేరు వచ్చిందని చెబుతారు. సముద్రమట్టానికి నాలుగున్నర వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహల్లోకి వెళ్లడానికి వెడల్పాటి మెట్లు, మెట్ల మధ్యలో రెయిలింగ్ వంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ గుహలకు ఏడు కిలోమీటర్ల దూరాన బందరవేలా గుహలున్నాయి. పాతిక వేల ఏళ్ల కిందట ఆ గుహల్లో మనుషులు జీవించినట్లు ఆధారాలు దొరికాయి. ట్రెకింగ్ ఆసక్తి ఉన్న వాళ్లు ఈ ప్రదేశాల కోసం రెండు రోజులు ఉండేటట్లు టూర్ ప్లాన్ వేసుకోవాలి. జ్ఞాపికలే పెద్ద వ్యాపారం శ్రీలంకలో ప్రతి టూరిస్ట్ పాయింట్ దగ్గర సావనీర్ షాప్లుంటాయి. చిన్నదో పెద్దదో కనీసం ఒక్క స్టాల్ అయినా ఉంటుంది. డిజైనర్ దుస్తుల నుంచి శ్రీలంక గుర్తుగా తెచ్చుకోవడానికి జ్ఞాపికలు కూడా ఉంటాయి. పర్యాటకులు తమ టూర్ గుర్తుగా దాచుకోవడానికి, అలాగే స్నేహితులు, బంధువుల కోసం కూడా సావనీర్లను ఎక్కువగా కొంటారు. ప్రైస్ ట్యాగ్ చూడగానే భయం వేస్తుంది. కానీ శ్రీలంక రూపాయలను మన రూపాయల్లోకి మార్చుకున్నప్పుడు ధరలు మరీ ప్రియం అనిపించవు. మరో సౌకర్యం ఏమిటంటే షాపుల్లో మన కరెన్సీ కూడా తీసుకుంటారు. దుస్తుల విషయానికి వస్తే... ఫ్లోర్ లెంగ్త్ ఫ్రాక్‌ల వంటి మోడరన్ దుస్తులు బాగుంటాయి. కానీ కొలతలు భారతీయులకు అమరవు. పాశ్చాత్యుల పొడవుకు తగినట్లుంటాయి. శ్రీలంక వాసులు కూడా పొడవుగా, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వారికీ చక్కగా అమరుతాయి. ఇక మనం అక్కడ కొనుక్కోగలిగిన దుస్తులు చీరలు, శాలువాలు, పిల్లలకు టీ షర్ట్లే. ఉన్ని శాలువాలు మంచి నేత పనితనంతో అందంగా ఉంటాయి. ఏనుగు బొమ్మలు ముద్రించిన టీ షర్ట్లుంటాయి. మక్కబుట్టకు ఉప్పుకారం చిరుతిండ్లు అమ్మే వాళ్లయితే మన ముఖాలు చూసి భారతీయులను గుర్తు పట్టేస్తారు. పాశ్చాత్యులు ఇష్టపడే రుచులు, భారతీయుల ఇష్టాలను గ్రహించి వ్యాపారం చేస్తారు. మనం మొక్క జొన్న కండెకు ఉప్పు, కారం పట్టించి తింటామని వాళ్లకు తెలుసు. మనల్ని చూడగానే ‘ఇండియన్స్’ అంటూ మసాలా రాయమంటారా అని అడుగుతారు. తమిళులు– సింహళీయులకు మధ్య పోరు గురించి తెలిసిన వారిగా మనకు కొంత జంకు, భారతీయులను స్వాగతిస్తారో లేదోననే భయం ఉంటుంది. కానీ, శ్రీలంక వాళ్లు భారతీయులను ఆత్మీయంగా చూస్తారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: క్యాండీ మ్యూజియంలో భారత బౌద్ధం!) -
130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి !అందుకు ఆ గుహ..
ఆదిమానవులు ఉనికి ఉందని ఎప్పటి నుంచే చెబుతూనే ఉన్నారు చరిత్రకారులు. అందుకు చారిత్రక ఆధారాలు ఏమిటి అనేదాని గురించి పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రాచీన యుగంలో క్రీస్తూ పూరం 1300 ఏళ్ల క్రితం అని అంచనాలు వేసి చెప్పేరే గానీ అందుకు కచ్చితమైన ఆధారాలు లేకపోయాయి. తవ్వకాల్లో వారి ఉనికి ఉందని చెప్పే పనిమూట్లు, వారికి సంబంధించిన మానవ ఎముకల ఆధారంగా చెప్పడం జరిగింది. దీని గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న శాస్రతవేత్తల కృషి ఇప్పటికీ ఫలించింది. మానువులు ఎప్పటి నుంచి ఉన్నారు. ఆ తర్వాత నిష్క్రమించి ఎటు వెళ్లారనే వాటి గురించి వెలుగులోకి వచ్చిన ఆధారాలను చూసి పరిశోధకులే కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే..గ్రీస్‌లోని థెస్సాలీలోని మధ్య గ్రీకు ప్రాంతంలో థియోపెట్రా అనే గుహ వద్ద పురావస్తు శాఖ ఎన్నో ఏళ్లుగా తవ్వకాల్లో జరిపింది. ఆ తవ్వకాల్లో ఆ గుహ మానవజాతి మూలాలను గూర్చి వెల్లడించింది. ఆ తవ్వకాల్లో అనేక మనుషుల ఎముకలు, వారు ఉపయోగించిన రాతి పనిముట్లు, జంతువుల ఎముకలు, పూరాత మానవ నిర్మిత నిర్మాణాలను కనుగొన్నారు. 13 వేల ఏళ్ల క్రితం నుంచే మానువులు ఉన్నారని రేడియో కార్బన్ ఆధారాలు చెబతున్నాయి. వారిలో నియాండర్తల్‌లు అనే మానవ జాతి ఉనికిలో ఉన్న నాటి మానవ జాతుల్లో ఒకటని చెప్పారు. వారు బలిష్టంగా కండలు తిరిగి ఉండేవారని, విచిత్రంమైన కనుబొమ్మలు, పొడుచుకుని వచ్చినట్లు ముక్కులు కలిగి ఉండేవారని తెలిపారు. ఈ నియాండర్తల్‌లు మానవులు జీవించే విధానం కంటే భిన్నంగా జీవితాన్ని గడిపేవారని అన్నారు. కొన్ని రకాల అడవి జంతువులను వేటాడేవారని, తమను తాము రక్షించుకునేందుకు కఠినమైన గుహ వాతావరణంలో జీవించేవారని అన్నారు. ఐరోపా అంతటా ఉన్న గుహల్లో ఉండేవారని పరిశోధనలో వెల్లడించారు. అంతేగాదు థియో పెట్రా గుహ మానవ నిర్మిత ప్రదేశంలో ఇదే ఒకటిగా పేర్కొన్నారు. ఇక్కడ నుంచి మానవులు సుమారు 50 వేల ఏళ్ల క్రితం నుంచి నిష్క్రమించారని తెలిపారు. 1987 నుంచి తప్పకాలు.. ఈ గుహ ఒక లోయ పైన సుమారు వంద మీటర్లు(330 అడుగులు) వరకు విస్తరించి ఉందని చెప్పారు. దీన్ని థియోపెట్రా రాక్ అని పిలేచే వారని, ఇక్కడ సున్నపురాయి కొండ ఈశాన్యవాలు చూడవచ్చని చెప్పారు. ఈ గుహకు సమీపంలో పినయోస్ నదికి చెందిన లెథాయోస్ నది ప్రవహిస్తుంది. ఇక పురావస్తు శాఖ అధికారులు 1987 నుంచి ఈ గుహ వద్ద తవ్వకాలు జరపడం ప్రారంభించారు. అలా 2007వరకు కొనసాగింది. ఈ మధ్య కాలంలో అనేక విశేషమైన ఆవిష్కరణలు జరిగాయి. పురావస్తు పరిశోధన మొదట ప్రారంభించినప్పుడూ థియోపెట్రా గుహా స్థానిక గొర్రెల కాపరులు తమ జంతువులును ఉంచడానికి తాత్కాలిక ఆశ్రయంగా ఉపయోగించేవారని భావించారు. కానీ ఈ గుహ తవ్వేకొద్ది ఆధ్యాంతం కొంగొత్త విషయాలను వెల్లడించింది. ఇందులో బయటపడ్డ అవక్షేపాలన్నీ ఆసక్తికలిగించే సరికొత్త విషయాలను తెలియజేశాయి. ( చదవండి: అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..) -
అనారోగ్యంతో తుర్కియే గుహలో చిక్కుబడిన అమెరికా అన్వేషకుడు
ఇస్తాంబుల్: తుర్కియేలోని ఓ గుహలో వెయ్యి మీటర్ల లోతులో అనారోగ్యంతో చిక్కుకుపోయిన అమెరికాకు చెందిన మార్క్ డికే(40)ను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ అన్వేషణలో భాగంగా తుర్కియేలోని టారస్ పర్వతాల్లో ఉన్న మోర్కా గుహల్లోకి మార్క్ డికే వెళ్లారు. మోర్కా గుహ లోతు 1,276 మీటర్లు కాగా, మార్క్ డికే 1,120 మీటర్ల లోతులోని బేస్‌క్యాంప్‌లో ఉన్నారు. జీర్ణాశయంలో రక్తస్రావం కారణంగా ముందుకు వెళ్ల్లలేని స్థితిలో ఉండిపోయారని యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ ప్రకటించింది. ఆయనకు అనేక అంతర్జాతీయ గుహాన్వేషణల్లో పాలుపంచుకున్న అనుభవం ఎంతో ఉంది. గృహల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడంలో స్వయంగా ఆయన సిద్ధహస్తుడని వివరించింది. సాధారణ పరిస్థితుల్లో అనుభవజు్ఞలైన గృహాన్వేషకులకే అక్కడికి వెళ్లేందుకు 15 గంటలు పడుతుందని టర్కిష్ కేవింగ్ ఫెడరేషన్ వివరించింది. మార్క్ డికే కోసం ఆరు యూనిట్ల రక్తం పంపించామని టర్కీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. డికేను కాపాడేందుకు తుర్కియే, అమెరాకాతోపాటు హంగరీ, బల్గేరియా, ఇటలీ, క్రొయేíÙయా, పోలాండ్ దేశాలకు చెందిన 150 మంది నిపుణులను రప్పిస్తున్నట్లు యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ తెలిపింది. ఎంతో క్లిష్టమైన ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజుల వరకు పట్టవచ్చని చెబుతున్నారు. -
200 ఏళ్ల నేలమాళిగలోకి దూరిన అమ్మాయిలు.. లోపల ఏముందో చూసి..
ఒక యువతికి తమ ఇంటి కింది భాగంలో ఒక రహస్య గది కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులకు, అధ్యాపకులకు తెలిపింది. దీంతో వీరంతా ఆ గదిలోనికి వెళ్లి, లోపల ఏముందో చూసే ప్రయత్నం చేశారు. ఆ గది 1800 శతాబ్దం నాటిదని గుర్తించారు. ఈ ఉదంతం బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో చోటుచేసుకుంది. ది సన్ రిపోర్టును అనుసరించి ఈ నేలమాళిగ 200 ఏళ్ల క్రితం నాటిది. అమ్మాయిలంతా దానిలోనికి వెళ్లి చూడగా వారికి అక్కడ ఒక ఫ్లోర్ కనిపించింది. అక్కడ నాలుగు మూలలా బెంచీలు కనిపించాయి. అలాగే పలు అల్మరాలు కూడా ఉన్నాయి. అది వారికి ఒక స్టోర్ రూమ్ మాదిరిగా కనిపించింది. ఆ యువతి కుటుంబం ఈ ఇంటిలోకి షిష్ట్ అయ్యే సమయంలో వారికి ఈ సంగతి తెలియదు. నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్శిటీ జర్నలిజం విద్యార్థి స్టెఫానీ బెన్నెట్.. కొద్దిపాటి భయాందోళనల వాతావరణం మధ్య తన ఈ నూతన ఆవిష్కరణ ఎలా జరిగిందో మీడియాకు తెలియజేసింది.. ‘అదేమీ పెద్ద గది కాదు. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగివుంది. ఈ ఆవిష్కరణ ఎంతో ఆసక్తికరంగా సాగింది. లోపల ఏముందో చూడాలనే ఆసక్తితో తామంతా ఒకేసారి ఆ గదిలోనికి ప్రవేశించాం. అయితే ఆ గదిని ఎందుకు వినియోగించేవారో కనుగొనలేకపోయాం’ అని పేర్కొంది. ఈ యువతుల బృందం ఈ విషయాన్ని స్థానిక పురాతత్వ శాస్త్రవేత్తలకు తెలియజేసింది. వారు వెంటనే గుహను సందర్శించారు. అది రెండు శతాబ్ధాల క్రితం నిర్మితమయినదని తెలిపారు. నాటింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ యాక్టింగ్ ఆర్కియాలజిస్ట్ స్కాట్ లోమాక్స్ మాట్లాడుతూ ఆ గుహ ఒక నేలమాళిగ అని తెలిపారు. దానిపైన భవనం నిర్మితమవడాన్ని గమనిస్తే అది 19వ శతాబ్దం నాటిదిగా తెలుస్తున్నదన్నారు. ఈ నేలమాళిక అనేక పురాతన విశేషాలను తెలియజేస్తుందన్నారు. ఇది కూడా చదవండి: ‘ఆరోపణలతో పెరుగుతున్న ఆదరణ’.. ట్రంప్ మరో వింత వ్యాఖ్యానం! -
గుహనే ఇల్లుగా మార్చేసి..ఆ ఇంటితోనే..
గుహను ఇల్లుగా మార్చేసి, ఆ ఇంటితోనే స్వయం ఉపాధి పొందుతున్నాడు గ్రాంట్ జాన్సన్ అనే ఈ అమెరికన్ పెద్దమనిషి. సరిగా చదువుకోక పోవడంతో పదిహేడేళ్ల వయసులోనే ఇతన్ని బడి నుంచి సాగనంపేశారు. బడి నుంచి బయటపడ్డాక పొట్టపోసుకోవడానికి గని కార్మికుడుగా కుదురుకున్నాడు. గనుల్లో పనిచేసి, కూడబెట్టుకున్న సొమ్ముతో 1995లో 25 వేల డాలర్లు (ర.15.60 లక్షలు) పెట్టి యూటా శివార్లలో 40 ఎకరాల బీడు భమిని కొన్నాడు. ఈ భూమి కొన్నప్పుడు అతడి మిత్రులంతా పనికిరాని భమి కొని వెర్రిబాగుల పని చేశాడంటూ అతడిని తిట్టిపోశారు. గ్రాంట్ వాళ్ల మాటలను పట్టించుకోలేదు. తాను కొన్న భూమిలోనే ఉన్న కొండ గుహను ఏళ్ల తరబడి శ్రమించి 5,700 చదరపు అడుగుల విస్తీర్ణం గల చూడచక్కని ఇంటిగా తయారు చేశాడు. అధునాతనమైన ఇంటికి కావలసిన హంగులన్నింటినీ అందులో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ఇంటిని పర్యాటకులకు అద్దెకు ఇస్త, వచ్చే ఆదాయంతో నిక్షేపంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇందులోని ఒక గదిలో బస చేసేందుకు ఒక రాత్రికి 350 డాలర్లు (ర.28,741), ఇల్లు మొత్తంగా అద్దెకు కావాలనుకుంటే ఒక రాత్రికి వెయ్యి డాలర్లు (ర.82,119) చెల్లించాల్సి ఉంటుంది. గ్రాంట్ ఈ భూమిని కొన్నప్పుడు ఇక్కడ ఉండే గుహ ప్రవేశమార్గం చాలా చిన్నగా ఉండేది. డైనమైట్లతో దాన్ని పేల్చి, మార్గాన్ని విశాలం చేశాడు. లోపలి గోడలను స్వయంగా తన చేతులతోనే ఉలి, సుత్తి వంటి పరికరాలను పట్టుకుని నున్నగా చెక్కాడు. నేల మీద మొజాయిక్ ఫ్లోరింగ్ చేయించాడు. నీటి సరఫరాకు పైపులు వేయించాడు. పైఅంతస్తుకు, కింది అంతస్తుకు రాకపోకలు జరుపుకోవడానికి మెట్లు ఏర్పాటు చేశాడు. విద్యుత్తు, టెలిఫోన్ కనెక్షన్లు ఏర్పాటు చేయించుకున్నాడు. సలక్షణమైన ఇంటిగా మార్చుకున్నాక, ఈ గుహనే అద్దెకిస్త స్వయం ఉపాధి పొందుతున్నాడు. (చదవండి: ఆకాశమే హద్దుగా.. స్కైడైవింగ్ చేస్తూ పెళ్లి..) -
ప్రపంచంలోని టాప్ 10 పురాతన గుహ చిత్రాలు
-
ప్రపంచ రికార్డు: 50 ఏళ్ల వయసు, 500 రోజులు ఒక్కత్తే.. గుహలో...
స్పెయిన్ అథ్లెట్ 50 ఏళ్ల బీట్రస్ ఒక ఆరోగ్య ప్రయోగంలో భాగంగా 500 రోజులు గుహలో ఒక్కత్తే గడిపి మొన్న (శుక్రవారం) బయటకు వచ్చింది. బయట నుంచి మాత్రమే నిపుణుల పర్యవేక్షణ ఉన్నా 260 అడుగుల లోతు గుహలో అదరక బెదరక జీవించింది. ఎక్కువ రోజులు గుహలో ఒంటరిగా జీవించిన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న బీట్రస్ కథా కమామీషు... ‘లోపలకు వెళ్లాక రెండు నెలల వరకూ లెక్క బెట్టాను. ఆ తర్వాత రోజుల్ని లెక్క బెట్టుకోవడం మానేశాను. సహాయక బృందం లోపలికి వచ్చి నన్ను బయటకు తెచ్చే వరకు ఏ 160 రోజులో ఉన్నాననుకున్నాను. కాని 500 రోజులు ఉన్నాను. కాలం ఇట్టే గడిచిపోయింది’ అంది బీట్రస్ ఫ్లెమినీ. తన 48వ ఏట నవంబర్ 21, 2021 తేదీన స్పెయిన్‌లోని గ్రనాడా పట్టణం సమీపంలో ఉన్న ఒక గుహలోకి బీట్రస్ అడుగుపెట్టింది. మళ్లీ 50వ ఏట ఏప్రిల్ 14, 2023న బయటకు వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం గుహలో ఒక్కత్తే గడిపింది. ‘ఈ కాలంలో బయట ఏం జరిగిందో నాకు తెలియదు’ అందామె. గ్రనడా యూనివర్సిటీ, అల్మేరియా యూనివర్సిటీలోని శాస్త్ర నిపుణులు గుహలలో, పర్వతారోహణలో ఒక్కరిగా చిక్కుకుపోయినప్పుడు మనిషి ‘సర్కేడియన్ రిథమ్’ (వెలుతురు, చీకటిని బట్టి మానవ శరీర, మానసిక స్థితుల్లో 24 గంటల్లో వచ్చే మార్పు) అధ్యయనం చేయడానికి బీట్రస్ను గుహలోకి పంపారు. క్యాలెండర్, గడియారం ఏమీ ఇవ్వలేదు. 60 పుస్తకాలు, వెయ్యి లీటర్ల నీరు, స్టవ్, ఆమె కదలికలను బయటి నుంచి గమనించడానికి సెన్సర్స్‌ను తీసుకొని ఆమె లోపలికి వెళ్లింది. ‘నేను నాతో మాట్లాడుకుంటూ గడిపాను, వ్యాయామం, టోపీలు అల్లడం, పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం... వీటితో టైమ్ సరిపోయింది. ఒక్కోసారి భ్రాంతి కలిగేది’ అని తెలిపింది. ఆమె ద్వారా వచ్చిన రీడింగ్స్‌ను శాస్త్రజ్ఞులు ఇప్పుడు క్రోడీకరించే పనిలో పడ్డారు. Athlete Beatriz Flamini spent almost two years alone in an underground cave. And she makes it sound pretty relaxing... Follow us on Gab: https://t.co/IuhLFQBQPc pic.twitter.com/e7nlKR9Kyc — RT (@RT_com) April 15, 2023 -
అకస్మాత్తుగా కుంగిన రోడ్డు..ఒక్కసారిగా కుక్క, రెండు బైక్‌లు..
ఇటీవలకాలంలో పలు మెట్రో నగరాల్లో రోడ్లు అకస్మాత్తుగా కుంగిన ఘటనలను ఎన్నోచూశాం. భారీ వర్షాల కారణంగా నీళ్లు నిలిచిపోవడంతో ఇలాంటి ఘటనలు ఎదువ్వడం చూశాం. కానీ ఉన్నట్టుండి..అదికూడా ఒక ఇరుకు సందు రోడ్డు కుంగిపోవడం అందర్నీ షాక్ గురి చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న ఓ కుక్క, రెండు బైక్‌లో ఆ గుంతలో పడిపోయాయి. జస్ట్ అప్పుడే అటగా వచ్చిన ఒక వాహనదారుడు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ఇరుకైన రోడ్డు సందులో రెండు బైక్‌ల మధ్య ఒక కుక్క కూర్చొని కనిపిస్తోంది. అంతే అకస్మాత్తుగా రోడ్డు కూలినట్లు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఏం జరిగిందో అనుకుంటూ..కొంతమంది రాగా, ఇంతలో మరోభాగం కూడా కూలిపోతుంది. ఫిబ్రవరి 22న ఢిల్లీలోని ఆర్కే పురం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసకుంది. ఐతే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అలాగే ఆ రోడ్డును మరమత్తు చేసినట్లు కూడా తెలిపారు. #WATCH | A road collapsed in Delhi’s RK Puram area on February 22. A dog and a bike fell inside a hole formed after a narrow passage of the road collapsed. No fatalities were reported: Delhi Police (CCTV visuals verified by Police) pic.twitter.com/EbK2Q6no0P — ANI (@ANI) February 25, 2023 (చదవండి: భారత్ గగనతలంపై స్పై బెలూనా? అదీకూడా అమెరికా కంటే..) -
భక్తుల కొంగుబంగారం.. ఇష్ట కామేశ్వరిదేవి
దట్టమైన అభయారణ్యంలో బండరాళ్ల మధ్య కుదుపులతో కూడిన ప్రయాణం. అనుక్షణం భయం, ఉత్కంఠ, ఆహ్లాదం, ఆనందం ఇవన్నీ కలగలపి చేసే యాత్రే ఇష్టకామేశ్వరీదేవి దర్శనయాత్ర. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంజివారిపల్లె బీట్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన ఇష్టకామేశ్వరి దేవతను దర్శించుకోవాలంటే కొంచెం సాహసమే.. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): భారతదేశం మొత్తం మీద ఆ దేవి రూపాన్ని ఆ ఒక్క క్షేత్రంలో మాత్రమే దర్శించుకోగలం. అందుకే ఆ దేవి దర్శనం ఒక సాహసయాత్ర. దట్టమైన అభయారణ్యంలోని ఓ చిన్న గుహలో వెలసిన జగజ్జనని దర్శనంతో ఆ తల్లి మన ముందు సజీవంగా నిలిచిన అనుభూతినిస్తుంది. ఒకప్పుడు కేవలం కాపాలికులు, సిద్ధులు మాత్రమే సేవించిన మహామహన్విత ఇష్టకామేశ్వరిదేవి నేడు సామాన్య భక్తులు కూడా దర్శించుకోగలుగుతున్నారు. చెంచు గిరిజనుల నివాసాల మధ్య బండరాళ్లను పేర్చి కట్టిన చిన్న మండపానికి ముందు రేకుల షెడ్డుతో సాదాసీదాగా ఉంటుంది ఇష్టకామేశ్వరి దేవీ ఆలయం. జగద్గురువులు ఆదిశంకరాచార్యులతో పాటు ఎంతో మంది సిద్ధులు అమ్మవారిని దర్శించుకుని అక్కడే సాధన చేశారని పురాణాలు చెపుతున్నాయి. ప్రసిద్ధ శ్రీశైల పుణ్యక్షేత్రంలో కొద్దిమందికి మాత్రమే తెలిసిన మహాన్విత కేత్రం ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి ఆలయం కూడా ఒకటని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఎంత గొప్ప కోరికైనా ఈ అమ్మవారిని కోరుకుంటే తీరుతుందని పురాణాల్లో నానుడి. ఆకట్టుకునే అమ్మవారి స్వరూపం చతుర్భుజాలతో, రెండు చేతులలో తామర మొగ్గలు, మరో చేతిలో శివలింగం, మరో చేతితో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లుగా ఒక యోగినిలా అర్ధనిమీలిత నేత్రాలతో జ్ఞానముద్రలో ఉన్నట్లు ఎంతో కళాత్మకంగా కనబడుతుంది ఇష్టకామేశ్వరీ అమ్మవారు. భూగర్భంలోని ఓ చిన్న దేవాలయంలో కొలువుతీరి ఉంటుంది ఇష్టకామేశ్వదేవి. కిటికీ మాదిరిగా ఉండే చిన్న ముఖద్వారం ద్వారా మోకాళ్ల మీదుగా ఒక్కరొక్కరుగా లోనికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారి దర్శనానికి ముందు మార్గమధ్యంలో వెలసి వినాయకుడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నం, పొంగళిని నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, బ్రమరాంభాదేవి వెలసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు ఇక్కడ వెలి«శారని స్థల పురాణాలు చెపుతున్నాయి. మానవకాంతను పోలిన అమ్మవారి నుదురు అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరి చేత స్వయంగా బొట్టు పెట్టించటం ఇక్కడ అనవాయితీ. అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు అమ్మవారి నుదురు రాతి విగ్రహం మాదిరిగా కాకుండా ఒక మానవ కాంత నుదుటిని తాకినట్లుగా మెత్తగా చర్మాన్ని తాకినట్లుగా ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు. భక్తులు ధర్మబద్ధంగా కోరే ఏ కోరికైనా అమ్మవారు తీరుస్తారని ప్రతీతి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు ఈదన్న పేర్కొంటున్నారు. అమ్మవారికి కొందరు భక్తులు చీర, సారెలను బహూకరిస్తారని అర్చకులు పేర్కొంటున్నారు. సాహసోపేతమైన దర్శనయాత్ర.. నల్లమల అభయారణ్యంలో వెలసిన ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శంచుకోవాలంటే కాస్తంత సాహసం చేయాల్సిందే. ఈ యాత్ర యావత్తూ వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే టైగర్ రిజర్వు అటవీ ప్రాంతం కావటంతో అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. కొంతకాలంగా ఈ యాత్ర అటవీశాఖ అనుమతులతోనే సాగుతుంది. శ్రీశైలం సమీపంలో ఉన్న శిఖరం వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. శిఖరం వద్ద అటవీశాఖ అధికారులు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి అలయానికి చేరుకోవటానికి టికెట్లు బుక్ చేసుకుంటారు. 5 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్లే ప్రతి వ్యక్తికి రూ.1000 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఒక్కో వాహనంలో కేవలం 8 మంది మాత్రమే వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. అలా మొత్తంగా రోజుకు 15 జీపులు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తారు. టికెట్లు తీసుకున్న అరగంట నుండే వాహనాలు ప్రారంభమవుతాయి. ఇలా కష్టసాధ్యమైన యాత్రను చేసే ప్రతి ఒక్కరూ తాము కోరిన కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అవి తీరగానే తమ మొక్కులను తీర్చుకుంటుంటారు. -
రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!
బ్రిటన్: మనం ఎక్కడైన అడవిలోనో లేక ఏదైనా నిర్మానుష్య ప్రదేశంలో చిక్కుకుపోయి, ఆఖరికి మొబైల్ ఫోన్లు పనిచేయనపప్పుడూ అది అత్యంత భయంకరంగా అనిపిస్తుంది. జనసంచారం లేని ఒక గుహలో రెండు రోజులుగా అది కూడా గాలి, వెలుతురు లేని ప్రదేశంలో అలా పడి ఉంటే ఎవ్వరికైన పై ప్రాణాలు పైకి పోతాయి. కానీ అతని కోసం 240 మంది సహాయ సిబ్బంది వచ్చి తక్షణ సహాయ చర్యలు చేపట్టి అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. అసలు ఎక్కడ ఏం జరిగిందే చూద్దాం రండి. (చదవండి: టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!) అసలు విషయంలోకెళ్లితే....యూకేలో ఒక వ్యక్తి బ్రెకాన్ బీకాన్స్లోని గుహ వ్యవస్థల గురించి అధ్యయనం చేసే పరిశోధకుడు. అనుకోకుండా 50 అడుగుల లోతులో పడిపోతాడు. దీంతో అతని ఎముకలు చాలా వరకు విరిగిపోతాయి. దీంతో అతన్ని రక్షించడం కోసం దాదాపు 240 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇందులో యూకేకి చెందిన ఎనిమిది కేవ్ రెస్క్యూ బృందాలు కూడా ఉన్నాయి. సుమారు 54 గంటల తర్వాత అతను గుహ నుండి విజయవంతంగా బయటపడ్డాడు. ఇది వెల్ష్ కేవింగ్ చరిత్రలో సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ నిలిచింది. ఆ తర్వాత సదురు వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. (చదవండి: వర్క్ ఫ్రం హోం: ఎక్స్ ట్రా వర్క్‌కి చెక్ పెట్టేలా కొత్త చట్టం) -
20 ఏళ్లుగా గుహకే పరిమితం.. టీకా ఇచ్చిన అధికారులు
బెల్గ్రేడ్: సెర్బియాకు చెందిన పాంటా పెట్రోవిక్(70) మనుషుల ప్రవర్తనతో విసిగిపోయాడు. ముఖ్యంగా జనాల్లో పెరిగిపోతున్న అవినీతిని చూసి తట్టుకోలేకపోయాడు. చుట్టూ జరుగుతున్న దారుణాలను చూసి ఎంతో బాధపడ్డాడు. వారిలో మార్పు తేవడానికి ప్రయత్నించాడు. కుదరలేదు.. తానే మారిపోయాడు. మనుషులకు దూరంగా అడవిలోకి వెళ్లి.. ఓ గుహలో జీవించసాగాడు. గత 20 ఏళ్ల నుంచి పాంటా ఇలా గుహలోనే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పాంటా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ‘‘జనావాసాలకు దూరంగా ఉంటున్నావ్ కదా.. నీకేందుకు భయం’’ అంటే.. ‘‘అసలే అది కరోనా వైరస్.. ఎవరిని వదిలిపెట్టదు.. ఇక్కడకు రాగలదు.. నా గుహలోకి కూడా ప్రవేశిస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా టీకా తీసుకున్నాను. అదనపు డోస్‌తో కలిపి మూడు టీకాలు తప్పకుండా తీసుకుంటాను. మీరు కూడా వ్యాక్సిన్ వేయించుకోండి’’ అని కోరాడు పాంటా. గతేడాదే తనకు వైరస్ గురించి తెలిసిందన్నాడు. ఇక ఇలా మనుషులకు దూరంగా.. గుహలో జీవించడం గురించి పాంటా మాట్లాడుతూ.. ‘‘నగరంలో ప్రశాంతంగా.. స్వేచ్ఛగా బతకలేకపోయాను. ఎవరో ఒకరితో అనుక్షణం గొడవపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అలాంటి గొడవలు ఏం ఉండవు. ప్రశాంతంగా జీవించగలుగుతున్నాను’’ అని తెలిపాడు. ఈ గుహలోకి రావడానికి ముందు దినసరి కూలీగా పని చేసేవాడు. గుహ జీవితం ప్రాంరభించడానికి ముందు తన ఆస్తులను చుట్టుపక్కలవారికి దానం చేశాడు పాంటా. ఇక ఆహారం కోసం పాంటా అడవిలో అన్వేషిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు సమీపంలోని చెరువులో చేపలు పట్టడం చేస్తుంటాడు. ఎక్కువగా పుట్టగొడుగులను తింటుంటాడు. ఇక గుహలో పడుకోవడానికి రెండు బెంచీలు, ఓ టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నాడు. ‘‘దొరికింది తింటూ.. అడవిలో సంచరిస్తూ.. స్వేచ్ఛగా జీవిస్తున్నాను.. ఇది నాకు ఎంతో తృప్తినిస్తుంది’’ అంటున్నాడు పాంటా. -
హైనాల స్థావరం.. గుహ నిండా ఎముకలే
రియాద్ : ఏడు వేల సంవత్సరాల నాటి హైనాల స్థావరాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సౌదీ అరేబియాలోని ఓ లావా గుహలో ఈ స్థావరాన్ని గుర్తించారు. ఈ గుహ మొత్తం ఎముకలతో నిండి ఉంది. ఈ గుహలో దాదాపు 40 రకాల జంతువుల ఎముకలు బయటపడ్డాయి. వీటిలో మనుషులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, మేకలు, జింకలు, ఇతర హైనాల ఎముకలు సైతం ఉన్నాయి. ఈ గుహ కొన్ని వేల సంవత్సరాల పాటు హైనాలు విందు ఆరగించే ప్రదేశంగా ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హైనాలు మాంసం కోసం స్మశాన వాటికలలోని మనుషుల మృతదేహాలను గుహలోకి లాక్కువచ్చుంటాయని అభిప్రాయపడుతున్నారు. 2007లో ఈ గుహను కనుగొన్నప్పటికి లోపలినుంచి జంతువుల అరుపులు వినపడ్డంతో పరిశోధకులు లోపలికి వెళ్లేప్రయత్నం చేయలేదు. ఈ గుహనుంచి పరిశోధనల నిమిత్తం 1,917 ఎముకలు, పళ్లను వెలికి తీశారు. వీటిలో 1,073 ఎముకలు అస్థిపంజరానికి చెందినవిగా గుర్తించారు. 13 శాంపిల్స్‌ను రేడియో కార్బన్ డేటింగ్ టెస్ట్ చేయగా వాటిలో కొన్ని ఎముకలు 6,839 ఏళ్ల నాటి వని తేలింది. హైనాలు ఒకరకంగా చెప్పాలంటే సర్వభక్షకాలు. అయితే, ఎక్కువగా మాంసాహారానికి మొగ్గుచూపుతాయి. ఇతర జంతువుల్ని గుంపుగా వేటాడి, చంపి తింటాయి. ఇతర జంతువులకంటే హైనాల జీర్ణవ్యవస్థ ప్రత్యేకమైనది. జంతువుల అన్ని రకాల ఎముకలను సైతం తిని అరిగించుకోగలవు. -
తల్లిదండ్రులతో గొడవ.. సొరంగం తవ్విన యువకుడు
మాడ్రిడ్: సాధారణంగా తల్లిదండ్రులు.. తమ పిల్లలు అల్లరి చేసినప్పుడు తిట్టడమో.. కొట్టడమో చేస్తూంటారు. దానికి.. పిల్లలు మహ అయితే, కాసేపు అలగడం, భోజనం మానేయడమో చేస్తుంటారు. మరికొంత మంది అల్లరి పిల్లలు ఇంట్లో చెప్పకుండా.. పక్కింట్లో లేదా తెలిసిన వారింటికో వెళ్లిపోతారు. అలాంటి వారంతా, కోపం తగ్గగానే తిరిగి తమ ఇంటికి చేరుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే, స్పెయిన్ కు చెందిన ఒక కుర్రాడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ సంఘటన 2015లో చోటుచేసుకుంది. స్పెయిన్ కు చెందిన 14 ఏళ్ల ఆండ్రెస్ కాంటోకు ట్రాస్ సూట్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో సూట్ ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లాలని భావించాడు. కానీ, తల్లిదండ్రులు దీనికి అంగీకరించలేదు. బయటకు వెళ్లవద్దని కోప్పడ్డారు. దీంతో అలిగిన ఆ బాలుడు ఇంటి వెనకాల ఉన్న పేరడును తవ్వడం మొదలుపెట్టాడు. ప్రతి రోజు స్కూల్ నుంచి రావడం.. ఇంటి వెనుక వెళ్లి సొరంగం తవ్వడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఆ బాలుడు ప్రతిరోజు దాదాపు 14 గంటలపాటు పాటు నేలను తవ్వేవాడు. ఇలా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 ఆరు సంవత్సరాలు పాటు తవ్వాడు. ఈ క్రమంలో 3 మీటర్ల లోతులో ఒక గుహలాగా ఏర్పడింది. ఈ సొరంగం తవ్వడంలో అతనికి ఒక మిత్రుడు కూడా సహకారం అందించాడు. ఈ గుహలో, ఉండటానికి గదిని.. దాంట్లో ఒక బెడ్, కుర్చీని ఏర్పాటు చేసుకున్నాడు. బాత్రూంను కూడా నిర్మించుకున్నాడు. అంతటితో ఆగకుండా వైఫైను సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సొరంగం పూర్తయ్యే నాటికి ఆండ్రెస్కు 20 ఏళ్లు. అయితే, ఈవీడియోను ఆండ్రెస్ కాంటో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ భలే.. ఉంది బాసు నీ ఐడియా ’, ‘ వర్ష కాలంలో జాగ్రత్త’, ‘ నీ అలకకు.. హ్యాట్సాఫ్.’ ‘ మేము చిన్నప్పుడు అలిగాం.. కానీ ఇలాంటి ఆలోచన మాకు రాలేదు’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
ఈతకని వచ్చి గుహలో చిక్కుకుపోయాడు
బీజింగ్ : కొన్ని ఘటనలు అప్పుడప్పుడు మనను ఆశ్చర్చానికి గురి చేస్తాయి. ఏడేళ్ల బాలుడు సరదాగాఈత కొడదామని వచ్చి గుహలో చిక్కకున్న ఘటన చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ యోంగ్జియా కౌంటీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. యోంగ్జియో ప్రాంతానికి చెందిన ఒక బాలుడు తన తాత లావో ఈ తో కలిసి బీచ్‌లో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఇద్దరూ ఈత కొడుతుండగా బాలుడు మిస్ అయ్యాడు. చుట్టుపక్కల గాలించినా ఆచూకి లేదు. దీంతో తాత చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి బాలుడి మిస్సింగ్ గురించి చెప్పారు. దీంతో వారంతా వచ్చి బీచ్‌లో బాబుని వెతకసాగారు. ఇంతలో ఒక రంధ్రంలో బాలుడి చేయి కనిపించింది. కాపాడండి అంటూ అరుపులు వినిపిస్తున్నాయి. చేయి పట్టేంత రంధ్రంలోకి అతను ఎలా పట్టాడు అని అక్కడి వాళ్లెవరికీ అర్థం కాలేదు. నదీతీరంలో ఈ రంధ్రం ఎలా వచ్చిందని ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. నదీ తీరంలో ఉన్న నేల సాధారణమైనది కాదు. అది గుహ పై భాగం. ఈ గుహకు వెళ్లాలంటే నది నుంచి మార్గం ఉంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. బాలుడు ఈత కొడుతున్నప్పుడు సుడిలో ఇరుక్కుపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో అతడిని గుహలోకి నెట్టేసింది. చీకటిగా ఉండడంతో బాలుడు భయంతో గజగజా వణికి పోయాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందివ్వగా వచ్చి బాలుడిని ప్రాణాలతో రక్షించారు. -
అదొక మృత్యులోయ.. ఎవరూ బతికి రాలేదు
అదొక మృత్యులోయ.. అందులో పడిన వారు ఇప్పటి వరకు ఎవరూ బతికి బయటికి రాలేదు. స్థానికులు చెబుతున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు నలుగురు ఆ గుహలోకి వెళ్లి అస్థిపంజరాలుగా మారారు. వండాడి కొండపై మేతకు వెళ్లి తప్పిపోయిన గొర్రెలు ఏవీ తిరిగి రాలేదనే విషయాలను పశువుల కాపర్లు చెప్పడం విశేషం. అంతటి భయానకమైన లోయలో పడిన చిన్నారులు ముగ్గురు చిరంజీవులుగా బయట పడ్డారు. లోయలో నుంచి బయటపడిన చిన్నారులు మాట్లా డుతూ అమ్మనాన్నలను చూస్తామనుకోలేదని కంటతడి పెట్టుకున్నారు. రాయచోటి టౌన్ : రూరల్ పరిధిలోని మాధవరం వడ్డెపల్లెకు చెందిన ముగ్గురు చిన్నారులు సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి ఆడుకొంటూ గ్రామ సమీపంలోని వండాడి కొండపైకి వెళ్లారు. కేరింతలు కొడుతూ బండలపై దూకుతూ కొండ చివరి వరకు వెళ్లారు. అప్పటికే సాయంత్రం అయింది. ఇక చాలు ఇంటికి పోదాం రండిరా అని పెద్దోడు రెడ్డిబాబు తమ్ముడు సురేష్‌బాబుకు, బావమర్ధి గిరిబాబుకు చెప్పాడు. వీరు ఇద్దరూ వెళ్లిన దారి గుండా తిరిగి వెనక్కు రాకుండా ఎదురుగా జారుడు బండపైకి దూకారు. దానిపై పాకుతూ వెళ్లితే త్వరగా కిందకు దిగేయచ్చు అనుకొన్నారు. కానీ అదే వారిని ఇరకాటంలో పడేసింది. జారుతూ వెళ్లిన ఇద్దరూ లోయలో పడిపోయారు. పెద్దవాడైన రెడ్డిబాబు కేకలు వేయడం మొదలు పెట్టాడు. (చీకటి గుహ నుంచి చిన్నారులకు విముక్తి) మామిడి తోట రైతు పిల్లవాడి కేకలు విని.. కొండ కింద ఓ మామిడి తోట రైతు కేకలు విని ఆ కొండవైపు మేకలు తోలుకొచ్చేవారికి విషయం చెప్పాడు. మీ పల్లెకు చెందిన మేకలోళ్లు ఏమైనా ఇంటికి వచ్చారేమో ఒక సారి చూడమన్నాడు. అప్పటికే సాయంత్రం కావడంతో తమ పిల్లలు ఇళ్ల వద్ద లేరనే విషయం ఇరుగుపొరుగువారికి చెప్పడంతో విషయం అందరికీ అర్థమయింది. గ్రామంలోని చాలా మంది అక్కడికి వెళ్లి వారిని వెతికేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీరి ప్రయత్నం విఫలం కావడంతో సాయంత్రం 6గంటల తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశంతో.. అర్బన్ సీఐ రాజు వెంటనే తన సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకొని వెతికే ప్రయత్నం చేశారు. ఆ లోయలో పడిన వారు తిరిగి రారనే విషయం తెలియడంతో వీరిలో ఆందోళన మరింత ఎక్కువయ్యింది. మరుసటి రోజు చూద్దామనే మాటలు తల్లిదండ్రులలో ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు మాత్రం వారికి ధైర్యం చెబుతూ క్షణం క్షణం ఓ యుగంగా గడుపుతూ ఉన్న చిన్నారులను స్థానికుడు, తమ సిబ్బంది సాయంతో రోపులు వేసి ఆ లోయలోకి వెళ్లారు. అప్పటికే వెంకటరమణ, ప్రసాద్ అనే మరో ఇద్దరు గుహ వద్ద కాపలాగా ఉన్నారు. వెళ్లిన వారు రోపు సాయంతో ముగ్గురు చిన్నారులను బయటకులాగారు. అప్పటికే అర్ధరాత్రి దాటింది. మాధ వరం గ్రామంతో పాటు వండాడి గ్రామం, చుట్టుపక్కల నుంచి వందలాది ప్రజలు పిల్లలను చూడటానికి తరలి వచ్చారు. దేవుడిలా మా బిడ్డలను కాపాడారు లోయలో పడిపోయిన వారు ఎవరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అలాంటి చోట పడిన ఇక మా బిడ్డలు వస్తారనే నమ్మకం లేదు. పిల్లలను కాపాడేందుకు పోలీసులు, మా బంధువు మిలటరీ ఆయన వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవుడిలా లోయలోకి వెళ్లి అర్థరాత్రి దాటాక మా బిడ్డలను పైకి తీసుకొచ్చారు. – సురేష్ బాబు, రెడ్డిబాబుల తల్లిదండ్రులు సరస్వతి, చలపతి మా అమ్మను చూస్తాననుకోలేదు లోయలో పడిపోయాక మా అమ్మకాడికి పోతా నని అనుకోలేదు. చాలా భయమేసింది. నీళ్ల దప్పి క..ఆకలితో ఎంత అరి చినా ఎవరూ పలకలేదు. దప్పికేసిన ప్రతి సారి మా అమ్మ వస్తుందని ఎదురు చూశాను. చూసి చూసి రాత్రి అయ్యింది. మా అన్న లోయపైన ఉన్నాడు. – సురేష్‌బాబు, లోయలో పడిన చిన్నారి ప్రాణాలను లెక్కచేయకుండా.. వండాడి కొండపై ఆడుకొంటూ వెళ్లి లోయలో పడిపోయారు. అందులో నుంచి రారనుకున్నాం. మా బంధువు గంగాధర్, అర్బన్ సీఐ జి. రాజు, ఎస్ఐలు మహమ్మద్‌రఫీ, తాహీర్ హుస్సేన్‌లతో పాటు చాలా మంచి పోలీసులు కష్టపడ్డారు. ప్రాణాలకు తెగించి మా బిడ్డలను కాపాడారు. జీవితాంతం రుణపడి ఉంటాం. – గిరిబాబుతో తల్లి ప్రజాపతి -
చీకటి గుహ నుంచి చిన్నారులకు విముక్తి
వైఎస్ఆర్ జిల్లా, రాయచోటి టౌన్: రాయచోటి పరిధిలో చీకటి గుహలో చిక్కుకున్న చిన్నారులకు విముక్తి లభించింది. పోలీసులు, గ్రామస్తులు శ్రమించి చాకచక్యంగా ఎట్టకేలకు అర్ధరాత్రి ముగ్గురు పిల్లలను సురక్షితంగా గుహ నుంచి బయటకు తీసుకొచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముగ్గురు చిన్నారులు..వీరిలో ఇద్దరు(రెడ్డిబాబు, గిరిబాబు) ఆరో తరగతి చదువుతున్నారు. మరో బాలుడు సురేష్ మూడో తరగతి చదువుతున్నాడు. లాక్డౌన్ కావడంతో స్కూళ్లకు సెలవులు..వీరిది రాయచోటి రూరల్ పరిధిలోని మాధవరం వడ్డెపల్లె..సోమవారం మధ్యాహ్నం వీరంతా ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటుండగానే సాయంత్రమైంది. సరదాగా కొండెక్కుదామనుకున్నారు. 500 మీటర్ల మేర ఎక్కేశారు. తీరా అక్కడికి చేరేసరికి చీకటి పడిపోయింది. దీంతో దగ్గరలోని గుహలో చిక్కుకుపోయారు. ఈలోగా వారి తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి రాకపోయే సరికి వెతకసాగారు. ఎందుకైనా మంచిదని కొండమీదకు వెళ్లారేమోనని సందేహించారు. పోలీసులకు తెలియజేశారు. వెంటనే గ్రామస్తులను వెంటబెట్టుకుని పోలీసులు కొండెక్కారు. గుహ సమీపంలో పిల్లల అలికిడి వినిపించింది. అక్కడే లోపల ఉన్నారని గమనించారు. గుహలో వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఒక సెల్‌ఫోన్ లోపలికి తాడు సాయంతో పంపి మరొకరు ఫోన్ చేశారు. ఆ ఫోన్లో చిన్నారులు మాట్లాడారు. వారికి వాటర్ బాటిల్ కూడా పంపారు. గుహలోకి పోయేందుకు వీలు లేకుండా ఉంది. ప్రయత్నాలు ఆపకుండా చేస్తూనే ఉన్నారు. తాడు సాయంతో గుహలోకి ఒకరిని పంపి అత్యంత చాకచ క్యంగా ముగ్గురు పిల్లలను ఎట్టకేలకు అర్ధరాత్రి బయటికి తీసుకొచ్చారు. దీంతో ఉత్కంఠ వీడింది. వారి తల్లిదండ్రులలో ఆనందం వెల్లివిరిసింది. -
లాక్డౌన్ : ఈ గుహే ఆ టెకీ ఆవాసం..
భోపాల్ : దేశంలో మార్చి 24న లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచీ మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలోని ఓ గుహలో తలదాచుకున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు. లాక్డౌన్ ప్రకటించిన సమయంలో నర్మదా పరిక్రమ యాత్రలో ఉన్న ముంబైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అటవీ ప్రాంతంలో చిక్కుకుని, అప్పటి నుంచి అక్కడి గుహలో ఉంటున్నారు. ఆ వ్యక్తిని గుర్తించిన మధ్యప్రదేశ్ పోలీసులు అతని బంధువులకు అప్పగించారు. ఉదయ్‌పుర ప్రాంతంలోని అడవుల్లోని ఓ గుహలో నివసిస్తున్న వీరేంద్ర సింగ్ డోగ్రాను ఆదివారం సాయంత్రం పోలీసులు కనుగొన్నారు. ఆ వ్యక్తి వద్ద కొన్ని దుస్తులు, చేతిలో మహాభారతం పుస్తకం ఉన్నాయని తెలిపారు. నర్మదా పరిక్రమలో ఉన్న వీరేంద్ర సింగ్ మార్గమధ్యంలో లాక్డౌన్ ప్రకటించడంతో చిక్కుకుపోయారని రైసెన్ జిల్లా ఎస్పీ మోనికా శుక్లా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని అమర్కంటక్ నుంచి గుజరాత్ వరకూ నర్మదా నదీపరీవాహక ప్రాంతంలో ఆయన పర్యటన చేపట్టారని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో మార్చి 22న లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు వీరేంద్ర సింగ్ కందర్వి గ్రామంలోని తమ బంధువు శశిభూషణ్ ఇంట్లో ఆగారని అధికారులు చెప్పారు. ఆదివారం సాయంత్రం అటవీ ప్రాంతంలోని గుహలో వీరేంద్ర సింగ్‌ను అక్కడి పశువుల కాపరులు గుర్తించి అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. కాగా తాను నవీ ముంబైలో ఉంటానని, తమ సోదరి హైదరాబాద్‌లో ఉంటారని వీరేంద్ర పోలీసులకు వివరించగా, ఆయనను పోలీసులు కందర్వి గ్రామంలోని బంధువు ఇంటికి తరలించారు. చదవండి : హైవే ఎక్కుతున్నారా.. ఆలోచించండి! -
కదలకుండా అదే స్థానంలో ఏడేళ్లు ఎలా?
ఏదైనా జీవి కదలకుండా ఉందంటే దానిని రెండు సార్లు పరిశీలిస్తాం. ఒకవేళ అప్పటికి కదలకుండా ఉంటే అది చనిపోయిందని భావిస్తాం. కానీ ఇక్కడ ఉన్న సాలమండర్(బల్లి జాతి) మాత్రం చాలా తెలివైనది. ఎంతలా అంటే ఏడు సంవత్సరాలుగా చనిపోయిన దానిలా నటిస్తూ అలాగే కదలకుండా ఉండిపోయింది. వినడానకి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఒక గుహలో ఉంటున్న ఈ సాలమండర్ ఏడు సంవత్సరాల క్రితం ఏ స్థానంలో ఉందో ఇప్పుడు కూడా అదే స్థానంలో ఉండడం విశేషం.అయితే ఆహారం లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉంటుంది, పైగా ఒక్క అంగుళం కదలకుండా ఎలా ఉంటుందనే డౌటు మీకు వచ్చే ఉంటుంది. కానీ అసలు విషయం అక్కడే ఉందటున్నారు దానిని పరీక్షించిన శాస్త్రవేత్తలు. అదేంటంటే... సాలమండర్లు దాదాపు 100 సంవత్సరాలు బతకగలవు. సాలమండర్ ఆహారం లేకున్నా తన చిన్న శరీరంలో విడుదలయ్యే ఎంజైమ్ ద్వారా అది తినకుండా అలాగే ఉండిపోతుందట. అందుకే అవి ఆహారం లేకుండా కొన్ని సంవత్సరాలు జీవించేయగలవు. దీంతో పాటు ఇవి మహా బద్దకస్తులు.. ఎంతలా అంటే ఒక అంగుళం కూడా ముందుకు కదలకుండా ఉన్న స్థానంలోనే కొన్ని సంవత్సరాల పాటు కదలకుండా అలాగే ఉండిపోతాయి. కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం అది కొన్నాళ్ల పాటు నిద్రాణవస్థలో ఉంటుందని, అందుకే అది అలా కదలకుండా ఉండిపోతుందని పేర్కొన్నారు. ఏదైతేనేం.. అసలు ఏడు సంవత్సరాల నుంచి అదే స్థానంలో ఉంటూ అంగుళం కూడా కదలకుండా ఉన్న సాలమండర్‌ను మెచ్చుకొని తీరాల్సిందే. European cave salamander stayed in the same spot for seven years 2,569 days without movinghttps://t.co/XzBSegEaUx pic.twitter.com/SAs7V3BjTK — Andy P. (@MummyComic) February 4, 2020 -
మోదీ ధ్యాన గుహకు విశేషాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు ఉత్తరాఖండ్‌లోని కేదారినాథ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడికి సమీపంలోని ఓ గుహను సందర్శించి అక్కడ కాసేపు ధ్యానం చేసిన విషయం తెల్సిందే. ఆ గుహకు కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆ గుహను ‘ఆధునిక ధ్యాన గుహ’ లేదా ‘రుద్ర గుహ’ అని పిలుస్తారు. ఆ గుహలో ఇద్దరు కొంచెం కష్టంగా, ఒక్కరు హాయిగా పడుకునేందుకు ఓ మంచం, ఆ మంచం మీద ఓ మెత్తటి పరుపు ఉంటుంది. పగటి పూట ప్రకృతి అందాలను తిలకించేందుకు మంచం పక్కనే ఓ కిటికీ కూడా ఉంది. గుహకు మరోపక్కన స్నానం చేసేందుకు కుళాయితో కూడిన సదుపాయం, మరో దిక్కున టాయిలెట్ సౌకర్యం ఉంది. ఆలయానికి సరిగ్గా కిలోమీటరు దూరంలో, సముద్ర మట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఈ గుహ ఉంది. పొడువు ఐదు మీటర్లు, వెడల్పు మూడు మీటర్లు ఉండే ఈ గుహలో 24 గంటల విద్యుత్ సౌకర్యం, చార్జింగ్ ప్లగ్గులు ఉన్నాయి. టెలిఫోన్ సౌకర్యం ఉంది. స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యంతోపాటు మనిషి సాయం కూడా ఉంది. అక్కడున్న గంట కొట్టగానే 24 గంటలపాటు అందుబాటులో ఉండే అటెండర్ వస్తాడు. ఉదయం తేనీరు, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ సరఫరా చేస్తారు. విడిచిన చొక్కాలను తగిలించుకునేందుకు నాలుగైదు కొక్కాలు గల హ్యాంగర్ (మోదీ ఫొటోలో కుడివైపు కనిపిస్తుంది)కూడా ఉంది. ఎప్పుడు చల్లగా ఉండే ఈ గుహకు ఎయిర్ కండీషన్ సౌకర్యం మాత్రం లేదు. ‘గార్వల్ మండల్ వికాస్ నిగమ్’ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గుహను గతేడాది కృత్రిమంగా నిర్మించారు. దీనికి ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఖర్చయిందట, కేదారినాథ్ ఆలయానికి వచ్చే భక్తులను ఆకర్షించడానికి ఇక్కడ ఇలాంటి నాలుగైదు గుహలను నిర్మించాలనుకున్నారు. ఇంతకుముందు ఈ రుద్ర గుహను కనీసంగా మూడు రోజులపాటు బస చేసేలా మూడువేల రూపాయలకు అద్దెకు ఇచ్చేవారు. పర్యాటకులు ఒక్క రోజుకు మించి ఇక్కడ ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడక పోతుండడంతో ఇటీవల రోజువారి ప్యాకేజీని ప్రవేశపెట్టారు. టీ, టిఫిన్, భోజన సదుపాయాలతో రోజుకు 990 రూపాయలను ఛార్జి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ఈ గుహలోనే పడుకొని ఆదివారం ఉదయం బయల్దేరి వెళ్లారు. ఆయన మొత్తం ఈ గుహలో 17 గంటలపాటు గడపగా, మీడియా పొరపడి ఆయన ఈ గుహలో 17 గంటల పాటు ధ్యానం చేశారు అని రాసింది. బీజేపీ అధికారికంగా ‘కేదారినాథ్‌లో ధ్యానం చేస్తున్న కర్మయోగి’ అంటూ నాలుగు ఫొటోలతో ట్వీట్ చేసింది. ఇదెక్కడ ఆదివారం నాటి పోలింగ్‌ను ప్రభావితం చేస్తుందోనని భయపడిన సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. మోదీ తన వ్యక్తిగత విశ్వాసాలకు మీడియా ప్రచారం కల్పించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారి ఎన్నికల ప్రచారంపై ఒకటి, రెండు రోజులపాటు నిషేధం విధించి చేతులు దులుపుకునే అలవాటున్న మన ఎన్నికల కమిషన్‌కు, ఆఖరి విడత పోలింగ్ ముగియడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రస్తుతానికి మౌనం వహించింది. దేనికైనా స్పందించే గుణం కలిగిన నెటిజన్లు మాత్రం కృత్రిమ గుహలో మోదీ ధ్యానం చేయడం పట్ల వ్యంగోక్తులు విసురుతున్నారు. వారిలో ఒకరు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎప్పుడో జమ్మూలోని వైష్ణవి దేవీ గుహను సందర్శించిన ఫొటోను ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీకన్నా ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జాయ్ షా మే 9 నుంచి 11వ తేదీ వరకు ఈ గుహలో బసచేసి వెళ్లారు. ఈ గుహను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. మోదీ రాకతో తమ గుహకు మహర్దశ పట్టుకున్నట్లేనని, దీంతో పర్యాటకుల తాకిడి పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ‘గార్వల్ మండల్ వికాస్ నిగమ్’ జనరల్ మేనేజర్ బీఎల్ రానా మీడియాతో వ్యాఖ్యానించారు. -
గుహ కూలి 12 మంది దుర్మరణం!
భువనేశ్వర్: ఒడిశాలోని గజపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భారీ వర్షాల నుంచి తప్పించుకునేందుకు బరఘరా గ్రామానికి చెందిన కొందరు ఓ గుహలోకి వెళ్లగా, ఒక్కసారిగా అది కుంగిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద నలిగిపోయి 12 మంది చనిపోయినట్లు భావిస్తున్నామని సహాయక చర్యల ప్రత్యేక కమిషనర్ బీసీ సేథి తెలిపారు. మరో నలుగురి జాడ తెలియడంలేదు. సహాయక చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తు నిర్వహణ ప్రతిస్పందన బృందాన్ని(ఎన్డీఆర్ఎఫ్) పంపామన్నారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. మార్గమంతా చెట్లు కూలిపోయాయి. మరోవైపు తిత్లీ విధ్వంసంపై సమీక్ష నిర్వహించిన ఒడిశా సీఎం పట్నాయక్.. గంజాం, గజపతి, రాయగఢ్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పునరావాస శిబిరాల్లో 1.27 లక్షల మంది తలదాచుకుంటున్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న తిత్లీ తుపాను పేరును కొందరు తమ పిల్లలకు పెట్టారు. తుపాను తీరం దాటేముందు, దాటిన తర్వాత పుట్టిన పిల్లలకు తిత్లీ (హిందీలో సీతాకోకచిలుక అని అర్థం) అని పేరు పెట్టారు. -
ఆ క్షణం అద్భుతం
చియాంగ్ రాయ్: థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుని 18 రోజుల తర్వాత బయటపడిన 12 మంది బాలురు, వారి ఫుట్‌బాట్ కోచ్ బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జయి ఇళ్లకు చేరుకున్నారు. ఆస్పత్రి బయట ఈ సందర్భంగా వారు తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. గుహ నుంచి బయటపడటం ఓ అద్భుతమని పిల్లలు వ్యాఖ్యానించారు. రెండు వారాలకుపైగా గుహలో ఉండటంతో ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకి ఉంటాయేమోనన్న అనుమానంతో వారిని చియాంగ్రాయ్లోని ఓ ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచడం తెల్సిందే. తొలుత పిల్లలను గురువారం ఇళ్లకు పంపాలని నిర్ణయించినప్పటికీ ఒకరోజు ముందుగానే వారిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అందరు పిల్లలతోపాటు, వారి కోచ్ కూడా పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. కాగా, ఇళ్లకు వెళ్లాక నెలపాటు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా పిల్లలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేలా చూడాలని వైద్యులు సూచించారు. ఆ గుహలోని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడగనున్న ప్రశ్నలను ప్రభుత్వం ముందుగానే తెప్పించుకుని, మానసిక వైద్యులకు చూపించి, బాలుర ఆరోగ్యానికి ఏ ఇబ్బందీ ఉండదనుకున్న ప్రశ్నలనే అనుమతించారు. పిల్లలు ఇళ్లకు రావడంతో అమితానందంగా ఉందని, ఈ రోజు ఓ శుభదినమని బాలుర కుటుంబ సభ్యులు చెప్పారు. -
మీడియా ముందు థాయ్ చిన్నారులు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకుని 18 రోజుల నరకం తర్వాత బయటపడిన పిల్లలు, వారి ఫుట్‌బాల్ జట్టు కోచ్ తొలిసారి ప్రజల ముందుకొచ్చారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ చిన్నారులు, వారికి చికిత్స అందిస్తున్న వైద్యులతో కలసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిన్నారులు మాట్లాడుతూ.. గుహలో తాము ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. తొలుత చిన్నారులు అందరికి నమస్కారం చెబుతూ, ఫుట్‌బాల్ చేతిలో పట్టుకొని వేదికగా వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్థలంలో కొద్ది సేపు ఫుట్‌బాల్ ఆడారు. వారు సరాదాగా ఫుట్‌బాల్ ఆడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై వస్తున్న తప్పుడు వార్తలకు డాక్టర్లు తెరదించారు. వారు మాట్లాడుతూ.. చిన్నారులతో పాటు వారి కోచ్ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. వారందరి బరువు సరాసరిగా 3 కేజీలు పెరిగినట్టు తెలిపారు. కాగా గత నెల 23న ‘వైల్డ్ బోర్స్’ అనే ఫుట్‌బాల్ జట్టు సభ్యులైన 12 మంది పిల్లలు (అందరి వయసు 11–16 ఏళ్ల మధ్య) సాధన తర్వాత తమ కోచ్‌తో కలిసి గుహలోకి సాహస యాత్రకు వెళ్లి చిక్కుకుపోగా వారందరినీ కాపాడటానికి 18 రోజులు పట్టడం తెలిసిందే. గురువారం వైద్యులు చిన్నారులను వారి ఇళ్లకు పంపిచనున్నారు. -
మీడియా ముందు థాయ్ చిన్నారులు
-
నోరు జారాడు.. అనుభవిస్తున్నాడు
థాయ్ కేవ్ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ బ్రిటీష్ డైవర్‌పై.. టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సదరు డైవర్ అసలు సహాయక చర్యల్లో పాల్గొనలేదని.. పైగా అతను చిన్నారులను లైంగికంగా వేధించే వ్యక్తి అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. థాయ్ కేవ్ ఆపరేషన్‌లో భాగంగా వైల్డ్ బోర్ అనే డైవర్స్ టీం సహాయక చర్యల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ బృందంలో బ్రిటీష్ డైవర్ వెర్నోన్ అన్స్వోర్త్ కూడా ఉన్నారు(మ్యాపింగ్ రూట్ సమాచారం అందించటం...). టెస్లా తరపున సహాయక చర్యల కోసం మస్క్.. జలంతర్గాములను పంపించాడు. అయితే అవి చాలా చిన్నవిగా ఉన్నాయని, ఆపరేషన్‌కి పనికి రాలేదని, ఆ విషయం తెలిసికూడా టెస్లా కేవలం ప్రచార ఆర్భాటం కోసమే వాటిని పంపిందని వెర్నోన్ పేర్కొన్నారు. దీంతో మండిపోయిన మస్క్.. వెర్నోన్ను విమర్శిస్తూ ఆదివారం సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేశారు. ‘మా సబ్మెరెన్లు పనికి రావని ఆ పెద్ద మనిషి అన్నారు. కానీ, ఆయన సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు ఎక్కడా కనిపించలేదు. కేవలం ప్రచారం కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం కూడా నాకు ఈ మధ్యే తెలిసింది. ఆయనొక పెడో. (పెడో.. పైడోఫిలేకి సంక్షిప్త రూపం.. పిల్లల్ని ప్రలోభ పెట్టి లైంగికంగా వాడుకోవటం). అలాంటి వ్యక్తి చేసే పనికిమాలిన కామెంట్లను పట్టించుకోవటం.. మాకు అవమానం’ అంటూ వరుసగా ట్వీట్లు చేశాడు. అయితే ఈ విషయంలో వెర్నోన్కే మద్ధతుగా చాలా మంది నిలిచారు. మస్క్‌ను విమర్శిస్తూ పెద్ద ఎత్తున్న పోస్టులు వెల్లువెత్తటంతో చివరకు మస్క్ ఆయా ట్వీట్లను డిలేట్ చేశారు. ఇక ఈ విషయంపై అన్స్వోర్త్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీడియా కథనాల ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది. మస్క్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నా’ అని వెల్లడించారు. భారీ నష్టాలు.. ఇదిలా ఉంటే మస్క్ చేసిన ట్వీట్లు టెస్లా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. సోమవారం దాదాపు 4 శాతానికిపైగా షేర్లు పడిపోవటంతో 295 మిలియన్ డాలర్ల మేర నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఆటోమేకర్ రంగంలో దిగ్గజం అయిన టెస్లా.. ఎలోన్ మస్క్ నిర్ణయాలు, ప్రవర్తన మూలంగా ఏడాది కాలంలో 2 బిలియన్ డాలర్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది. కాగా, ఎలోన్.. టెస్లా కొంప ముంచుతున్నాడంటూ బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘థాయ్ గుహ’పై డిస్కవరీలో డాక్యుమెంటరీ
న్యూఢిల్లీ: వరదనీటితో నిండిన థాయిలాండ్ గుహ నుంచి చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సాహసోపేతమైన ఘటనను డిస్కవరీ చానెల్ డాక్యుమెంటరీగా ప్రసారంచేయనుంది. 12 మంది చిన్నారులు, వారి ఫుట్‌బాల్ కోచ్‌ను కాపాడేందుకు అంతర్జాతీయ డైవింగ్ నిపుణుల బృందాలు చేసిన అవిశ్రాంత కృషిని ఆద్యంతం ఆసక్తికరంగా డాక్యుమెంటరీలో చూపనున్నారు. డిస్కవరీ చానెళ్లలో ఈ డాక్యుమెంటరీ గంటపాటు ఈనెల 20 (శుక్రవారం)న రాత్రి 9గంటలకు ప్రసారంకానుంది. -
సాహస వీరులు
-
సాహసం-హీరోయిజం.. అందమైన కథ!
-
సాహసం-హీరోయిజం.. అందమైన కథ!
చిమ్మ చీకట్లో పదిహేను రోజులకుపైగా బిక్కుబిక్కుమంటూ ఆటగాళ్లు, కోచ్. తినటానికి తిండి లేదు.. మట్టి నీరు తప్ప. చుట్టూ విషపూరిత పాములు.. భయానక పరిస్థితులు. ముందు.. అసలు బతికున్నారో లేదో అన్న అనుమానాలు. ఆచూకీ లభించాక వారిని వెలుపలికి తెస్తామో లేదో అన్న సంశయం. వెరసి ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి ఆసక్తిగా తిలకించిన వేళ థాయ్‌లాండ్ ‘థామ్ లూవాంగ్ గుహ’ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కోచ్‌తోపాటు 12 మంది పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. అయితే ఓ సినిమాకు ఇంతకన్నా మంచి స్క్రీన్‌ప్లే దొరకదన్న ఉద్దేశంతో పలు ప్రఖ్యాత సంస్థలు దీనిని తెరకెక్కించేందుకు ఎగబడిపోతున్నాయి. ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్పై సుమారు 60 మిలియన్ డాలర్ల ఖర్చుతో(దాదాపు 400 కోట్ల) బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని నిర్మాతలు మైకేల్ స్కాట్, అడమ్ స్మిత్‌లు అధికారికంగా ప్రకటించారు. ‘ఈ ఘటనలో సాహసం ఉంది. హీరోయిజం ఉంది. ఓ సినిమాకు ఇంతకన్నా ఏం కావాలి. అయినా ఇది ఓ చిత్రం మాత్రమే కాదు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వీరులకు, మరణించిన డైవర్‌కు ఈ చిత్రం అంకితమిస్తున్నాం’ అని మైకేల్ స్కాట్ తెలిపారు. ఇక మరో దర్శకుడు ఎమ్ చూ కూడా ఈ థాయ్ ఆపరేషన్‌ను చిత్రంగా మలిచేందుకు సిద్ధమయ్యారు. ‘ఇదో అందమైన కథ. ప్రపంచం మొత్తాన్ని ఊపిరి బిగపట్టేలా చేసిన ఈ ఆపరేషన్‌ను.. తెరపై చూపించటం గర్వంగా ఫీలవుతున్నా’ అని ఆయన ప్రకటించారు. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఇవన్హోయె పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ రెండింటిలో ఒకటి కోచ్ ఎక్కపోల్ చాంతవోంగ్ కోణంలో తెరకెక్కుతుండగా.. మరొకటి గుహ సహయక ఆపరేషన్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు థాయ్ మీడియా ఛానెళ్లు కథనాలను ప్రచురించాయి. I refuse to let Hollywood #whitewashout the Thai Cave rescue story! No way. Not on our watch. That won’t happen or we’ll give them hell. There’s a beautiful story abt human beings saving other human beings. So anyone thinking abt the story better approach it right & respectfully. — Jon M. Chu (@jonmchu) 11 July 2018 -
థాయ్ గుహ : నేర్వదగిన పాఠాలు ఎన్నో..!
పదిహేడు రోజులుగా ప్రపంచం మొత్తం కళ్లప్పగించి భయం భయంగా... ఉత్కంఠభరితంగా చూసిన అత్యంత సంక్లిష్టమైన ప్రమాదకర విన్యాసం సుఖాంతమైంది. థాయ్‌లాండ్‌లోని థామ్ లుయాంగ్ నాంగ్ నాన్ గుహలో చిక్కుకున్న 12మంది బాలురనూ, వారి కోచ్‌నూ వివిధ దేశాల గజ ఈతగాళ్ల బృందం మంగళవారం క్షేమంగా వెలుపలికి తీసుకొచ్చింది. ఒకపక్క ప్రపంచమంతా రష్యాలో జరుగుతున్న సాకర్ పోటీల మైకంలో మునిగి ఉండగా హఠాత్తుగా థామ్ లుయాంగ్ గుహ ఉదంతం తోసుకొచ్చి దాన్నంతటినీ తుడిచిపెట్టింది. పిల్లల బృందం చిక్కుకున్న సమాచారం వెల్లడైనప్పటినుంచీ దేశమేదైనా, మతమేదైనా, ఏ జాతీయులైనా, ఏ భాష మాట్లాడేవారైనా కోరు కున్నదొకటే... ఆ పిల్లలు సురక్షితంగా బయటకు రావాలని. గత నెల 23న గుహను చూడటానికెళ్లిన పిల్లల ఫుట్‌బాల్ బృందం ఉన్నట్టుండి కురిసిన భారీ వర్షాలు, వాటితోపాటు వచ్చిన వరద నీటితో ఎటూ కదలడానికి లేకుండా చిక్కుకుపోవడం, వారి ఆచూకీ బయటి ప్రపంచానికి తెలియకపోవడం అందరిలోనూ భయాందోళనలు కలిగించింది. వారు ఆ గుహలోకి వెళ్లి ఉండొచ్చునన్న అంచనాకు రావడానికే రెండురోజుల సమయం పట్టింది. ఆ తర్వాత బృందం ఎత్తయిన ప్రదేశంలో సజీవంగా ఉండొచ్చునని నిర్ధారించుకోవడానికి మరికొన్ని రోజులు పట్టింది. చివరకు తొమ్మిది రోజుల తర్వాత ఈ నెల 2న తొలిసారి గజ ఈతగాళ్ల బృందం బాలుర సమీపానికి చేరుకుని వారితో మాట్లాడింది. వీడియో తీసింది. వారు ఆహారం, నీళ్లు తీసుకెళ్లేవరకూ ఆ పసి ప్రాణాలు తమ దగ్గరున్న అరకొర తినుబండారాలతో అర్థాకలితో గడిపాయి. వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు ఈ ఉదంతంపై స్పందించిన తీరు అద్భుతమని చెప్పాలి. ఆ పసి ప్రాణాలను కాపాడాలని వరద నీటితో నిండిన గుహల్లో ఈదడానికి ప్రత్యేక శిక్షణ పొందిన మెరికల్లాంటి గజ ఈతగాళ్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, స్పేస్ ఎక్స్ ప్రాజెక్టు సృష్టికర్త ఎలాన్ మస్క్ సైతం ఆ గుహలో పనికొచ్చేలా ఒక జలంతర్గామిని తయారు చేయించుకుని వచ్చి అక్కడే ఉండిపోయాడు. అది చివరకు ఉపయోగపడకపోయినా ఆ పిల్లల క్షేమంపై ఆత్రుత ప్రదర్శించి శ్రద్ధ పెట్టిన మస్క్ తీరు మెచ్చదగ్గది. ఈ మొత్తం ఆపరేషన్ ఎవరి ఊహలకూ అందనంత ప్రాణాంతకమైనది. సుశిక్షితుడైన థాయ్ నావికాదళ గజ ఈతగాడొకరు మరణించడం దీనికి తార్కాణం. సర్వసాధారణంగా గుహలు మనుష్య సంచారానికి అనువుగా ఉండవు. ప్రకృతిసిద్ధమైన వింతలు, విశేషాలను చూసితీరాలన్న ఆసక్తి ఉన్నవారు సైతం ఎంతో శ్రమకోర్చేవారైతే తప్ప అలాంటిచోటుకు వెళ్లరు. సరిగ్గా ఎనిమి దేళ్లక్రితం చిలీ గనిలో 33మంది కార్మికులు చిక్కుకున్న ఉదంతంతో కూడా దీన్ని పోల్చలేం. ఎందు కంటే వారంతా నిత్యం గనికి రాకపోకలు సాగించే పనిలో ఉన్నవారే. ఎలాంటి ప్రమాదమైనా ఏర్ప డవచ్చునన్న ఎరుకతో నిరంతరం అప్రమత్తమై ఉంటారు. కానీ ఈ ఉదంతం అలాంటిది కాదు. గుహ వెలుపలి నుంచి బాలురు చిక్కుకున్న ప్రాంతం నాలుగు కిలోమీటర్ల దూరం. పైనుంచి లెక్కేస్తే ఆ ప్రాంతం కిలోమీటరు లోతున ఉంది. అక్కడికి చేరాలంటే ఇరుకైన మార్గం తప్ప వేరే దారి లేదు. ఆ దారి కూడా కంటకప్రాయమైనది. ఎన్నో వంపులతో, ఎత్తుపల్లాలతో... వరద నీటితో, బురదతో నిండి ఉంది. కన్ను పొడుచుకున్నా కానరానంత దట్టమైన చీకటి. అలాంటి పరిస్థితుల్లో ఎంత చేయి తిరిగినవారైనా ఆ ఇరుకైన దారిలో ఒకవైపు ఈదుకెళ్లడానికి అయిదు గంటల సమయం పడుతుంది. అందుకే ఈ ఆపరేషన్ మొత్తం ఓ కంటితుడుపు చర్యే కావొచ్చునని అందరూ భావించారు. పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. వారిని వెలుపలికి తీసుకురావడానికి కనీసం నాలుగు నెలల సమయం పట్టొచ్చునని తొలుత నిపుణులు చెప్పినప్పుడు ఆ పిల్లలు చనిపోవడం ఖాయమనుకున్నారు. అన్ని నెలలకు సరిపడా ఆహారం, నీళ్లు అందించినా వెలుతురు కిరణాలు సోకని చోట అంత సుదీర్ఘకాలం మనోధైర్యంతో వారు మనుగడ సాధించడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. గబ్బిలాలు మాత్రమే తిరిగేచోట వాటిద్వారా ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదమున్నదని కూడా అనుకున్నారు. నిజానికి భారీ వర్షాలు తమ ప్రతాపం చూపకపోయి ఉంటే వరదనీరు తగ్గేవరకూ వారిని అక్కడే ఉంచడం మంచిదని నిపుణులు అభిప్రాయపడేవారు. కానీ అవి రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చి వరద నీరు అంతకంతకు పెరుగుతూ పోవడంతో ఏదో ఒకటి చేసి ఆ పిల్లల్ని మృత్యు పరిష్వంగం నుంచి బయటకు తీసుకురావాల్సిందేనన్న కృత నిశ్చయానికొచ్చారు. ఈ ఉదంతంలో ఏ రంగంలోవారైనా నేర్వదగిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. సంక్షోభ సమయాల్లో మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో ఆ పిల్లలు ఆచరించి చూపారు. తాను అర్ధాకలితో ఉన్నా బృందంలోని పిల్లలకు లోటు రానీయకుండా చూసుకున్న పాతికేళ్ల కోచ్ ఎకపోల్ చాంతన్వాంగ్ నాయకత్వ స్థానంలో ఉన్నవారు ఎంతటి త్యాగానికి సంసిద్ధులై ఉండాలో నిరూపిం చాడు. తిండికి కొరతగా ఉన్నప్పుడు, ఆక్సిజెన్ నానాటికీ తగ్గుముఖం పడుతున్నప్పుడు మానసిక కుంగుబాటు దరి చేరకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరిలో వణుకు మొదలైనా అది బృందం మొత్తాన్ని ఆవరిస్తుంది. ఎవరినీ ప్రాణాలతో మిగల్చదు. మన గురజాడ ‘ఎల్లలోకములొక్క ఇల్లై... వర్ణభేదములెల్ల కల్లై’ ఈ ప్రపంచం ఉండాలని మనసారా కాంక్షించాడు. ప్రపంచంలో ఏమూలనున్నవారు సంక్షోభంలో చిక్కుకున్నా ఆ ఆపద అందరిదీ అనుకుని ముందుకురకడమే మానవీయత అనిపించుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఇటీవలికాలంలో ఆ దృక్పథం కొడిగడుతోంది. దేశాలకుండే భౌగోళిక హద్దులకు మించి మనుషుల మధ్య నిలువెత్తు అడ్డుగోడలు పుట్టుకొస్తున్నాయి. అవి నానాటికీ విస్తరిస్తున్నాయి. ‘మనవాళ్లు’ కాదని, అన్య మతస్తులని, వేరే దేశస్తులని కారణాలు చెప్పుకుని మనుషులు బండ బారిపోతున్నారు. కళ్లముందు తోటి మనిషిని కొట్టి చంపుతున్నా గుడ్లప్పగించి చూస్తూ ఉండి పోతున్నారు. అలా ఉండటమే ఔన్నత్య చిహ్నమని నూరిపోసే ధూర్తులు పాపంలా పెరిగి పోతున్నారు. ఇటు వంటి నిరాశామయ క్షణాల్లో థాయ్‌లాండ్ బాలురు, గజఈతగాళ్లు ఈ ప్రపం చంలో మనిషితనం ఇంకా బతికే ఉన్నదన్న తీయని కబురందించారు. సంక్షుభిత సమయాల్లో ఏమూలనో మానవీయత మొగ్గ తొడుగుతుందని, దాని పరిమళాలు అన్ని అవధులూ దాటుకుని పరివ్యాప్తమవుతాయని నిరూపించారు. -
గుహ వదిలింది గుండె నిండింది
పిల్లలంతా గుహలోంచి బయట పడ్డారు. కోచ్ కూడా బయటికి వచ్చాడు. ఈ అద్భుత ఘటనతో ఒక్క థాయిలాండ్ మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలన్నీ కూడా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో తమ జట్టే గెలిచినంతగా సంబరపడుతున్నాయి. జూన్ 23, 2018. థాయిలాండ్ చరిత్రలో మరచిపోలేని రోజు. థాయ్ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలో కూడా! యంగ్ సాకర్ టీమ్‌లో ఉన్న 12 మంది విద్యార్థులు ఆడుకుంటూ ఆడుకుంటూ.. థాయిలాండ్ గుహల్లోకి వెళ్లారు. అంతే అకస్మాత్తుగా వారంతా మాయమైపోయారు! విద్యార్థులకు ఫుట్‌బాల్ నేర్పిస్తున్న కోచ్ కూడా ఆ పిల్లలతో పాటు కనపడకుండా పోయారు. అకస్మాత్తుగా వచ్చిన వరదలు వారిని ప్రమాదంలోకి తోసేసాయి. థాయ్‌లాండ్‌లోని కొండప్రాంతమైన చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌లో కొండ గుహలో వీరంతా చిక్కుకుపోయినట్లు తొమ్మిదిరోజుల తరువాత గుర్తించారు. ఈ ప్రాంతం బ్యాంకాక్ నగరానికి 825 కి.మీ. దూరంలో ఉంది. జాడ తెలియడమే పెద్ద అదృష్టం గుహలో విద్యార్థులు చిక్కుకుపోయిన నాటి నుంచి ఆ పిల్లలు చదువుతున్న స్కూల్లో ప్రతిరోజూ మనసులను కదిలించే ఒక దృశ్యం కనిపించేది. మే సాయ్ ప్రసిట్సార్ట్ పాఠశాలలో విద్యార్థులంతా స్కూల్ ప్లే గ్రౌండ్లో వరుసలలో నిలబడి, తలలు వంచుకుని, చేతులు జోడించి, ‘స్నేహితులంతా క్షేమంగా తిరిగిరావాలి’ అని భగవంతుడిని ప్రార్థించేవారు. ఆ చిన్నారులు జోడించిన చేతులకు భగవంతుడు కొద్దిగా కరుణించాడు. తొమ్మిదిరోజుల పాటు ఆ విద్యార్థులు చేసిన ప్రార్థనలు ఫలించాయి. తప్పిపోయిన పిల్లల జాడ తెలిసింది. గుహలో నాలుగు కిలోమీటర్ల దూరంలో వరద నీటిలో చిక్కుకున్నట్లు గుర్తించారు! తల్లడిల్లిన స్నేహితులు ‘‘తొమ్మిది రోజుల తరవాత వాళ్లను గుర్తించామని చెప్పడం సంతోషంగా ఉంది. మా స్నేహితులు క్షేమంగా ఉన్నారన్న వార్త నాకు ఆనందం కలిగించింది’’ అన్నాడు తప్పిపోయిన విద్యార్థుల స్నేహితుడైన 14 సంవత్సరాల పువాడెట్ కుంగోయెన్. ‘‘వాళ్లకు ఏం జరుగుతుందా అని నాకు ఆందోళనగా ఉంది. ఆ గుహలు చీకటిగా, భయంగొలిపేవిగా ఉంటాయి. నేను పొరపాటున కూడా ఆ గుహలోకి వెళ్లడానికి సాహసించలేను’ అని గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు 14 ఏళ్ల కిటిచోక్ కొంకావ్. గుహలో చిక్కుకున్నవారిలో కొటిచోక్ స్నేహితుడు కూడా ఉన్నాడు. విద్యార్థులు గుహలో చిక్కుకుని రోజులు గడిచాయి. వారిని రక్షిద్దామంటే, లోపలకు వెళ్లే ఏకైక మార్గం వరద నీటితో మూసుకుపోయింది. సరదాగా ఫుట్‌బాల్ ఆడుకుందామనుకున్న వారితో విధి వింత నాటకం ఆడింది. ‘‘వాడు మళ్లీ తిరిగి వచ్చి, నన్ను సాకర్ ఆడమని అడగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అన్నాడు గద్గద స్వరంతో పువాyð ట్. తోటి మిత్రులు గుహలో చిక్కుకున్నారన్న వార్త స్కూల్ విద్యార్థులకు తెలియగానే ఆ పసి హృదయాలు అల్లాడాయి. ‘‘మా విద్యార్థులు బాధలో ఉన్నారు. ఈ వార్త వినగానే వీరంతా బిగ్గరగా ఏడ్వటం మొదలుపెట్టారు’’ అన్నారు ఆ స్కూల్లోని ఒక టీచరు. ప్రతిరోజూ రాత్రి సమయంలో గుహ దగ్గరకు వెళ్లి, పిల్లలకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటూనే ఉంది పాఠశాల యాజమాన్యం. బ్రిటిష్ ఈతగాళ్లే హీరోలు ‘‘మా పిల్లలకు ఇలా జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదు. ప్రస్తుతం పాఠశాలలో ఉన్న పిల్లలకు ‘‘వారంతా అజాగ్రత్తగా ఉండటం వల్లే ఇది జరిగిందని బోధిస్తున్నాను’ అన్నారు మరో టీచరు. ‘‘తప్పిపోయిన విద్యార్థులకు తొమ్మిదిరోజుల పాటు ఎటువంటి ఆహారం లేదు. మంచినీళ్లు లేవు. బయటి ప్రపంచంతో సంబంధం లేదు. కాని ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. అంతా మంచి జరుగుతుందని, విద్యార్థులందరూ క్షేమంగా తిరిగివస్తారని మనస్ఫూర్తిగా ఆశించడం తప్ప ఏం చేయలేకపోయాం’’ అన్నారు జాంగ్పుయాంగ్ అనే ఇంకో టీచర్. ఎట్టకేలకు గుహలోకి వెళ్లిన ఆ పిల్లలు ‘బాన్ వియాంగ్పాన్ స్కూల్’కి సమీపంలో ఉన్నట్టుగా తెలుసుకున్నారు. ఒక బ్రిటిష్ ఈతగాడు కొంతదూరం వరకు ఈత కొట్టి వెళ్లి, ‘మీరు ఎంత మంది ఉన్నారు’ అని ప్రశ్నించాడు. అందులో ఒక పిల్లవాడు పదమూడు మంది అని ఇంగ్లీషులో సమాధానం చెప్పాడు. ‘‘మా విద్యార్థి బ్రిటిషు ఈతగాడు అడిగిన ప్రశ్నను అర్థం చేసుకోవడమే కాకుండా, సమాధానం కూడా చెప్పగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’ అని సంబరపడ్డారు విమోన్చాట్ జిట్టాలమ్ అనే ఇంగ్లీషు టీచరు. పిల్లలంతా క్షేమంగా తిరిగి రావాలంటూ ఒక బొమ్మను వేసి, పాఠశాల ముందు భాగంలో అతికించారు. ఈ పదహారు రోజులూ..! గుహలో చిక్కుకుపోయిన విద్యార్థుల కుటుంబాలన్నీ ఒకరితో ఒకరు ప్రతిరోజూ బాధను పంచుకునేవారు. వారు వింటున్న వార్తలను ఒకరికి ఒకరు చెప్పుకునేవారు. భగవంతుడికి పండ్లు సమర్పిస్తూ, పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించేవారు. ఇన్నిరోజుల పాటు పిల్లలు అన్నపానీయాలు లేకుండా ఎలా ఉన్నారో అనే ఆలోచన రాగానే వారి కళ్లు కన్నీళ్లతో నిండిపోయేవి. పాఠశాలలో ఉదయం అసెంబ్లీ సమయంలో ‘మన విద్యార్థులు క్షేమంగా వస్తారు. వారికి ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారు. వారు చక్కగా ఈదుకుంటూ మన దగ్గరకు వచ్చేస్తారు’ అని అసిస్టెంట్ ప్రిన్సిపాల్ అందరికీ ధైర్యం చెప్పేవారు.ఈ ధైర్యాలు, ప్రార్థనలు, మానవ ప్రయత్నాలు. గుహలో చిక్కుబడి పోయిన పిల్లల ఆత్మస్థయిర్యం, వారిలో గట్టి శక్తిని నూరిపోసిన కోచ్ విల్‌పవర్ అన్నీ కలసి ప్రపంచానికి ఒక విషాదాన్ని తప్పించాయి. - రోహిణి -
అనన్య సామాన్యం: అందరూ మృత్యుంజయులే
మే సాయి : 18 రోజుల ఎడతెగని నిరీక్షణ అనంతరం థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న ఫుట్‌బాల్ టీమ్ తిరిగి భూమి వెలుపలికి వచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య మూడు రోజుల పాటు జరిగిన డైవింగ్ ప్రక్రియలో ఆదివారం నలుగురు, సోమవారం నలుగురు, మంగళవారం నలుగురు చిన్నారులు, కోచ్‌ను డైవర్లు అత్యంత సురక్షితంగా గుహ వెలుపలికి తీసుకొచ్చారు. వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా, ఫుట్‌బాల్ టీమ్‌ను రక్షించడంలో డైవర్లు చూపిన తెగువ అనన్యసామాన్యం. గుహ లోపలికి వెళ్లడమే అతి కష్టమని భావిస్తే. టీమ్ సభ్యులను ఒక్కొక్కరిగా బయటకు తేవడానికి డైవర్లు పడిన కష్టానికి ఒట్టి ప్రశంసలు మాత్రమే సరిపోవు. గుహ గోడలు 70 సెంటీమీటర్ల కంటే తక్కువ గ్యాప్ ఉన్న సమయంలో డైవర్లు అతి కష్టంపైన బయటకు వచ్చిన తీరును గమనిస్తే ఒళ్లు జలదరిస్తుంది. సదరు వీడియోను తిలకిస్తే మనమైతే శ్వాస తీసుకోవడానికి కూడా శక్తి లేకుండా అయిపోయే వాళ్లమేమో అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. 18 రోజులుగా గుహకే పరిమితమైన చిన్నారులకు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉండటంతో వారిని కలిసేందుకు తల్లిదండ్రులకు సైతం అనుమతి ఇవ్వడం లేదు. 48 గంటల తర్వాతే వారిని కలవడానికి తల్లిదండ్రులకు అనుమతి ఇవ్వనున్నారు. కాగా, గుహ నుంచి బయటపడ్డ పిల్లల్ని థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ప్రయుత్ చాన్-ఓచా ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. జూన్ 23న ఈ పన్నెండు మంది చిన్నారులు తమ ఫుట్‌బాల్ కోచ్‌తో థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత తామ్ లుయాంగ్ గుహ చూడడానికి వెళ్లగా వరద ఉద్ధృతి పెరగడంతో అందులోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. తొమ్మిది రోజుల తర్వాత(జులై 7న) వారిని ఇద్దరు బ్రిటీష్ డైవర్లు కనిపెట్టారు. ప్రాణాలకు తెగించి పిల్లలను కాపాడిన డైవర్ల సాహసాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కీర్తిస్తున్నారు. -
మరో నలుగురు బయటకు
మే సాయ్: థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్నవారిలో మరో నలుగురు విద్యార్థుల్ని సహాయక బృందాలు సోమవారం రక్షించాయి. ఆదివారం నలుగురు విద్యార్థుల్ని కాపాడిన 10 గంటల తర్వాత మిగిలినవారిని బయటకు తీసుకొచ్చేందుకు సోమవారం సహాయక చర్యల్ని ప్రారంభించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ సాగిన ఈ ఆపరేషన్‌లో మరో నలుగురు విద్యార్థుల్ని డైవర్లు గుహ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరందరిని థాయ్ రాయల్ పోలీస్ హెలికాప్టర్ ద్వారా 56 కి.మీ దూరంలో ఉన్న చియాంగ్‌రాయ్ ప్రచనుక్రోహ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ ఘటనలో ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థుల సంఖ్య 8కి చేరుకుంది. ప్రస్తుతం సహాయక కోచ్ ఎకపాల్(25)తో పాటు నలుగురు విద్యార్థులు ఇంకా గుహలోనే ఉన్నారు. జూన్ 23న తామ్ లూవాంగ్ గుహలోకి వెళ్లి చిక్కుకున్న 12 మంది విద్యార్థులతో పాటు కోచ్‌ను రక్షించేందుకు థాయ్‌లాండ్ అధికారులు ఆదివారం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, సోమవారం చీకటిపడటంతో ఆపరేషన్‌ను నిలిపివేసిన అధికారులు.. మంగళవారం సహాయక చర్యల్ని పునరుద్ధరించనున్నారు. వాతావరణం అనుకూలం.. ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న చియాంగ్ రాయ్ ప్రావిన్సు గవర్నర్ నరోంగ్ సక్ మీడియాతో మాట్లాడుతూ.. తొలిరోజు లాగే సోమవారం కూడా సహాయక చర్యలకు వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపారు. గుహలోని పరిస్థితులపై అవగాహన ఉండటంతో ఆదివారం సహాయక చర్యల్లో పాల్గొన్న డైవింగ్ నిపుణుల్నే సోమవారం రంగంలోకి దించామన్నారు. ఆపరేషన్‌కు ముందు గుహలోని మార్గంలో ఆక్సిజన్ సిలిండర్లను చేరవేశామన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తొలి బాలుడ్ని తీసుకురాగలమని అంచనా వేసినప్పటికీ.. సాయంత్రం 5.40 గంటలకే బయటకు తీసుకొచ్చామని నరోంగ్‌సక్ తెలిపారు.మిగిలిన ముగ్గురిని కూడా దాదాపు 3 గంటల వ్యవధిలోనే బయటకు తీసుకొచ్చామన్నారు. శారీరకంగా దృఢంగా ఉన్న విద్యార్థులనే తొలుత బయటకు తెచ్చేందుకు ప్రాధాన్యమిచ్చామని అన్నారు. వీరిని స్ట్రెచర్ల సాయంతో హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించామన్నారు. విద్యార్థులతో పాటు కోచ్‌ను కాపాడేందుకు 50 మంది థాయ్‌లాండ్ డైవర్లు, 40 మంది అంతర్జాతీయ డైవింగ్ నిపుణులు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడి వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ.. ఎగువ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గుహలో నీటి ప్రవాహం పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తామ్ లువాంగ్ గుహలోని నీటిని భారీ మోటార్ల సాయంతో తోడేస్తున్నట్లు పేర్కొన్నారు. అనుకున్నదాని కంటే తొందరగానే విద్యార్థుల్ని గుహ నుంచి బయటకు తీసుకొస్తున్నామని నరోంగ్‌సక్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఆపరేషన్ ముగిసే అవకాశముందన్నారు. కాగా, సోమవారం గుహ నుంచి బయటకొచ్చిన నలుగురు విద్యార్థుల వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. విద్యార్థులంతా క్షేమమే కానీ.. చియాంగ్ రాయ్ ఆస్పత్రి ప్రస్తుతం చికిత్స పొందుతున్న 8 మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సీనియర్ వైద్యుడొకరు తెలిపారు. తమకు ఆహారం అందించాల్సిందిగా విద్యార్థులు కోరారన్నారు. అయితే వీరికి ఇన్ఫె క్షన్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో ప్రస్తు తం వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. ఇలా గుహల్లో చిక్కుకున్న సందర్భాల్లో వ్యక్తులకు హైపోథెర్మియా(శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోవడం), పక్షులు, గబ్బిలాల విసర్జితాల కారణంగా శ్వాససంబంధ వ్యాధు లు వచ్చే అవకాశముందన్నారు. విద్యార్థులను 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్నాక తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. అరుదైన ఆహ్వానం తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వైల్డ్ బోర్స్ జట్టుకు అరుదైన ఆహ్వా నం లభించింది. నిర్ణీత సమయంలోగా అందరూ బయటకు రాగలిగితే రష్యా రాజధాని మాస్కోలో ఆదివారం జరిగే సాకర్ ప్రపంచకప్ ఫైనల్‌కు రావాలని ఈ జట్టు సభ్యుల్ని ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాన్టీనో ఆహ్వానించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న తమ విద్యార్థులు తిరిగివచ్చాక వారికోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని మే సాయ్ ప్రసిత్సర్త్ పాఠశాల యాజమాన్యం తెలిపింది. -
థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న వారి కోసం..
మే సాయ్ : థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్నవారి కోసం చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం 12 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో నలుగురు విద్యార్థులు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కోచ్‌తో పాటు మిగిలిన 8 మంది విద్యార్థుల్ని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరి ఆపరేషన్‌కు సాయంగా టెక్ పారిశ్రామిక వేత్త ఇలాన్ మస్క్ ఓ మినీ-సబ్‌మెరైన్‌ను రూపొందించారు. లాస్ ఎంజెల్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో దీన్ని పరీక్షించిన వీడియోను సైతం ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ‘బహుషా.. ఇది థాయ్ ఆపరేషన్‌కు ఉపయోగపడుతుందనుకుంటున్నా.’ అని ఆ వీడియోకు క్యాప్షన్‌గా పేర్కొన్నారు. ఆ గుహలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఈ చిన్న సైజు సబ్‌మెరైన్ ఉపయోగపడనుంది. ఇలాన్ తెలిపిన సమయం ప్రకారం ఇది ఇప్పటికే థాయ్‌లాండ్‌కు చేరి ఉంటుంది. ఇక ఇది రక్షణదళాలు ఉపయోగించే సబ్‌మెరైన్‌ను పోలీ ఉండే ఈ మినీ సబ్‌మెరైన్ ద్వారా ఆక్సిజన్, ఆహారం తీసుకెళ్లడంతో పాటు.. దీని సహాయంతో నీటీ నుంచి సులవుగా బయటకు రావచ్చు. సహాయక కోచ్ ఎకపాల్(25)తో కలసి12 మంది విద్యార్థులు గత జూన్ 23న తామ్ లువాంగ్ గుహలోకి ప్రవేశించారు, వరదనీటితో ప్రవేశద్వారం మునిగిపోవడంతో వీరంతా లోపల ఇరుక్కున్న విషయం తెలిసిందే. చదవండి: ఆపరేషన్ ‘థాయ్’ సక్సెస్ -
థాయ్ ఆపరేషన్‌కు చిన్న సైజు సబ్‌మెరైన్
-
గుహ నుంచి ఆరుగురిని రక్షించిన రెస్క్యూ టీమ్
-
తప్పు నాదే.. మన్నించండి
దాదాపు 15 రోజులుగా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గుహలోనే చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ టీమ్. పదిరోజుల అన్వేషణ .. ఇంటర్నేషనల్ ఆపరేషన్.. ఎట్టకేలకు ఆచూకీ లభ్యం. ఇప్పుడు వారందరినీ బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే చిమ్మచీకట్లో వారందరినీ కంటికి రెప్పలా ఇన్నాళ్లపాటు కాపాడిన కోచ్.. ఓ భావోద్వేగమైన సందేశాన్ని ప్రపంచానికి విడుదల చేశారు. బ్యాంకాక్: 25 ఏళ్ల ఎక్కపోల్ చాంతవోంగ్.. ఫుట్‌బాల్ టీమ్ కోచ్. గుహలోకి వాళ్లందరినీ తీసుకెళ్లింది ఆయనే. చిక్కుకుపోయిన వాళ్లలో అంతా మైనర్లే కాగా.. చాంతవోంగ్ వారిని కాపాడుతూ వస్తున్నారు. ‘తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. మీ పిల్లలంతా క్షేమంగానే ఉన్నారు. జరిగిన దాంట్లో తప్పు మొత్తం నాదే. మీ అందరికీ నా క్షమాపణలు. పిల్లలను జాగ్రత్తగా కాపాడేందుకు నా శాయశక్తులా కృషి చేస్తా.. ఇట్లు... మీ చాంతవోంగ్’ అంటూ ఓ లేఖను రాశాడు. థాయ్ నేవీ సీల్(SEAL) ఫేస్బుక్ పేజీలో శనివారం ఆ లేఖను పోస్ట్ చేశారు. కాగా, పదేళ్ల వయసులో ఓ ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన చాంతవోంగ్.. ఆమె దూరపు బంధువైన ఓ మహిళ దగ్గర పెరిగాడు. ‘ఆంటీ.. మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ లేఖలో సదరు మహిళకు కూడా చాంతవోంగ్ జాగ్రత్త సూచించాడు. ఇదిలా ఉంటే ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రొవిన్స్‌లో గత నెల 23న కోచ్‌తోపాటు 12 మంది సభ్యులున్న ఫుట్‌బాల్ టీమ్.. థామ్ లూవాంగ్ గుహ సందర్శనకు వెళ్లింది. ఒక్కసారిగా భారీ వర్షాలు కురియటంతో వారంతా లోపలే ఇరుక్కుపోయారు. పిల్లలు గుహాలో చిక్కుకున్నారని తెలిశాక.. కోచ్ చాంతవోంగ్పైనే తీవ్ర విమర్శలు వినిపించాయి. అయితే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటం.. తాను పస్తులుండి వారి ఆకలి తీర్చటం లాంటి విషయాలు వెలుగులోకి వచ్చాక వాళ్ల అభిప్రాయం మారి అతనిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం వారందరినీ బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక 5 ఆప్షన్లే... మిషన్ ఇంపాజిబుల్ -
5 ఆప్షన్లు : ప్రమాదం కాదు.. పెను ప్రమాదం..
సాక్షి, వెబ్ డెస్క్ : కాలం ఆగిపోతే బావుణ్ణు. సెకన్లు, గంటలు, రోజులు గడుస్తున్న కొద్దీ థామ్ లూవాంగ్ గుహలో చిక్కుకుపోయిన 13 మంది(12 మంది పిల్లలు+వారి ఫుట్‌బాల్ కోచ్)ని రక్షించతరమా? అనే సందేహం రేకెత్తుతోంది. గుహలో తప్పిపోయి 10 రోజుల తర్వాత ఇద్దరు బ్రిటీష్ డైవర్లకు సజీవంగా కనిపించిన ఫుట్‌బాల్ టీమ్‌ను రక్షించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. వర్షాకాలం తొంగి చూస్తుండటం పిల్లల తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టింది. గుహ నుంచి పిల్లల్ని బయటకు తేవాలంటే కొన్ని కిలోమీటర్ల మేర వారితో డైవింగ్ చేయించాలి. గుహలోని నీటిని తగ్గించేందుకు జపాన్‌కు చెందిన ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. వారి వినియోగిస్తున్న మోటార్ ద్వారా గుహ నుంచి గంటకు 1 సెంటీమీటర్ మేర నీటి మట్టాన్ని తగ్గించగలుగుతున్నారు. థాయ్‌లాండ్ ప్రభుత్వం ముందు 5 ఆప్షన్లు : వర్షాకాలం అనే పదం ప్రస్తుతం థాయ్‌లాండ్ ప్రభుత్వాన్ని తరుముతోంది. ఎంత త్వరగా గుహలో నుంచి పిల్లల్ని బయటకు తెస్తే అంతమంచిది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం ముందు ఐదు ఆప్షన్లు ఉన్నాయి. నీరు వెళ్లబెట్టే వరకూ ఆగడం థాయ్ ప్రభుత్వం ముందు ఉన్న అత్యంత సురక్షితమైన ఆప్షన్ ఇది. అయితే, ఇందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చు. నీరు మొత్తాన్ని వెళ్లబెట్టినా, వర్షాకాలం ముంచుకొస్తోంది. కొన్ని వారాల గుహ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. ఓ వర్షాకాలంలో వచ్చిన నీరు మొత్తాన్ని వెళ్లబెట్టడం అసాధ్యం కాకపోయినా కష్టతరమే. చిమ్నీ ద్వారా.. దాదాపు 10 కిలోమీటర్లు మేర పొడవున్న థామ్ లువాంగ్ గుహలో అక్కడక్కడ చిమ్నీలు(గుహ లోపలికి గాలి, వెలుతురు ప్రసరింపజేస్తుంటాయి) ఉండి ఉండొచ్చు. అయితే, అలాంటి వాటిని ప్రభుత్వం ఇంతవరకూ గుర్తించలేదు. ఫుట్‌బాల్ టీం ఉన్న ప్రాంతానికి చేరువలో చిమ్నీలు ఏమైనా ఉన్నాయా? అనే దానిపై అధికారులు శోధిస్తున్నారు. డైవింగ్ పిల్లలతో పాటు కోచ్‌కు డైవింగ్‌లో తర్ఫీదు ఇచ్చి బయటకు తేవాలనేది మరో ఆప్షన్. అసలు ఈత అంటేనే తెలియని వారితో ఎలా డైవింగ్ చేయిస్తారు?. సాధారణంగా ఓ వ్యక్తికి డైవింగ్‌లో తర్ఫీదు ఇవ్వడానికి మూడు రోజుల సమయం పడుతుంది. అలాంటిది ఇప్పటికే 12 రోజులుగా చీకటి గుహలో నివసిస్తున్న వారు శారీరకంగా, మానసికంగా బలహీనపడివుంటారు. అలాంటి వారితో అతివేగంగా ప్రవహిస్తున్న నీటిలో డైవింగ్ చేయించగలగాలి. అంతేకాకుండా థామ్ లువాంగ్ గుహలో అతి సన్నని మార్గాలు ఉంటాయి. ఒక డైవర్ నీటిలోకి దిగాక అతని కంటికి కేవలం కొన్ని సెంటీమీటర్ల మేర మాత్రమే ఏం జరగుతుందో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఆందోళన చెందితే వారి ప్రాణాలతో పాటు ఎస్కార్ట్‌గా వస్తున్న నిపుణులైన డైవర్ల ప్రాణాలకు సైతం ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఒక్క పిల్లాడితో డైవింగ్ చేయించడం.. డైవింగ్ అంటే పిల్లలకు ఉన్న భయాన్ని వారి మదిలో నుంచి తొలగించేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడొచ్చు. వాలంటీర్‌గా ముందుకొచ్చిన ఒక పిల్లాడిని తొలుత గుహ నుంచి బయటకు తెచ్చి, అతడు డైవ్ చేసిన ఫొటోలను మిగతా వారికి చూపి సాహసానికి ప్రోత్సహించవచ్చు. ‘ప్యాకేజ్’ల రూపంలో.. ఆక్సిజన్ ప్యాకేజిలలో ఒక్కొక్కరిని ఉంచి బయటకు తేవడం. ఈ పద్దతిలో చాలాసార్లు విజయం సాధించినట్లు అమెరికా పేర్కొంది. అయితే, గుహలో మార్గాలు అతి సన్నగా ఉండటం వల్ల ఇది సాధ్యపడే అవకాశాలు తక్కువే. -
మిషన్ ఇంపాజిబుల్!
12 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు.. అందునా పిల్లలు.. తమ కోచ్‌తో కలిసి విహార యాత్ర కోసం గుహలోకి వెళ్లారు.. అంతలోనే భారీ వర్షాలు.. వరదలు.. గుహలో నిండిన నీళ్లు.. లోపలికి వెళ్దామంటే.. గజ ఈతగాళ్లే గజగజలాడాల్సిన పరిస్థితి. వారం గడిచింది..అందరూ ఆశలు వదిలేసుకున్నారు.. అయితే.. అనుకోకుండా ఒకరోజు.. ఇద్దరు బ్రిటన్ డైవర్లకు పిల్లలు కనిపించారు.. సజీవంగా.. దేశమంతా పండుగ చేసుకుంది. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.. సజీవంగా కనిపించారు.. అయితే.. సజీవంగా బయటకు వస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. వాళ్లకు ఈత రానందున గుహ నుంచి బయటకు రావడం అసాధ్యమంటున్నారు.. 4 నెలలు అందులోనే ఉండిపోవాల్సిందేనంటున్నారు.. మరోవైపు వారినెలాగైనా బయటకు తేవడానికి అంతర్జాతీయ నిపుణుల బృందం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది.. 100 శాతం అందరినీ రక్షిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ వారి మిషన్ ఫలిస్తుందా? ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించిన ఈ ఘటన వివరాలు గ్రాఫిక్ రూపంలో.. జూన్ 23: పిల్లలు, వారి కోచ్ థామ్ లుయాంగ్ నాంగ్ నాన్ గుహ(దీని పొడవు 9.65 కి.మీ)కు వెళ్లారు. ఎంతసేపయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గుహ ముఖద్వారం వద్ద సైకిళ్లు.. లోపల షూలు, బ్యాగులు కనిపించడంతో గుహలో చిక్కుకుపోయారని గ్రహించారు. జూన్ 24: గుహ లోపల పిల్లల చేతి, కాలి ముద్రలు కనిపించాయి. గుహలో నీటిమట్టం పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు మరింత లోపలికి వెళ్లి ఉంటారని అంచనా వేశారు. జూన్ 25, 26: థాయ్‌లాండ్ నేవీ సీల్స్ విభాగం డైవర్లు రంగంలోకి దిగారు. అయితే.. వరద ఉధృతి వల్ల వారు వెనక్కి రావాల్సి వచ్చింది. జూన్ 27: బ్రిటిష్ డైవర్లు రిచర్డ్, జాన్, రాబర్ట్‌తో పాటు అంతర్జాతీయ నిపుణులు వచ్చారు. జూన్ 28: వరదల వల్ల సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపేశారు. భారీ మోటార్లను వినియోగించి గుహలోని నీటిని తోడటం మొదలుపెట్టారు. పై నుంచి గుహలోకి వెళ్లే మార్గాన్ని కనుగొనేందుకు డ్రోన్లను రంగంలోకి దింపారు. జూన్ 29: భూమిపై నుంచి డ్రిల్లింగ్ ద్వారా గుహలోకి వెళ్లే అవకాశమున్న ఓ ప్రదేశాన్ని కనుగొన్నా.. అది గుహ ప్రధాన మార్గాన్ని చేరుతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. జూన్ 30: వాతావరణం అనుకూలించడంతో డైవర్లు గుహలో ముందుకు వెళ్లారు. జూలై 1: గుహలో ఓ పొడి ప్రాంతంలో బేస్ ఏర్పాటు చేసుకున్నారు. గుహలో కొన్ని రోజులు ఉండేందుకు వీలుగా వందలాది ఆక్సిజన్ ట్యాంకులు, ఆహార పదార్థాలను తరలించారు. జూలై 2: గుహ ప్రవేశ ద్వారానికి 4 కి.మీ. దూరంలో ఆ 13 మందిని జాన్, రిచర్డ్ గుర్తించారు. జూలై 3, 4, 5: బుధవారం కొందరు తెలియక మధ్యలో ఓసారి నీటిని మళ్లీ గుహలోకే పంపింగ్ చేసేశారు. తర్వాత దీన్ని గుర్తించి సరిదిద్దారు. పిల్లలు తమ తల్లిదండ్రులతో మాట్లాడటానికి వీలుగా ఫోన్ లేదా ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు లోపల ఉన్న ఇద్దరు పిల్లలు, కోచ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్‌ను పంపింగ్ చేస్తున్నారు. త్వరలో భారీ వర్షాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వీరిని రక్షించడానికి ప్రస్తుతం మూడే మార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. డ్రిల్లింగ్ చేసి.. సిలెండర్లాంటి దానిలో వారిని పైకి తేవాలి. అయితే.. వారు కనుగొన్న ప్రదేశం.. గుహలో వారున్న ప్రాంతాన్ని కచ్చితంగా చేరుతుందా అన్నదానిపై అనుమానాలున్నాయి. దీనికితోడు దాదాపు కిలోమీటరు మేర లోతులో డ్రిల్లింగ్ చేయాలి. పైగా.. పిల్లలు పైకి తెచ్చేంత వైశాల్యంలో.. దీనికి చాలా టైం పడుతుందంటున్నారు. ఇదిలా ఉండగా.. తమకు బయట నుంచి కుక్కల అరుపులు వంటివి వినిపిస్తున్నాయని బుధవారం గుహలోని బాలురు చెప్పారు. అంటే.. ఈ లెక్కన భూమిపైనుంచి లోపలికి ఎక్కడో భారీ రంధ్రంలాంటిది ఉండొచ్చనే అంచనాతో దాని కోసం గాలిస్తున్నారు. వర్షాలు ఆగి.. నీటి మట్టం తగ్గేంతవరకూ వేచి ఉండటం.. అంతవరకూ లోపల చిక్కుకున్నవారికి ఆహారం సరఫరా చేయడం.. ప్రస్తుతానికి ఉన్నవాటిల్లో ఇది మంచి నిర్ణయంలా కనిపిస్తున్నా.. ఇందుకోసం వారు 4 నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. పైగా.. వర్షాలు అంచనాలకు మించి పడినా.. వరద పోటెత్తినా.. వీరు ఉన్న ప్రదేశానికి కూడా నీరు చేరుకునే ప్రమాదముందని అంటున్నారు. ఇప్పటికే.. నీటి మట్టం పెరగడంతో వారు గతంలో ఉన్న ప్రదేశం కంటే మరికాస్త వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. ఆ 13 మందికి ఈత రాదంటున్నారు.. ఇక్కడ ఈత మాత్రమే కాదు.. డైవింగ్ రావాలి.. అంటే స్కూబా సామగ్రి వేసుకుని.. నీటిలో ఈదాల్సి ఉంటుంది. పైగా.. చాలాచోట్ల ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలిగేలా ఇరుకిరుకుగా ఉంటుంది. వారికి డైవింగ్ నేర్పించి, ఒక్కొక్కరికి ఇద్దరు డైవర్లు చొప్పున మార్గదర్శనం చేస్తూ.. బయటకు తేవాల్సి ఉంటుంది. వారిని వెంటనే రక్షించాలంటే ఇదొక్కటే మార్గం. ఇప్పటికే పిల్లలు డైవింగ్ దుస్తులు వేసుకోవడం వంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే.. ఇది ప్రమాదకరమైనది. నిపుణులైన డైవర్లు కూడా ఈ గుహలో ఈదాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటుంటారని చెబుతున్నారు. అమెరికా నేవీకు చెందిన డైవర్ ఒకరు పిల్లలు ఇలాంటి గుహలో డైవింగ్ చేయడానికి ప్రయత్నిస్తే.. వారిలో కొందరు చనిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఈదుకుంటూ రావాల్సిందే!
మేసాయ్: థాయిలాండ్‌లోని గుహలో చిక్కుకున్న 12 మంది బాలురు, వారి సాకర్ కోచ్‌ను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు వాతావరణం ప్రతికూలంగా మారింది. వరదల ఉధృతి మరింత పెరగడంతో వారు గుహను ఆనుకుని ప్రవహిస్తున్న ఇరుకైన జలాశయం గుండా ఈదుకుంటూ బయటపడటం మినహా, ప్రస్తుతానికి మరో మార్గంలేదని అధికారులు తెలిపారు. అయితే ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని కూడా తేల్చారు. జూన్ 23న మ్యాచ్ ముగిసిన తరువాత వారు చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌లో విహార యాత్రకు వెళ్లి, వరదల కారణంగా గుహలో చిక్కుకున్నారు. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం జరుగుతున్న అన్వేషణ మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 11–16 ఏళ్ల మధ్యనున్న ఆటగాళ్లు, 25 ఏళ్ల కోచ్ క్షేమంగానే ఉన్నారని, అయితే ప్రతికూల వాతావరణం వల్లనే బయటికి తీసుకురావడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్న నేవీ సిబ్బంది, వైద్యులు వారికి ఆహారం, అందిస్తున్నారు. -
భారీ రెస్క్యూ ఆపరేషన్.. ఉత్కంఠకు తెర
దాదాపు పది రోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కనిపించకుండా పోయిన ఫుట్‌బాల్ టీమ్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. వారంతా ప్రాణాలతోనే ఉన్నారని ప్రకటించిన థాయ్‌లాండ్ అధికారులు.. భారీ రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లు సోమవారం ప్రకటించారు. గుహలోనే చిన్నారులంతా చిక్కకు పోయారని, అంతా సజీవంగా ఉన్నారని ప్రకటించారు. దీంతో చిన్నారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. సుమారు 12 మంది సభ్యులు(అంతా 13-16 ఏళ్లలోపు వాళ్లే).. కోచ్(25)తోపాటు అంతా మృత్యుంజయులుగా నిలిచారు. ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రొవిన్స్‌లో ఈ నెల 23న చెందిన సదరు ఫుట్‌బాల్ టీమ్ ప్రాక్టీస్ ముగిశాక దగ్గర్లోని థామ్ లూవాంగ్ గుహ సందర్శనకు వెళ్లింది. (మయన్మార్-లావోస్-థాయ్‌లాండ్ సరిహద్దులో ఉండే సుమారు 10 కిలోమీటర్ల పొడవు ఉండే గుహ అది). సాధారణంగా వర్షాకాలంలో ఈ గుహ చుట్టూ, లోపలికి నీరు చేరుతుంది. అందుకే ఆ సమయంలో గుహలోని అనుమతించరు. కానీ, వర్షాలు తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయంతో ఆ ఫుట్‌బాల్ టీమ్ లోపలికి వెళ్లింది. అంతలో భారీ వర్షం పడటం.. నీరు ఒక్కసారిగా లోపలికి చేరటంతో వారంతా అందులో చిక్కుకుపోయారు. ప్రాక్టీస్‌కు వెళ్లిన వాళ్లు తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు అధికారులకు సమాచారం అందించారు. గుహ వెలుపల సైకిళ్లు కనిపించటంతో అధికారులు గాలింపు చేపట్టారు. పదిరోజుల పాటు ఉత్కంఠే... భారీ వర్షాలు, బురద దట్టంగా పేరుకుపోవటంతో సహాయక చర్యలకు అవాంతరం ఏర్పడింది. థామ్ లూవాంగ్ గుహ, విషపూరితమైన పాములతో నిండి ఉండటం, పైగా లోపలి మార్గాలు చాలా ఇరుక్కుగా ఉండటంతో.. అన్నిరోజులు వారు బతకటం కష్టమని భావించారు. తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. అయితే అధికారులు మాత్రం ఆశలు వదులుకోలేదు. థాయ్ నేవీ సీల్(SEAL) డైవర్స్‌తోపాటు ముగ్గురు బ్రిటీష్ డైవర్స్, యూస్‌ఫసిఫిక్ కమాండ్‌కు చెందిన అమెరికా మిలిటరీ బృందం, పారా రెస్క్యూ సిబ్బంది, మరికొందరు రక్షణ నిపుణులు రంగంలోకి దించి భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారీ వర్షాలతో లోపలికి నీరు చేరినా.. సంక్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఆ బృందం తమ గాలింపును కొనసాగించింది. మరోవైపు ప్రజలు, బౌద్ధ సన్యాసులు వారంతా సురక్షితంగా తిరిగి రావాలని పూజలు చేశారు. ఎట్టకేలకు పదిరోజులకు అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. సోమవారం(జూలై 2న) వారిని కనుగొన్నట్లు సహాయక బృందం ప్రకటించింది. ‘అంతా సురక్షితంగా ఉన్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని చియాంగ్ రాయ్ గవర్నర్ నారోంగ్సక్ ఒసోట్టనాక్రోన్ ఓ ప్రకటనలో ధృవీకరించారు. ఈ మేరకు సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్న ఓ వీడియోను అధికారులు విడుదల చేశారు. ‘సహాయక బృందాన్ని చూడగానే వారంతా సంతోషం వ్యక్తం చేయటం.. ఆకలిగా ఉంది. తినటానికి ఏమైనా కావాలని.. తమను వెంటనే బయటకు తీసుకెళ్లాలని ఓ బాలుడు కోరటం’ వీడియోలో ఉంది. అధికారుల కృషిపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. -
లాటరీ గుట్టు... గుహలో రట్టు
లాటరీలు అంటే మనకు అంతగా పరిచయం లేదుగానీ.. విదేశాల్లో వాటికి ఉండే క్రేజే వేరు. తమదైన రోజున అనేకమంది అనామకులు లాటరీ అదృష్టం తగిలి రాత్రికిరాత్రే వేలకోట్లకు అధిపతులయ్యారు. చైనాలోని వాంగ్ చెంగ్ జౌ అనే వ్యక్తికి ఇలాంటి లాటరీ పిచ్చే ఉంది. లాటరీ టికెట్లు కొనడం.. తన టికెట్ ప్రైజ్‌మనీ గెలుచుకుందో లేదో చూసుకుంటూ ఉండేవాడు. 2004లో బహుమతి గెలుచుకున్న ఓ లాటరీ టికెట్‌ను చూసిన వాంగ్ దీని వెనుక ఏదో పెద్ద గణిత సూత్రం ఉందని భావించి.. దాన్ని ఎలాగైనా కనుక్కోవాలని అనుకున్నాడు. ఇక అంతే ఇళ్లు, కుటుంబసభ్యులను వదిలేసి కొంత డబ్బు తీసుకుని పాడుబడ్డ బ్రిడ్జి కింద ఉన్న గుహకు చేరాడు. లాటరీ గుట్టును ఛేదించే పనిలో పడ్డాడు. లాటరీ గుట్టును రట్టు చేసి రాత్రికిరాత్రే కోటీశ్వరుడు అయిపోవడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకుని పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో ఓ చానల్ ఈ విషయాన్ని తెలుసుకుని కథనాన్ని ప్రసారం చేసింది. దీన్ని చూసిన వాంగ్ తల్లి అతన్ని ఇంటికి రావాలని కోరగా.. గుట్టు ఛేదించే వరకు ఇంటి గడప తొక్కనని శపథం చేశాడు. ఎట్టకేలకు 10 ఏళ్లు కష్టపడి లాటరీల వెనుకున్న రహస్యాన్ని గుర్తించాడు. అయితే ఆ రహస్యాన్ని తెలపాల్సిందిగా మీడియా కోరగా.. రహస్యాన్ని బయటపెట్టలేనిని సున్నితంగా తిరస్కరించాడు. అయితే త్వరలో దీన్ని పుస్తక రూపంలో తెస్తానని అన్నాడు. ఒకసారి పుస్తకం విడుదలైతే తన వద్దకు వందల మిలియన్లు వచ్చి పడతాయని వాంగ్ తెగ సంబరపడిపోతున్నాడు. -
అద్భుతాన్ని వెలుగులోకి తెచ్చారు
మెక్సికో : పురాతత్వ శాస్త్రవేత్తలు అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రపంచంలో నీటితో నిండిన అతిపెద్ద గుహను మెక్సికోలో కనుగొన్నారు. తద్వారా నీటి అడుగున మిగిలిపోయిన ప్రాచీన చరిత్రను అధ్యయనం చేసే అవకాశం లభించినట్లయ్యింది. యుకటన్ ద్వీపకల్పంలో మిస్టరీగా మారిన ఈ అంశంపై 20 ఏళ్లుగా రాబర్ట్ స్కిమిట్నర్ పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. చివరకు గామ్ బృందం(పురాతత్వ పరిశోధన సంస్థ) సహకారంతో.. కొందరు స్కూబా డైవర్లను లోపలికి పంపి ఆయన ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. వరదలతో నిండిపోయిన ఈ పురాతన గుహలు 347 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉండటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. డోస్ ఓజోస్ గుహలే ఇప్పటిదాకా పెద్దవిగా(83 కిలో మీటర్ల మేర విస్తరించి) గుర్తింపు పొందాయి. అయితే వాటికన్నా సాక్ అక్టన్ పద్ధతిలో ఏర్పడిన ఈ గుహలు వందల రేట్లు ఎక్కువగా విస్తరించి ఉండటం విశేషం. 10 నెలల నిరంతరాయ పరిశోధన తర్వాత వేల సంవత్సరాల నాటి శిలాజాలు లభించగా.. వాటిని చరిత్రకారులు పరిశీలిస్తున్నారు. మయాన్ చరిత్రను, సంప్రదాయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఈ గుహలు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొత్తం 1500 కిలో మీటర్ల మేర ఇది విస్తరించి ఉండొచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు ఓ అంచనా వేస్తున్నారు. -
ఇటు రండి సర్..
ఈక్వెడార్ రాజధాని క్విటో శివారులోని ఓ గుహ.. రాత్రి ఏడు అవుతోంది.. ఇంతలో కొన్ని జంటలు ఆ గుహలోకి ప్రవేశించాయి.. అంతా చిమ్మచీకటి.. ఏమీ కనిపించడం లేదు.. వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.. ఇంతలో ఓ స్వరం.. ఇటు రండి సర్ అని.. ఓ వ్యక్తి.. ఆ చీకటిలో వీరికి దారి చూపుతున్నాడు.. కొంతసేపు తర్వాత వారిని ఓ ప్రదేశానికి తీసుకెళ్లి.. అక్కడున్న సీట్లలో కూర్చోబెట్టాడు.. మీకో విషయం తెలుసా? ఆ చిమ్మచీకటిలో కళ్లున్న వారందరికీ దారి చూపించిన ఆ వ్యక్తికి అసలు కళ్లే లేవు.. అతడు అంధుడు.. క్విటోలోని రఫాస్ కేవ్ రెస్టారెంట్.. డార్క్‌నెస్‌లో డిన్నర్ చేయడం వంటి కాన్సెప్టులు చాలా చోట్ల ఉన్నవే.. అయితే.. రఫాస్ ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ వెయిటర్లంతా అంధులే.. ఇంకో విశేషమేమిటంటే.. రెస్టారెంట్‌కు తినడానికి వచ్చినోళ్లంతా దేన్నో ఒకదాన్ని తన్నుకుంటూ.. తడబడుతూ నడుస్తుంటే.. అంధులైన వెయిటర్లు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఠీవిగా నడుస్తూ కనిపిస్తారు. ఇక్కడ సెల్ఫోన్లు, కాంతిని వెదజల్లే గడియారాలు వంటివి నిషిద్ధం. అక్కడక్కడా చిన్నపాటి వెలుతురు వస్తుంటుంది.. ఈ రెస్టారెంట్‌ను రాఫెల్వైల్డ్ అనే ఆయన ప్రారంభించారు. ఓ వినూత్న అనుభూతిని అందించడంతో పాటు అంధుల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రెస్టారెంట్‌ను పెట్టినట్లు ఆయన చెప్పారు. - సాక్షి, తెలంగాణ డెస్క్ -
ఆ చిత్రాలకు ‘రంగు’ పడింది!
వేల ఏళ్ల కింద ఆది మానవులు గుహల్లో, తమ ఆవాసాల్లోని రాళ్లపై చిత్రించిన బొమ్మలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. సాధారణంగా మనం ఇప్పుడు వాడే రంగులు కొంచెం నీరు తగలగానే, కొంతకాలం కాగానే వెలిసిపోతాయి. కానీ ఆది మానవులు గీసిన చిత్రాలు మాత్రం ఇంకా నిలిచి ఉన్నాయి. ఎండకు ఎండి, వానకు నాని, వేల ఏళ్లుగా నిలిచి ఉన్న ఆ చిత్రాలకు వాడిన రంగులు, ఉపయోగించిన పద్ధతులు ఏమిటో తెలుసా..? ఇనుప ఖనిజం అధికంగా ఉండే హెమటైట్ రాయి. దీని పొడికి వివిధ పదార్థాలు కలిపి ఆది మానవులు చిత్రాలు వేసినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, ఫోరెన్సిక్ నిపుణుడు జ్ఞానేశ్వర్ తాజాగా నిర్ధారించారు. – సాక్షి, హైదరాబాద్ కొత్త రాతియుగం నుంచే రంగులు పాత రాతియుగం కాలంలో ఆది మానవుల చిత్రాల్లో రంగులు కనిపించవు. మొనదేలిన రాళ్లతో బండరాళ్లపై లోతుగా చెక్కి చిత్రాలకు ఆకృతి ఇచ్చేవారు. వాటిని పెట్రోగోలైవ్స్గా పేర్కొంటారు. అలాగే రాళ్లతో గీతలు గీసి (రాక్ బ్రూజింగ్స్) కూడా బొమ్మలు వేసేవారు. మధ్య రాతియుగం చివరికి వచ్చేసరికి రంగులు అద్దడం మొదలైంది. ఆ సమయంలోనివారు పెట్రోగ్లైవ్స్లో రంగులు వేయడం మొదలుపెట్టారు. వేల ఏళ్ల కింద చిత్రించిన పెట్రోగ్లైవ్స్లోనూ.. కొన్ని వందల ఏళ్ల తర్వాత రంగులద్దినట్టు పరిశోధకులు గుర్తించారు. ఖమ్మం జిల్లా రామచంద్రాపురం, పూర్వపు మెదక్ జిల్లా రత్నాపూర్లలో ఇలా పెట్రోగ్లైవ్స్, వాటిలో రంగులు వేసిన తీరు కనిపిస్తాయి. వేల ఏళ్లుగా నిలిచే ఉన్నాయి ఆది మానవులు వేల ఏళ్ల కింద రాళ్లపై చిత్రించిన బొమ్మలు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అసలేమాత్రం పరిజ్ఞానం లేని కాలంలో.. ఎరుపు, నలుపు రంగుల్లో ఆ చిత్రాలను ఎలా గీశారు, ఆ రంగుల కోసం వాడిన పదార్థాలేమిటన్న దానిపై మన దేశంలో ఇప్పటివరకు శాస్త్రీయ నిర్ధారణ జరగలేదు. ఒకటి రెండు చోట్ల మినహా పెద్దగా పరిశోధన కూడా జరగలేదు. కానీ కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆ దిశగా అడుగు వేసింది. ఖమ్మం జిల్లా రామచంద్రాపురం, మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి, వర్గల్లలోని ఆది మానవుల గుహల్లోని చిత్రాలపై పరిశోధన చేసి.. ఆ రంగులు ఏమిటనేది గుర్తించింది. అది హెమటైట్.. పీఠభూముల ప్రాంతాల్లో సహజంగానే ఎరుపు రంగులో ఉండే ఇనుము రాయి కనిపిస్తుంటుంది. అందులో హెమటైట్ అనే ఖనిజం ఉంటుంది. ఈ ఖనిజాన్నే ఆది మానవులు రంగు తయారీలో వినియోగించారని పరిశోధనలో గుర్తించారు. ఈ ఎరుపు రాయిని పొడి చేసి, అందులో జంతువుల కొవ్వు కలిపి ఎరుపు రంగును తయారు చేశారని నిర్ధారించారు. తెలంగాణవ్యాప్తంగా ఇదే తరహా చిత్రాలున్నందున ఈ ప్రాంతంలో అప్పట్లో ఈ రంగును విస్తారంగా వినియోగించినట్టు భావిస్తున్నారు. ఇక చిత్రాల్లో ముదురు రంగు వచ్చేందుకు హెమటైట్ పొడితోపాటు జంతువుల రక్తాన్ని కలిపి బొమ్మలు గీసిన తీరును గతంలోనే పరిశోధకులు గుర్తించారు. కొన్నిచోట్ల మూత్రం కలిపినట్టు కూడా తేలింది. వీటితోపాటు నలుపు రంగు కోసం హెమటైట్ పొడి, కొవ్వుతోపాటు రాక్షసబొగ్గు పొడిని కలిపి వాడారని తాజాగా నిర్ధారించారు. రాష్ట్రంలో తాము చేసిన పరిశోధనకు సంబంధించిన అధ్యయన పత్రాన్ని పుణెలో అక్టోబర్ 26 నుంచి జరగనున్న రాక్ ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సులో సమర్పించనున్నట్టు హరగోపాల్ తెలిపారు. పరిశోధన ఇలా.. ఆది మానవుల చిత్రాల్లోని రంగుల రహస్యాలు తేల్చాలంటే.. ఆ రంగు ఉన్న భాగాన్ని సేకరించాల్సి ఉంటుంది. అలా చేస్తే చిత్రాలను ధ్వంసం చేసినట్టేనని రాక్ ఆర్ట్ సొసైటీ నిబంధనలున్నాయి. దీంతో రంగుల్లో ఉన్న పదార్థమేమిటో నిర్ధారించేందుకు ‘రామన్ స్పెక్ట్రా’పరీక్షను ఎంచుకున్నారు. ఈ పరికరం ఏదైనా వస్తువు లేదా ఉపరితలంపై కాంతి కిరణాలను ప్రసరింపజేసి.. అవి ప్రతిఫలించే కాంతి ఆధారంగా అక్కడి రసాయన లక్షణాలను గుర్తిస్తారు. ఈ లక్షణాలను అంతర్జాతీయంగా నిర్ధారించిన అంశాల ఆధారంగా డీకోడ్ చేసి.. రసాయనం ఏమిటో తేలుస్తారు. ఆది మానవుల చిత్రాలను దీని సహాయంతో పరీక్షించి.. రంగును హెమటైట్గా నిర్ధారించారు. -
ఆదిమ మానవుని గుహ
కామారెడ్డి : ప్రాచీన శిలాయుగానికి చెందిన ఆనవా ళ్లు మాచారెడ్డి మండలం ఎల్లంపేట అటవీ ప్రాంతంలోని మఠంరాళ్లతండాలో వెలుగుచూసాయి. ఈ ప్రాంతంలో క్రీ.పూ. 10 వేల నుంచి 5 వేల సంవత్సరాల కాలం నాటి ఆదిమ మానవుడు నివసించిన గుహను కాకతీయ విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో పరిశోధన చేస్తున్న తూ ము విజయ్‌కుమార్ కనుగొన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’ కి వివరాలు అందజేశారు. 6వ శతాబ్దంలో జనప దం ఏర్పడడానికి ఇక్కడ పూర్వం నుంచి మానవ సంచా రం ఉన్నదని శిలాయుగం నాటి కుడ్య చిత్రాల ద్వారా తెలుస్తుందన్నారు. అటవీ ప్రాంతం కావడం వల్ల నాటి మానవులు అక్కడే నివసిస్తూ, ఆహార సేకరణ చేసి ప్రాచీన శిలాయుగానికి ఇక్కడ గుహాలయం ఏర్పాటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతం చారిత్రాత్మకమైనటువంటి ఆనవాళ్లు కలది బాహ్య ప్రపంచంలోకి రాకపోవడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. మానవ పరిణామ క్రమంలో చరి త్ర రచనకి ఆధారంగా మన ప్రాంతం చెప్పవచ్చన్నారు. ఈ ఆదిమ మానవుని నివాస ప్రాంతం, (గుహ) నాటి సంస్కృతికి సంబంధించినటువంటి కుడ్య చిత్రాలు ఎరుపు వర్ణం తో వేసిన చిత్రాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడ జీవనం సాగించిన ఆదిమ మానవులు వారి జీవనశైలి, వారి భావాలు, వారు వాడిన వస్తువులు, జంతువుల చిత్రాలు, గణితశాస్త్ర గుర్తులు, గుహ గోడలపై కలవు. జింక, దుప్పి, కొమ్ములు, దుప్పి, కుక్క, చేప, మనిషి కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలను పరిశీలించినట్టయితే ఆదిమ మానవుడు తాను అడవిలో జంతువులతో సంచారం చేస్తూ వాటితో సహజీవనం చేయడం, వాటిని ఎర్రని వర్ణంతో చిత్రాలుగా గీయడం చేశారు. ఈ గుహలో 4 వందలకు పైగా చిత్రాలు ఉన్నాయి. ఎంతో నైపుణ్యంతో కుడ్య చిత్రాల్ని గీశారు. గుహ పెద్ద బండరాయి కింద ఉంది. దీనిని ఆవాస కేంద్రంగా చేసుకుని గుహకి కుడి, ఎడమ వైపుల నుంచి ప్రహరీ లాంటి రాళ్లతో గోడ నిర్మించారు. ఆదిమ మానవునికి నిర్మాణం కూడా తెలుసని అర్థమవుతోంది. -
గుహాలయాలు
పుణ్యతీర్థం ఆదిమానవుడు గుహతో పాటు గుడిని కూడా కనుగొన్నాడు. గుహను గుడిగా మలుచుకున్నాడు. అజంతా, ఎల్లోరాలు అలాంటి గుహాలయాలే. మన తెలుగువారి తావుల్లో కూడా అలాంటి గుహాలయాలు ఉన్నాయి. విజయవాడలో ఉన్న అక్కన్న మాదన్న గుహలు, మొగల్రాజపురం గుహలు ఎందరికి తెలుసు? వాటిని చూడాలని మనం ఒకరికొకరం చెప్పుకున్నామా? విజయవాడకు వెళ్లినవాళ్లు కనకదుర్గ ఆలయానికి తప్పక వెళతారుకాని దుర్గమ్మ పాదాల చెంత కొలువై ఉన్న అక్కన్న మాదన్న గుహలను ప్రత్యేకంగా పరికించి చూడరు. ప్రకృతి రమణీయతకే కాకుండా, చారిత్రక ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్న ఈ గుహలు 6వ,7వ శతాబ్దాల నాటివని తెలుస్తోంది. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలు శిథిలావస్థలో దర్శనమిస్తాయి. ఇవి గుహలే అయినప్పటికీ వీటిలో భగవంతుని మూర్తులను ఉంచడం వలన ఇవి గుహాలయాలు అయ్యాయి. అక్కన్న మాదన్నలు ఇంద్రకీలాద్రి కొండకు తూర్పు దిశగా కొండ కింది భాగంలో ఈ ఆలయాలు ఉంటాయి. 17వ శతాబ్దంలో గోల్కొండను పాలించిన తానీషా చక్రవర్తి దగ్గర అక్కన్నమాదన్నలు మంత్రులుగా పనిచేసేవారు. రాజుగారికి నమ్మిన బంట్లు. ఈ గుహలు ఆరు ఏడు శతాబ్దాలకు చెందినవే అయినా ఈ గుహలతో అక్కన్న మాదన్నలకు విడదీయరాని అనుబంధం ఉండటంతో వీటిని వారి పేరుతో పిలుస్తారు. గుహల నిర్మాణం ఈ గుహలు తూర్పుముఖంగా దీర్ఘ చతురస్రాకారంలో నిర్మితమయ్యాయి. కింద భాగంలో మూడు గుహలు ఉన్నాయి. వాటికి ఎదురుగా ఒక స్తంభం ఉంది. శిల్పనిర్మాణం చూస్తే బౌద్ధులకు చెందినదిగా అనిపిస్తుంది. కాని ఈ గుహలు చాళుక్య, విష్ణుకుండిన, పల్లవ సామ్రాజ్యాలకు చెందినవిగా భావిస్తున్నారు. లోపలకు ప్రవేశించగానే అందమైన, సువాసన భరితమైన పూల చెట్లు స్వాగతం పలుకుతాయి. నాలుగడుగులు వేయగానే గుహలు మనలను కొన్ని వంద సంవత్సరాలు వెనక్కు తీసుకువెళ్తాయి. తూర్పు ముఖంగా ఉన్న ఈ గుహలకు దక్షిణ భాగంలో వినాయకుని విగ్రహాన్ని శిల్పులు చెక్కారు. అయితే ఇది కొంచెం శిథిలావస్థలో ఉంది. ఆ గుహలను చూసి బయటకు వచ్చి ఉత్తరాన ఉన్న మెట్లు ఎక్కితే పైన కూడా గుహాలయం ఉంది. ఓం నమశ్శివాయ.. అంటూ అక్కడ లింగాకారంలో ఉన్న శివుడు సాక్షాత్కరిస్తాడు. ఎవరికి వారు పూజ చేసుకునే అవకాశం ఉన్న శివాలయం ఇది. ప్రతి సోమవారం నాడు భక్తులు ఇక్కడకు వచ్చి స్వయంగా అభిషేకాలు చేస్తుంటారు. అక్కడ నుంచి పైకి చూస్తే దుర్గమ్మ గుడికి వెళ్లే ఘాట్ రోడ్ మనకు కనిపిస్తుంది. ఈ శివుడే గంగ బదులు కనకదుర్గమ్మను తన తల మీద మోస్తున్నాడేమోననే భావన కలుగుతుంది. అక్కడక్కడ పడిన శిల్పాలను ఒక దగ్గర చేర్చి అందంగా ప్రేక్షకులకు కనువిందు కలిగేలా అమర్చారు. మండపం మీద సంగీత వాద్యపరికరాలు వాయిస్తూన్న శిల్పం నాటి రాజుల సంగీతాభిమానాన్ని ప్రతిబింబిస్తుంది. ధనుస్సు సంధించిన అర్జునుడు, స్థూపం మీద నాలుగు వైపులా దేవతామూర్తులు, మండపం నాలుగు స్తంభాల మీద శాసనం చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడతాయి. ప్రస్తుతం ఈ గుహాలయాలు, పరిసరాలు పురావస్తు శాఖవారి ఆధ్వర్యంలో ఉన్నాయి. మొగల్రాజపురం గుహలు మొగల్రాజపురం విజయవాడలో ప్రధానమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మొగలులు సందర్శించిన కారణంగా మొగల్రాజపురం అని పిలుస్తారని స్థానికులు చెబుతారు. ఇక్కడ 5వ శతాబ్దానికి చెందిన ఐదు ప్రధాన గుహలు ఉన్నాయి. ఈ గుహలు కృష్ణానది నుంచి సుమారు 2 కి.మీ. దూరంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశ పర్యటన చేస్తున్న సమయంలో బుద్ధుడు ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకున్నాడని చరిత్ర చెబుతోంది. కృష్ణాజిల్లాప్రాంతాన్ని 5వ శతాబ్దంలో పరిపాలించిన విష్ణుకుండినులు ఈ గుహలను, అందులో దేవతా మూర్తులను చెక్కించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గుహలలో మొత్తం ఐదు దేవతామూర్తులు ద ర్శనమిస్తాయి. శిల మీద చెక్కిన ఈ శిల్పాలు పవిత్రతను సంతరిస్తాయి. గుహలను తొలుచుకుంటూ ఈ మూర్తులను చెక్కారు. ఐదు గుహలు మొత్తం ఐదు గుహలలో మొదటిది గిరిపురంలో ఉంది. ఇక్కడ గుహలను నేల పాద ప్రాంతంలోనే చెక్కారు. కాని ఇక్కడ శిల్ప సంపద లేదు. గిరిపురం నుంచి కొద్ది దూరంలో మధు కల్యాణమండపం ప్రాంతంలో రెండవ గుహ ఉంది. ఇక్కడ ఆర్చి మీద నటరాజ విగ్రహం శిథిలావస్థలో ఉంది. ఆర్చి మీద వరుసగా ఏనుగు, సింహం, నంది శిల్పాలను అందంగా తీర్చారు. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు నంది, భృంగి శిల్పాలు కూడా శిథిలావస్థలోనే ఉన్నాయి. లోపల ముక్కలుగా ఉన్న శివలింగం మాత్రం కనిపిస్తుంది. బౌద్ధులు ఇక్కడకు వచ్చినప్పుడు, విగ్రహాలకు వ్యతిరేకంగా వీటిని ధ్వంసం చేసినట్లు స్థానికులు చెబుతారు. ఇక మొగల్రాజపురం మెయిన్ రోడ్లో ఉన్న మూడవ గుహలో త్రిమూర్తుల శిల్పాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఈ గుహలను కిందిభాగంలోనే చెక్కారు. ఈ గుహకు పక్కనే నాలుగవ గుహ దర్శనమిస్తుంది. ఈ గుహను కొండ మీద చెక్కారు. ఇక్కడ త్రిగుణాత్మకతను చూపేలా మూడు గుహలు కనిపిస్తాయి. ఇక అక్కడ నుంచి పక్క సందులోకి కొద్దిగా లోపలకు వెళితే ఐదవ గుహ కనిపిస్తుంది. ఇక్కడి నల్లరాతి మండపం నాటి కళను కళ్లకు కడుతుంది. మధ్యలో ఉన్న శాసన స్తంభం మహేశ్వరుని వివిధ రూపాలను చూపుతుంది. ఈ ఐదు గుహల నిర్మాణం ఉండవల్లి గుహల నిర్మాణం మాదిరిగానే ఉండటం చూస్తే, వీటిని నిర్మించినవారు ఒకరే అనిపిస్తుంది. గుహల గురించిన పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం యాత్రికులను ఆకర్షించే ప్రయత్నాలు ఏమీ జరగడం లేదు. జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినప్పటికీ ఈ గుహాలయాలకు సందర్శకులు ఒక గైడ్‌తో పాటు, వీటికి తగిన ప్రాధాన్యత, గుర్తింపు, ప్రచారం కలిగిస్తే, అజంతా ఎల్లోరా గుహలకు ఏ మాత్రం తీసిపోకుండా నగర ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేస్తాయనడంలో సందేహం లేదు. - డా.పురాణపండ వైజయంతి ఇలా చేరుకోవాలి... విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఈ గుహాలయాలు 3 కిలోమీటర్లు. ఇంద్రకీలాద్రి కొండకు చేరుకొని, అక్కడ నుంచి కాలి నడకన ఈ గుహాలయాలను సందర్శించవచ్చు. విజయవాడ బస్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్లు.క్యాబ్, హోటల్ వసతి సదుపాయాలున్నాయి. సమీప విమానాశ్రయం గన్నవరం. దాదాపు 17 కిలోమీటర్లు అన్ని ప్రధాన నగరాల నుంచి రవాణా సదుపాయాలున్నాయి. -
గుహే గృహం
హోండురాస్: కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గోడల మధ్య నిల్చొన్న ఈ బామ్మ పేరు డోనా ఫ్రాన్సిస్కా గోమెజ్. ఈమె ఇంటి గోడలు కూలొచ్చేమోగానీ ఇల్లు కూలదు. ఎందుకంటే అది ఇల్లేకాదు. మధ్య అమెరికాలోని హోండురాస్ దేశంలోని అడవి మధ్యలో ఉన్న ఒక గుహ. ఒంటరిగా గత 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటోంది. అడవిలో సేకరించిన కొద్దిపాటి కలపను దగ్గర్లోని ఊర్లో అమ్మి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటుంది. గతంలో ఇంటిపని చేసేది. భర్త చనిపోయిననాటి నుంచి గుహనే గృహంగా భావించి కాలం వెళ్లదీస్తోంది. -
పూరిల్లు కాదండోయ్.. 'పూరీ' ఇల్లు!!
-
ఈ ‘కేవ్’ ఓనర్ పూరీ జగన్నాథ్!
సీన్ నం.1 ఎనిమిది నెలల క్రితం... హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని రోడ్ నం. 31లో ఓ పాత బిల్డింగ్‌ను కూలగొడుతున్నారు. మొత్తం కూల్చేసి పునాదులు తీయడానికే చాలా రోజులు పట్టింది. కట్ చేస్తే... సీన్ నం.2 2014 జూలై 31... ఇప్పుడా ప్లేస్‌లో "cave'వెలిసింది. ‘కేవ్’ అంటే గుహ. మామూలుగా గుహలుండేది కొండల్లో. మరి నగరం మధ్యలో ఈ ‘కేవ్’ ఏంటి? ఆ ‘కేవ్’కి "restricted'అంటూ గేట్ ఏంటి? ‘సాక్షి’కి మాత్రమే "unrestricted'ఎంట్రీ దొరకడమేంటి? ఎన్నెన్నో నిర్మాణ విశేషాలున్న ఈ ‘కేవ్’ గురించి ఓనర్ పూరీ జగన్నాథ్‌నే అడిగేస్తే పోలా..! మీ ఆఫీస్ అదిరింది... మీ టేస్ట్ కనబడుతోంది... పూరీజగన్నాథ్: థ్యాంక్యూ... ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, నితిన్, రామ్‌గోపాల్‌వర్మ, ప్రకాశ్‌రాజ్, చార్మి, రానా వచ్చారు. వాళ్లకైతే పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఎన్టీఆర్ అయితే అప్పటికప్పుడు బోస్ కంపెనీ వాళ్ళ సింగిల్ టవర్ కాన్సెప్ట్ స్పీకర్ తెప్పించి నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇలాంటి ఆఫీస్‌లో ఇలాంటివే ఉండాలని చెప్పారు. రామూ గారు మా ఆఫీస్ స్టాఫ్‌ను పిలిచి ‘‘మీ ఆఫీస్ ఇంత టేస్ట్‌ఫుల్‌గా ఉంది కదా. మీరు రెగ్యులర్ జీన్స్, షర్ట్స్‌లో రావద్దు. బెర్ముడాలు, టీ షర్ట్స్ వేసుకు రండి’’ అని చెప్పారు. ఆఫీస్ చూడడం కోసం రోజూ చాలామంది వస్తున్నారు. ఇండియాలోనే ఇలాంటి సినిమా ఆఫీస్ లేదని అందరూ అంటున్నారు. సినిమాకి ఫస్ట్‌లుక్ ఇచ్చినట్లుగా, ఈ ఆఫీస్ ఫస్ట్‌లుక్ మీడియాలో ఫస్ట్ మీకే ఇస్తున్నా... అందుకే మిమ్మల్ని ఆహ్వానించా... అసలు ఇంత భారీ స్థాయిలో, అత్యాధునికంగా ఆఫీసు కట్టాలని ఎందుకనిపించింది? పూరీజగన్నాథ్: నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే మా కాలనీలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని పర్సనల్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నా. రాసుకోవడం, బొమ్మలు వేసుకోవడం లాంటివి అక్కడే చేసేవాణ్ణి. మా ఇంట్లో వాళ్లకు ఆ విషయం తెలీదు. ఒకసారి అనుమానమొచ్చి అడిగితే, ఏదో చెప్పి కవర్ చేశా. నాకంటూ పర్సనల్‌గా ఓ స్పేస్ ఉండాలనేది మొదట్నుంచీ నా కోరిక. మామూలుగా అందరికీ హాలీడే అంటే పనిచేయని రోజు. నాకు మాత్రం పనిచేస్తేనే హాలీడే. సో, మనం పనిచేసే ఏరియా హాలీడే మూడ్‌లో ఎగ్జైటింగ్‌గా ఉండాలి. అందుకే ఈ ఆఫీస్. అయినా నేను ఇంట్లో కన్నా ఎక్కువ ఆఫీస్‌లోనే ఉంటాను. అదొక రీజన్. సినిమా ఎంత స్పీడ్‌గా తీస్తారో ఆఫీస్ కూడా అంత స్పీడ్‌గా కట్టించేసినట్టున్నారు? పూరీజగన్నాథ్: (నవ్వుతూ) అవును. కేవలం 8 నెలల్లో ఈ బిల్డింగ్ రెడీ అయిపోయింది. హైదరాబాద్‌లో ఇంత ఫాస్ట్‌గా ఏ బిల్డింగూ రెడీ అయి ఉండదు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత గొప్పగా ఆఫీస్ కట్టుకోవడం ఎలా అనిపిస్తోంది? పూరీజగన్నాథ్: నా టైమ్ బావుందంతే! మధ్యలో మీ టైమ్ బాగోలేనట్టుంది? పూరీజగన్నాథ్: నేను నమ్మే కాన్సెప్ట్ ఎప్పుడూ ఒక్కటే... ‘నథింగ్ ఈజ్ పర్మినెంట్’. మంచి అయినా, చెడు అయినా ఏదీ శాశ్వతం కాదు. అంత పర్మినెంట్ కానప్పుడు ఇంత డబ్బు ఖర్చుపెట్టి, ఆఫీసు కట్టడం అవసరమా? పూరీజగన్నాథ్: (నవ్వుతూ) మీరు ఇది బిల్డింగ్ అనుకుంటున్నారా..? కేవ్ అండీ బాబూ. ఇంతకు ముందు మీ పాత ఆఫీస్ కూడా చాలా క్రియేటివ్‌గా ఉండేది కదా. దాన్నెందుకు తీసేశారు? పూరీజగన్నాథ్: అవును... అప్పట్లో ఆ ఆఫీస్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అయితే దాన్ని టెంపరరీగానే కట్టా. ఒక దశలో అప్పుల పాలై ఆ ఆఫీసు అమ్మేశా. ‘బిజినెస్‌మేన్’ సినిమా తర్వాత పుంజుకుని ఈ ఆఫీసు కొని, ఇక్కడున్న పాత బిల్డింగ్ పడగొట్టి నా డ్రీమ్ ఆఫీస్ కట్టుకున్నా. ఇందులోనే నా రెసిడెన్స్ కూడా. మీ ఆఫీస్ ఎంత బాగుందో, మీ హోమ్ థియేటర్ అంతకన్నా బాగుంది... పూరీజగన్నాథ్: నేనెక్కువ గడిపేది హోమ్ థియేటర్లోనే. యాపిల్ ఐ ట్యూన్స్ ద్వారా ఏ సినిమా కావాల్సి వస్తే, ఆ సినిమా ఇక్కడ చూడొచ్చు. అంతా శాటిలైట్ టెక్నాలజీ. మన అరచేతిలో వరల్డ్ సినిమా మొత్తం ఉన్నట్టే. ఒక్క సినిమాలు అనేకాదు, పాటలు, డాక్యుమెంటరీలు, టీవీ షోలు... ఇలా అన్నీ చూడొచ్చు. జస్ట్ ఐ ప్యాడ్ ద్వారానే కూర్చున్న చోట నుంచి కదలకుండా ఇవన్నీ ఆపరేట్ చేయొచ్చు. లైట్స్ ఆన్ అండ్ ఆఫ్, ఏసీ ఆపరేటింగ్ కూడా ఐ ప్యాడ్ ద్వారా చేసుకోవచ్చు. సినిమాలు చూడనప్పుడు దీన్ని డ్రాయింగ్ రూమ్‌లా కూడా వాడుకోవచ్చు. కర్టెన్స్ ఓపెన్ చేసుకుంటే, చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా ముచ్చట్లాడుకోవచ్చు. ఒకసారి పైకి చూడండి. పైన సీలింగ్‌కి వాడిన వాల్‌పేపర్‌కు ఓ స్పెషాల్టీ ఉంది. లండన్‌లో ఫేమస్ ప్లే అయిన ‘ఫ్యాంటమ్ ఆఫ్ ది ఓపెరా’ వాల్ పోస్టర్ అది. ఆ నాటకం గొప్పతనం ఏంటంటే - గత యాభై ఏళ్లుగా నిర్విరామంగా ప్రదర్శిస్తూనే ఉన్నా, ఇప్పటికీ అది హౌస్‌ఫుల్లే. ఇక్కడ వాడిన ఆడియో సిస్టమ్స్ కూడా చాలా అత్యాధునికం. హైదరాబాద్‌లో ఈ తరహా సిస్టమ్ ఇదే మొట్టమొదటిదట. ఈ ఆఫీస్ డిజైనింగ్ ఆలోచన అంతా మీదేనా? పూరీజగన్నాథ్: జయకిరణ్ అని హైదరాబాద్‌లో ఫేమస్ ఆర్కిటెక్ట్. నా స్నేహితుల ఇళ్లల్లో ఆయన వర్క్ చూసి, ఈ ప్రాజెక్ట్ అప్పగించా. ఆయనతో గంటలు గంటలు కూర్చొని నా పిచ్చి అంతా చెప్పా. దానికి తగ్గట్టే ఆయన డిజైన్ చేశారు. ఫ్లోరింగ్ అంతా చాలా కొత్తగా ఉంది! పూరీజగన్నాథ్: నాకు రెగ్యులర్ ఫ్లోరింగ్ నచ్చదు. ఇలా పాలిపోయినట్టుగా, రస్టిక్‌గా ఉంటేనే ఇష్టం. క్యాలిఫోర్నియా స్లేట్ని కొన్ని గోడలకు వాడాం. స్పెయిన్ నుంచి ఆర్డర్ చేసిన ఉడెన్ ఫ్లోర్లా అనిపించే టైల్స్ మరికొన్ని చోట్ల వాడాం. అంతా రెడీ అయ్యాక ఫ్లోర్స్‌ను క్లీన్ చేయడానికి కొంతమంది వచ్చారు. ఆ టైమ్‌లో ఒకామె నాతో అన్న మాటలు విని నాకు నవ్వొచ్చింది. ‘‘ఏం సార్... ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. ఫ్లోరింగ్ మాత్రం సెకండ్ హ్యాండ్ కొన్నారేం’’ అందామె. ఆ డిజైనింగ్ అలా ఉంటుందని ఆమెకు తెలియదు కదా. ఇంతకూ మీ హోమ్ స్టూడియోకు ‘కేవ్’ అనే పేరు ఎందుకు పెట్టినట్టు? పూరీజగన్నాథ్: ప్రపంచం ఓ అడవి లాంటిది. అందులో నేనో జంతువును. నేను ఉండడానికి ఓ కేవ్ దొరికిందంతే. సరే... దీనికి ఎంత బడ్జెట్ అయ్యింది? పూరీజగన్నాథ్: ఇప్పుడు అవసరమా! ముందు మంచి కాఫీ తాగండి. మా ఆఫీస్‌లో కాఫీ బార్ కూడా ఉంది. కేపర్చినో, ఎక్స్‌ప్రెసో... ఇలా ఏది కావాల్సి వస్తే అది తాగొచ్చు. - పులగం చిన్నారాయణ The Man Behind.... ఆర్కిటెక్ట్‌గా నా కెరీర్ 1998లో మొదలైంది. ఇప్పటివరకూ ఉన్న నా క్లయింట్స్ అందరిలోకెల్లా పూరీగారు డిఫరెంట్. ఫలానాది వాడుతున్నామంటే ‘ఓకే’ అనేసేవారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. పూరీ గారితో వర్క్ చేయడం వెరీ ఫన్. నా ఐడియాలను బాగా గౌరవించేవారు. ఆయన బిహేవియర్ ప్యాట్రన్‌ను దృష్టిలో పెట్టుకునే, ఈ ఆఫీస్ డిజైన్ చేశాం. ఆయనకు ప్రకృతి ఇష్టం కాబట్టి, చుట్టూ చెట్లు, మొక్కలు, పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చాం. ఆయనకు బ్లాక్ అంటే ఇష్టం. ఆందుకే ఈ ఆఫీస్‌లో ఎక్కువ అంశాలు బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. ఆయన చాలా ఇన్ఫార్మల్గా ఉంటారు. అందుకే ఆఫీస్‌ను కూడా ఇన్ఫార్మల్గా డిజైన్ చేశాం. 18,000 చదరపు అడుగుల్లో ఈ ఆఫీస్ కట్టాం. గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్‌కు ఉంచేశాం. ఫస్ట్ ఫ్లోర్ సినిమా ఆఫీస్. సెకండ్ ఫ్లోర్లో జగన్‌గారి పర్సనల్ రూమ్, లైబ్రరీ, ఫొటోసెషన్ రూమ్‌తో పాటు రెసిడెన్స్ ఉండేలా డిజైన్ చేశాం. ఫ్రంట్ ఎలివేషన్‌ను ఐరన్ గ్రిల్స్‌తో లైన్స్‌లా పెట్టడానికి కారణం కొత్తగా, స్టయిలిష్‌గా ఉంటుందనే. దానికి తోడు ఈయన తీసే సినిమాల వల్ల ఆఫీసు మీద అప్పుడప్పుడు రాళ్లు పడుతుంటాయి కదా... (నవ్వేస్తూ). ఇది యాక్చ్యువల్‌గా గ్లాస్ హౌస్. లైటింగ్ కూడా నేచురల్‌గా ఉంటుంది. పగలు లైట్లు వాడనవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే, లైటింగ్ ఎక్కువ అవుతోందని స్టిక్కరింగ్ చేయాల్సి వచ్చింది. టై మీద సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సోలార్ ఎనర్జీ వాడుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. ఏసీని కూడా సోలార్ ఎనర్జీతో రన్ చేసుకోవచ్చు. - జయకిరణ్, ఆర్కిటెక్ట్ ఆఫీస్ ముందు 11 అడుగుల యూరోపియన్ స్టాచ్యూ... యూరోపియన్ స్టాచ్యూను రెప్లికా చేసి ఆఫీస్ ముందు పెడుతున్నాం. సుమారు 11 అడుగుల ఎత్తు ఉంటుందా స్టాచ్యూ. అలాగే అమెరికా నుంచి 10 అడుగుల రెక్కలున్న పెద్ద ఫ్యాన్లు తెప్పిస్తున్నాం. ఆ కంపెనీ వాళ్లకు మన స్పెసిఫికేషన్స్ నచ్చితేనే ఆర్డర్ ఓకే చేస్తారు. ఆఫీస్‌లో సోఫాలన్నీ దాదాపుగా టచ్ ఆపరేటెడ్. ఆఫీస్‌లో ఇంటర్‌కామ్ ఉంది. అంతా ఇంటర్నెట్ ఆపరేటెడ్. ఫారిన్ నుంచి కూడా ఇంటర్‌కామ్‌లో మాట్లాడొచ్చు. ఆఫీస్‌లో ఎక్కడేం జరుగుతోందో... ఐ ప్యాడ్ ద్వారా ప్రపంచం ఏ మూలన ఉన్నా చూడొచ్చు. ఫారిన్ వెళ్లినప్పుడు ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ కొనాలి. ఫొటోలు: శివ మల్లాల -
సంక్రాంతికే రిలీజ్!
సినిమా ప్రారంభించిన నాడే విడుదల తేదీని ప్రకటించడం పూరీ జగన్నాథ్ స్టయిల్. ఎన్టీఆర్ హీరోగా, తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రానికి కూడా అదే చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేస్తామని ప్రకటించారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ఇటీవలే పూరీ ముచ్చటగా కట్టించుకున్న నూతన కార్యాలయం ‘కేవ్’లో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఉదయం 7.44 నిమిషాలకు దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పూరీ జగన్నాథ్ కెమెరా స్విచాన్ చేయగా, ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్‌తో ‘బాద్షా’ తర్వాత నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. అలాగే, మా సంస్థలో పూరీకి కూడా ఇది రెండో సినిమా. ఓ విభిన్న తరహాలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్. ఇప్పట్నుంచీ నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం. ఎన్టీఆర్, పూరి, మా సంస్థకు ప్రతిష్టాత్మకంగా నిలిచే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని, రమాప్రభ, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సమర్పణ: శివబాబు బండ్ల.