జమ్ముకశ్మీర్‌లో ప్రతీయేటా జరిగే అమర్‌నాథ్‌యాత్రకు ఈసారి భక్తులు పోటెత్తారు. మహాశివుని నామస్మరణలతో జరుగుతున్న యాత్రలో రెండవ రోజున (ఆదివారం) సుమారు 14,717 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 28 వేల మంది అమరనాథుని దర్శనం చేసుకున్నారు.
అమర్‌నాథ్ యాత్ర చేసేందుకు తాజాగా పహల్‌గావ్, బాల్టల్‌ల నుంచి రెండవ బృందం బయలుదేరింది. మొత్తం 309 వాహనాలలో బాల్టన్ మార్గంలో 2,106 మంది పురుషులు, 11 మంది పిల్లలు, 115 మంది సాధువులు, 41 మంది సాధ్విలు యాత్రకు బయలుదేరారు. ఈ మార్గంలో స్థానికులు యాత్రికులకు స్వాగతం పలికారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానికులతో పాటు అమర్‌నాథ్ యాత్రకు వెళుతున్న భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీనగర్‌లోని వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై మొదటివారం నుంచి వర్షాలు కురియనున్నాయి. 25వ సారి అమర్‌నాథ్ యాత్ర చేస్తున్న కృష్ణకుమార్ మీడియాతో మాట్లాడుతూ గతంలోకన్నా ప్రస్తుతం ఏర్భాట్లు బాగున్నాయని అన్నారు. తాను కోవిడ్ సమయంలోనూ హెలికాప్టర్‌లో అమర్‌నాథ్ యాత్ర చేసుకున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment