లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్( భోలే బాబా)పై శనివారం తొలి కేసు నమోదైంది. అయితే భోలే బాబాకు సంబంధించి పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019కి ముందు భోలేబాబా కొన్ని రోజులు లఖింపూర్‌ఖేరిలో అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పడు నివసించిన విలాసవంతమైన భవనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ భవనంలో ఒక లగ్జరీ కార్లు, గుహ వంటి నిర్మాణంలో ఉన్న గది ఉన్నాయి. అందులో భోలే బాబా ఫొటోలు, మంత్రాల చిత్రాలు కనిపించాయి. ఈ బిల్డింగ్‌లోనే భోలే బాబా మూడునాలుగు సార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చివరిసారి ఇక్కడ 2019లో 15 రోజులపాటు ఉన్నట్లు ఈ భవనం యజమాని గోవింద్ పుర్వార్ తలిపారు.
ఇక.. ఈ బిల్డిండ్ పూర్తిగా వ్యవసాయ భూములు, పెద్ద తోటల మధ్యలో ఉండటం గమనార్హం. ఈ భవనంలో విశాలమైన పార్కింగ్ స్థలం ఉంది. భోలే బాబాకు చెందిన రెండు లగ్జరీ కార్లు ఇక్కడ పార్క్ చేయబడి ఉన్నాయి. వంట చేసుకోవటం కోసం కిచన్, స్టవ్, సామాగ్రి కూడా ఉన్నాయి.
వంటగది పక్కనే గుహవంటి రూం ఉంది. ఇందులో 2019 నాటి భోలే బాబా సత్సంగ్ పోటోలు ఉన్నాయి. మరో గదిలో గోధుమ కంటేయినర్లు, భోలే బాబా ఫోటోలు, హనుహాన్ చాలిసా మాదిరిగా చేతితో రాసిన హారతి చాలిసా ఉన్నాయి. అయితే భోలే బాబా ఈ భవనంలో విశ్రాంతి తీసుకునేవారని స్థానికంగా ఉండే ఆయన భక్తులు మీడియాతో తెలిపారు.
ఇక తొక్కిసలాట ఘటన తర్వాత భోలేబాబా శనివారం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు హత్రాస్ ఘటనపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం జూలై 3న హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment