అకస్మాత్తుగా కుంగిన రోడ్డు..ఒక్కసారిగా కుక్క, రెండు బైక్‌లు.. | Road In South Delhi Caves Dog And 2 Motorbikes Fall Into Sinkhole | Sakshi
Sakshi News home page

Viral Video: అకస్మాత్తుగా కుంగిన రోడ్డు..ఒక్కసారిగా కుక్క, రెండు బైక్‌లు..

Published Sat, Feb 25 2023 9:28 PM | Last Updated on Sat, Feb 25 2023 9:28 PM

Road In South Delhi Caves Dog And 2 Motorbikes Fall Into Sinkhole - Sakshi

ఇటీవలకాలంలో పలు మెట్రో నగరాల్లో రోడ్లు అకస్మాత్తుగా కుంగిన ఘటనలను ఎన్నోచూశాం. భారీ వర్షాల కారణంగా నీళ్లు నిలిచిపోవడంతో ఇలాంటి ఘటనలు ఎదువ్వడం చూశాం. కానీ ఉన్నట్టుండి..అదికూడా ఒక ఇరుకు సందు రోడ్డు కుంగిపోవడం అందర్నీ షాక్‌ గురి చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న ఓ కుక్క, రెండు బైక్‌లో ఆ గుంతలో పడిపోయాయి.

జస్ట్‌​ అప్పుడే అట​గా వచ్చిన ఒక వాహనదారుడు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అందులో ఇరుకైన రోడ్డు సందులో రెండు బైక్‌ల మధ్య ఒక కుక్క కూర్చొని కనిపిస్తోంది. అంతే అకస్మాత్తుగా రోడ్డు కూలినట్లు కనిపించింది. దీంతో ఒక్కసారిగా  ఏం జరిగిందో అనుకుంటూ..కొంతమంది రాగా, ఇంతలో మరోభాగం కూడా కూలిపోతుంది.  ఫిబ్రవరి 22న ఢిల్లీలోని ఆర్‌కే పురం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసకుంది. ఐతే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. అలాగే ఆ రోడ్డును మరమత్తు చేసినట్లు కూడా తెలిపారు. 

(చదవండి: భారత్‌ గగనతలంపై స్పై బెలూనా? అదీకూడా అమెరికా కంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement