sinkhole
-
ప్రపంచంలో అత్యంత లోతైన 5 సింక్‌హోల్స్.. భారీ భవనమే కాదు.. పెద్ద అడవి సైతం..
భూమి ఉపరితలం కింద ఉన్న రాళ్లు సహజంగా భూగర్భ జలాల్లో కరిగిపోయినప్పుడు సింక్ హోల్స్ ఏర్పడతాయి. ఇలా రాళ్ళు కరిగిపోతున్నప్పుడు, భూమి లోపల గుహలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గుహ పై భాగంలోని నేల బరువును తట్టుకోలేనప్పుడు, అది కూలిపోతుంది. అప్పుడు భారీ సింక్‌హోల్ ఏర్పడుతుంది. అయితే దానిలోనూ పర్యావరణ వ్యవస్థ అలానే ఉంటుంది. అలాంటి ఐదు లోతైన సింక్ హోల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జియా ఓఝాయీ టియాంకెంగ్, చైనా చైనాలోని ఫెంగ్జీ కౌంటీలో జియా ఓఝాయీ టియాంకెంగ్లో అతిపెద్ద సింక్‌హోల్ ఉంది. ఈ సింక్ హోల్‌కు పిట్ ఆఫ్ హెవెన్ అనే పేరు పెట్టారు. ఇది 662 మీటర్ల లోతుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన సింక్ హోల్గా గుర్తింపు పొందింది. బయూ కార్న్ సింక్‌హోల్, అమెరికా ఇది అమెరికాలోని లూసియానాలో ఉంది. 2012లో భూకంపాలు సంభవించిన సమయంలో ఇది బయటపడింది. భూగర్భంలోని ఉప్పు దిబ్బ కూలిపోవడంతో ఈ సింక్ హోల్ ఏర్పడింది. 2014 నాటికి ఇది 229 మీటర్ల లోతు కలిగివుంది. కాపర్ మైన్ సింక్‌హోల్, చిలీ 2020, జూలైలో చిలీలో ఒక సింక్ హోల్ బయటపడింది. ఇది 32 మీటర్ల చుట్టుకొలతతో 200 మీటర్ల లోతున ఉందని అంచనా. ఈ సింక్ హోల్ రాగి గనుల సమీపంలో ఏర్పడింది. మిస్టరీ సింక్ హోల్, చైనా 2022లో చైనా శాస్త్రవేత్తలు గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో 192 మీటర్ల లోతైన సింక్‌హోల్‌ను కనుగొన్నారు. ఇది 306 మీటర్ల లోతు, 150 మీటర్ల వెడల్పుతో ఉంది. అది ఎంత పెద్దదంటే దానిలోపల పెద్ద అడవి వ్యాపించింది. గ్రేట్ బ్లూ హోల్, అమెరికా గ్రేట్ బ్లూ హోల్ సముద్రంలో ఉంది. ఇది అమెరికాలోని బెలిజ్ తీరంలో ఉంది. ఇది 124 మీటర్ల లోతు కలిగివుంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన బెలిజ్ బారియర్ రీఫ్ రిజర్వ్ సిస్టమ్‌లో భాగంగా ఉంది. ఇది కూడా చదవండి: పాక్‌లోనూ పెద్ద నోట్ల రద్దు?.. ప్రభుత్వం పడిపోయే ప్రమాదంలో ఉందా? -
రోడ్డు మధ్యలో సింక్ హూల్...తప్పిన ప్రమాదం
-
అకస్మాత్తుగా కుంగిన రోడ్డు..ఒక్కసారిగా కుక్క, రెండు బైక్‌లు..
ఇటీవలకాలంలో పలు మెట్రో నగరాల్లో రోడ్లు అకస్మాత్తుగా కుంగిన ఘటనలను ఎన్నోచూశాం. భారీ వర్షాల కారణంగా నీళ్లు నిలిచిపోవడంతో ఇలాంటి ఘటనలు ఎదువ్వడం చూశాం. కానీ ఉన్నట్టుండి..అదికూడా ఒక ఇరుకు సందు రోడ్డు కుంగిపోవడం అందర్నీ షాక్ గురి చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న ఓ కుక్క, రెండు బైక్‌లో ఆ గుంతలో పడిపోయాయి. జస్ట్ అప్పుడే అటగా వచ్చిన ఒక వాహనదారుడు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ఇరుకైన రోడ్డు సందులో రెండు బైక్‌ల మధ్య ఒక కుక్క కూర్చొని కనిపిస్తోంది. అంతే అకస్మాత్తుగా రోడ్డు కూలినట్లు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఏం జరిగిందో అనుకుంటూ..కొంతమంది రాగా, ఇంతలో మరోభాగం కూడా కూలిపోతుంది. ఫిబ్రవరి 22న ఢిల్లీలోని ఆర్కే పురం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసకుంది. ఐతే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అలాగే ఆ రోడ్డును మరమత్తు చేసినట్లు కూడా తెలిపారు. #WATCH | A road collapsed in Delhi’s RK Puram area on February 22. A dog and a bike fell inside a hole formed after a narrow passage of the road collapsed. No fatalities were reported: Delhi Police (CCTV visuals verified by Police) pic.twitter.com/EbK2Q6no0P — ANI (@ANI) February 25, 2023 (చదవండి: భారత్ గగనతలంపై స్పై బెలూనా? అదీకూడా అమెరికా కంటే..) -
ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి.. వీడిన మిస్టరీ!
శాంటియాగో: భారీగా, ఎంతలా అంటే ఊళ్లకు ఊళ్లనే మింగేసేంతగా ఆ గొయ్యి.. అంతకంతకు పెరుగుతూ చిలీ దేశాన్ని.. అక్కడి నుంచి ప్రపంచాన్నే వణికించింది. ఏదో వినాశనం తప్పదంటూ ప్రచారమూ ఊపందుకుంది. ఈ ఊదరగొట్టుడు హెడ్‌లైన్స్ వెనుక అతిశయోక్తి మాత్రమే ఉందని చెబుతూ.. అసలు విషయాన్ని వెల్లడించారు అధికారులు. చిలీ రాజధాని శాంటియాగోకు 800 కిలోమీటర్ల దూరంలోని, అటకామా రీజియన్‌లో టియెర్రా అమరిల్లా దగ్గర ఈ నెల మొదట్లో ఈ భారీ గుంత ఏర్పడి.. క్రమక్రమంగా పెరుగుకుంటూ పోతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. వెడల్పు అంతకు అంతకు పెరుగుతూ.. సుమారు 200 మీటర్ల లోతైన ఈ గుంత.. మన శాట్చ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని(198 మీటర్లు) మింగేసేంత సామర్థ్యం ఉంటుందన్న మాట. అయితే.. ప్రాథమిక దర్యాప్తులో ఈ భారీ గొయ్యి ఎలా ఏర్పడిందన్న దానిపై ఎలాంటి అంచనాకు రాలేకపోయారు అక్కడి అధికారులు.. ఇప్పుడు ఆ మిస్టరీని దాదాపుగా చేధించారు. మానవ కార్యకలాపాల వల్లే ఆ భారీ గొయ్యి ఏర్పడిందని నిర్ధారణకు వచ్చేశారు. ఆ ప్రాంతంలో భారీ మైనింగ్ కార్యకలాపాల వల్ల ఆ గుంత ఏర్పడి ఉంటుందని అంచనాకి వచ్చి.. దానిని పూడ్చేసే ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నారు. Tierra Amarilla.. ప్రపంచంలోనే ఎక్కువగా కాపర్‌ను ఉత్పత్తి చేసే హబ్. కెనడాకు చెందిన ఓ కంపెనీ కార్యకలాపాల వల్లే ఈ భారీ గొయ్యి ఏర్పడి ఉంటుందని ఒక అంచనాకి వచ్చారు అక్కడి అధికారులు. ఈ విషయంపై మైనింగ్ మినిస్టర్ మార్సెలా హెర్నాండో స్పందిస్తూ.. మితిమీరిన మైనింగ్ కార్యకలాపాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ భారీ గొయ్యి ఏర్పడిన సమీప ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. -
షాకింగ్ వీడియో.. వ్యక్తిని లాగేసిన స్విమ్మింగ్‌పూల్ సింక్‌హోల్!
జెరుసలేం: ఓ ఇంట్లో నిర్వహించిన పార్టీ విషాదాంతంగా మారింది. ఆనందంగా గడుపుతున్న బంధువులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతుండగా ఒక్కసారిగా మధ్యలో సింక్‌హోల్ ఏర్పడింది. పూల్‌లోని నీరు వేగంగా సింక్‌హోల్‌లోకి వెళ్లగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా భయంతో వెనక్కి వెళ్లాడు. బాధితుడు సుమారు 43 అడుగుల లోతైన గుంతలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిని సింక్‌హోల్ లాక్కెళుతున్న షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ఇజ్రాయెల్‌లోని కర్మీ యోసెఫ్ నగరంలో గురువారం జరిగింది. సింక్‌హోల్ తెరుచుకున్న ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుడు 30 ఏళ్ల కిమ్హీగా పోలీసులు గుర్తించారు. అతడిని కాపాడేందుకు యత్నించిన 34 ఏళ్ల వ్యక్తికి స్వల్పగాయాలైనట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో మొత్తం ఆరుగురు ఉన్నారు. అయితే.. మిగిలిన వారు ప్రమాదాన్ని గుర్తించటం వల్ల ఎలాంటి హాని జరగలేదు. “One man has been injured and another is missing after a sinkhole opened up in a inground pool at a home in central Israel. The incident occurred during a pool party." pic.twitter.com/S9cByAFebx — natureismetal (@NIMactual) July 21, 2022 నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఆ విల్లా యజమానులైన ఆరవై ఏళ్ల దంపతులను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఐదురోజుల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. వృద్ధ దంపతులు తమ ఇంట్లో గురువారం పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సుమారు 50 మంది వరకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆరుగురు స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ సరదాగా గడిపారు. అయితే.. ఒక్కసారిగా పూల్ మధ్యలో భారీ గొయ్యి ఏర్పడటం వల్ల వారు గమనించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే స్విమ్మింగ్ పూల్ నిర్మించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: డ్రైవర్ తప్పిదం.. వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు 24 మంది విద్యార్థులు.. -
చైనాలో మరో అద్భుతం.. ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్
Giant Sinkhole in China.. ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిని కనుగొనే ప్రయత్నంలో అద్భుతాలను చూసి ఆశ్యర్యపోతుంటాం. ఇలాంటివి నిజంగానే ఉంటాయా అని షాక్ అవుతుంటాం. తాజాగా చైనాలో మరో అద్బుతం జరిగింది. భూమిలోపల దట్టమైన పురాతన అడవిని అన్వేషకులు ఇటీవల కనుగొన్నారు. ఈ అడవి ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి.. చైనా అధికారిక మీడియా జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ ప్రాంతంలో ఒక భారీ సింక్ హోల్ బయటపడింది. అందులో అద్భుతమైన పురాతన అటవీ ప్రాంతం కూడా ఉన్నట్టు అన్వేషకులు గుర్తించారు. మే 6వ తేదీన లేయ్ కౌంటీలోని సింక్‌హోల్ గుహను వారు కనుగొన్నారు. ఈ సింక్‌హోల్ అడుగున 40 మీటర్ల ఎత్తైన చెట్లున్నాయి. దీని లోపలి ప్రాంతం మొత్తం చెట్లతోనే విస్తరించి ఉంది. ఆ చెట్ల కొమ్మలు సింక్‌హోల్ పైవరకూ ఉన్నాయి. సింక్‌హోల్ 1,004 అడుగుల పొడవు, 492 అడుగుల వెడల్పు, 630 అడుగుల లోతుతో ఉంది. ఈ సింక్‌హోల్ ఘనపరిమాణం 5 మిలియన్ క్యుబిక్ మీటర్లకు మించి ఉంది. దానిలో చెట్లు 131 అడుగుల ఎత్తులో ఉన్నాయని తెలిపారు. కాగా, తాజాగా కనుగొన్న దానితో కలిసి చైనాలో గుర్తించిన సింక్ హోల్స్ సంఖ్య 30కి చేరింది. ఇప్పటివరకు కనిపెట్టిన అన్ని సింక్‌హోల్‌లో ఇదే పెద్దది అని అన్వేషకులు చెబుతున్నారు. ఈ సందర్బంగా గ్వాంగ్జీ అన్వేషణ బృందానికి నాయకత్వం వహించిన చెన్ లిక్సిన్ మాట్లాడుతూ.. సింక్‌హోల్‌లో ఉన్న పురాతన చెట్లు దాదాపు 40 మీటర్ల ఎత్తు (131 అడుగులు), దట్టంగా అళ్లుకుని ఉన్నారు. ఇప్పటి వరకు సైన్స్ గుర్తించని లేదా వర్ణించని జాతులు ఇందులో కనిపించే అవకాశం ఉందన్నారు. పరిశోధకులు సింక్‌హోల్ దిగువకు చేరుకోవడానికి చాలా గంటలు కాలినడక ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. మరోవైపు.. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతం అందమైన కార్ట్స్ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి వెళ్తుంటారు. 30th giant karst sinkhole discovered in south China's Guangxi pic.twitter.com/52ZxFnyuWF — CGTN (@CGTNOfficial) May 11, 2022 -
పార్క్ చేసిన కారు క్షణాల్లో మాయం.. వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వరదల దాటికి రోడ్లపై భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. తాజాగా అపార్ట్మెంట్ ఆవరణలో పార్క్ చేసిన ఉన్న కారు క్షణాల్లో గుంతలో మునిగిపోవడం వైరల్‌గా మారింది. ఘట్కోపర్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ ఆవరణలో ఇది చోటుచేసుకుంది. అయితే కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై గుంతలు పడ్డాయి. అయితే బురదతో నిండిపోయి గుంత ఏర్పడడంతో కారు మెళ్లిగా మునగడం ప్రారంభమైంది. చూస్తుండగానే కారు ముందుబాగం మునిగింది.. కాసేపటి తర్వాత కారు పూర్తిగా గుంతలోకి దిగిపోయి బుడగలు తేలుతూ క్షణాల్లో మాయమైంది.అయితే దాని పక్కనున్న కార్లకు మాత్రం ఏం కాకపోవడం ఇక్కడ మరో విశేషం. దీనికి సంబంధించిన వీడియోనూ సుభోద్ శ్రీవాత్సవ అనే వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేశాడు. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 50వేల మందికి పైగా వీక్షించారు. చదవండి: మొసలి పంజా.. దెబ్బకు కోమాలోకి ; ఆ తర్వాత Viral Video : మాట వినలేదని కాంట్రాక్టరుపై ఎమ్మెల్యే దాడి #MumbaiRains Car swallowed completely by a sinkhole in residential complex in Mumbai.. Later discovered that it was a covered well under a parking lot! pic.twitter.com/nvLct0QqfU — Subodh Srivastava 🇮🇳 (@SuboSrivastava) June 13, 2021 -
వామ్మో.. ఇది ఇంటిని మింగేసేలా ఉందిగా
కొన్ని చోట్ల ఆకస్మాత్తుగా భూమి కుంగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. దీనినే సింక్ హోల్ అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఏకంగా ఓ పుట్ బాల్ గ్రౌండంతా భూమి కుంగిపోయింది. ఎక్కడంటే? మెక్సికోలోని శాంటా మారియా జాకాటెపెక్లోని ఓ పొలంలో భూమి ఉన్నట్లుండి కుంగిపోయింది. ప్రస్తుతం ఆ సింక్ హోల్ అక్కడే ఉన్న ఇంటిని త్వరలోనే మింగేసేంతలా కనపడుతోంది. సింక్ హోల్ ఏర్పడిన మొదట్లో ఆ ఇంటికి చాలా దూరంలో ఇది ఏర్పడినా.. తర్వాత మెల్లగా పెరుగుతూ ఇంటి వరకూ వచ్చేసింది. కాగా సింక్‌హోల్ చుట్టుపక్కల ఉన్న పొలంలో కుక్కలు నాలుగు రోజుల క్రితం పడిపోయాయి. వాటిని కాపాడాలని జంతుప్రేమికలు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలాంటి సింక్ హోల్ నుంచి ఆ కుక్కలను రక్షించడం ప్రమాదకరమని అధికారులు తెలిపారు. ఇది సుమారు 125 మీటర్లు, 45 మీటర్ల లోతు ఉండవచ్చని అధికారలు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ చుట్టు పక్కల 600 మీటర్ల వరకు ప్రజలను అనుమతించకూడదని మెక్సికన్ ప్రభుత్వం తెలిపింది. మట్టి వదులుగా ఉన్న ప్రాంతాల్లో భూమి ఇలా ఉన్నట్టుండి కుంగిపోతుంది. VIDEO: A sinkhole that has been growing dozens of meters daily since last weekend is worrying the residents of a rural area in the Mexican state of Puebla pic.twitter.com/CJlsRjCiOP — AFP News Agency (@AFP) June 2, 2021 చదవండి: వైరల్: అమెరికా అధ్యక్షుడికి భార్య కౌంటర్.. దెబ్బకు సైలంట్ -
షాకింగ్.. కార్లన్నీ భూమి లోపలికి..
రోమ్: ఇటలీ నేపుల్స్‌లోని ఓ ఆస్పత్రి ప్రాంగణంలో వింత సంఘటన చోటు చేసుకుంది. అప్పటివరకు అంతా బాగానే ఉన్న ఆ ఏరియాలో ఉన్నట్లుండి కార్లన్ని భూమిలోకి వెళ్లిపోయాయి. దాంతో కంగారు పడిన జనాలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన వల్ల కరెంట్ కట్ అయ్యింది. దాంతో ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిని పేషంట్లను బయటకు తరలించారు. ఇక ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని సమాచారం. ఈ సంఘటన గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ‘ఓస్పడేల్ డెల్ మేరే కార్ పార్కింగ్ ప్రాంతంలో సింగ్ హోల్ ఏర్పడింది. ఫలితంగా ఇక్కడ పార్క్ చేసిన కార్లు లోపలికి పడిపోయాయి. "హైడ్రో-జియోలాజికల్ సమస్య" వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది’ అని ఇటలీ అగ్నిమాపక శాఖ ట్విట్టర్లో పేర్కొంది. ఇక నేపుల్స్ ఆస్పత్రి ఉన్న కాంపానియా ప్రాంత అధిపతి విన్సెంజో డి లూకా మాట్లాడుతూ.. "అదృష్టవశాత్తూ ఈ ఘటన సిస్టమ్స్ ఇంజనీరింగ్ పరంగా.. ముఖ్యంగా మానవ జీవితాల పరంగా ఎటువంటి నష్టం కలిగించలేదు" అని తెలిపారు. ఇక ఈ ఆస్పత్రి కరోనా వైరస్ పేషెంట్ల చికిత్సకు ప్రధాన కేంద్రంగా కొనసాగుతుంది. మొదటి వేవ్ ప్రారంభం అయిన నాటి నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున కోవిడ్ పేషంట్లకు చికిత్స అందిస్తున్నారు. సింక్‌హోల్ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ వేటి నీరు, కరెంట్ కోత ఏర్పడింది. దాంతో కోవిడ్ వార్డును తాత్కలికంగా మూసి వేశారు. (చదవండి: 2 వేల ఏళ్ల నాటి శవాలు: లావాలో..) -
సెకన్ల వ్యవధిలో ఎంత ఘోరం జరిగిపోయింది
బీజింగ్ : ప్రమాదాలనేవి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో ఎవరూ చెప్పలేరు. అందుకు ఉదాహరణగా చైనాలోని గ్జీనింగ్ పట్టణంలో చోటుచేసుకున్న ప్రమాదాన్ని చూస్తే అది నిజమేననిపిస్తుంది.రోడ్డుపై వెళుతున్న ఒక బస్సు బస్టాప్‌లో వచ్చి ఆగింది. ప్రయాణికులు బస్సును ఎక్కుతున్న సమయంలో ఆకస్మాత్తుగా గుంతలో కూరుకుపోయింది. తర్వాత కొన్ని సెకన్ల వ్యవధిలో మంటలు చెలరేగడంతో పాటు బస్సు మొత్తం అందులోకి కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా,10 మంది ఆచూకీ లభించలేదు. కాగా ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సీసీటీవి ఫుటేజీ ఆధారంగా తెలుస్తుంది. అయితే ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం తెలియడం లేదు. ప్రమాద సమయంలో ప్రయాణికులు గుంతలో పడిన దృశ్యాలు రికార్డయ్యాయి.దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బలగాలు ఘటనా స్థలికి చేరుకొని ఆపరేషన్ నిర్వహించి బస్సును బయటికి తీశారు. కాగా గుంతలో పడిన వారిలో ఇప్పటివరకు 16 మందిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం చైనాలో కొత్తేం కాదు. ఇంతకుముందు చైనాలోని షెంజెన్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో 10 మీటర్ల మేర భారీ గుంత ఏర్పడి ఐదుగురు మృతి చెందారు. -
ఇది నిజంగా ఊహించని పరిణామమే..
పిట్స్బర్గ్ : మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే అలాంటి ఊహించని ఘటనలు జరిగినప్పుడు జాగ్రత్తగా బయటపడడమే తప్ప మనమేం చేయలేం. తాజాగా అమెరికాలోని పిట్స్బర్గ్ సిటీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పిట్స్‌బర్గ్‌లో కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో అక్కడి రోడ్లలో తరచూ గుంతలు ఏర్పడుతున్నాయి. సోమవారం కూడా ఉదయం పూట రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పిట్స్బర్గ్ జంక్షన్ వద్దకు రాగానే రెడ్ సిగ్నల్ పడడంతో ఒక బస్సు వచ్చి ఆగింది. గ్రీన్ సిగ్నల్ పడగానే బస్సును ముందుకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా భూమి కుంగిపోయి దాదాపు పది అడుగుల మేర భారీ గుంత ఏర్పడింది. దాదాపు సగం బస్సు ఆ గుంతలో కూరుకుపోయింది. అయితే ఆ సమయంలో బస్సు డ్రైవర్‌తో పాటు కేవలం ఒక పాసింజర్ మాత్రమే ఉండడంతో వారిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, ప్యాసింజర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే బస్సు వెనకే వచ్చిన ఒక కారు ముందుబాగం కూడా ఆ గుంతలో కూరుకుపోయింది.వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గుంతలో పడిన బస్సును ప్రొక్లెయినర్‌తో బయటికి తీశారు. అందుకే మనకు తెలియకుండానే ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మ్యాన్ హోల్ లో పడిన బస్సు
-
షాకింగ్ వీడియో : నాలాలో పడిపోయిన మహిళలు
-
షాకింగ్ వీడియో : నాలాలో పడిపోయిన మహిళలు
అప్పటి వరకు పేవ్‌మెంట్‌పై సరదాగా సంభాషిస్తూ నడుచుకుంటూ వెళ్లిన ఇద్దరు మహిళలకు ఊహించని పరిణామం ఎదురైంది. నాలా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇద్దరూ అందులో పడిపోయారు. ఈ ఘటన టర్కీలోని దియార్బీకిర్ సిటీలో చోటుచేసుకుంది. ప్రమదానికి గురైన మహిళల్లో ఒకరు డాక్టర్ కాగా మరొకరు నర్సుగా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వీరిద్దరిని స్థానిక ప్రజలు ఆసుపత్రిలో చేర్చారు. కాగా ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయింది. టర్కీ భద్రతా విభాగం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనలో మహిళలు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడటం విశేషం. -
సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్
బీజింగ్ : సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. దర్జాగా రోడ్డుపై రోల్స్ రాయ్స్ కారులో వెళుతూ అనూహ్యంగా ప్రమాదంలో పడిన ఓ చైనా వ్యక్తికి సంబంధించిన సంఘటనే ఆ వీడియోలోని సారాంశం. వివరాల్లోకి వెళితే.. చైనాలోని హెయిలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో హార్బిన్ అనే పట్టణంలో ఓ వ్యక్తి రోల్స్ రాయల్స్ కారులో వెళుతూ ఓ ట్రాఫిక్ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆగిపోయారు. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ పడగానే ముందుకెళదామని కారు స్టార్ట్ చేసి కదిలించారు.. కానీ అనూహ్యంగా అతని కారు ఓ ఆరడుగుల లోతుకు కుంగిపోయింది. నడి రోడ్డుపై పెద్ద సింకోల్(రోడ్డు కుంగిపోవడం) ఏర్పడి పెద్ద గొయ్యి ఏర్పడి అందులో పడిపోయింది. దాంతో ఒక్కసారిగా అతడికి గుండె ఆగినంత పనైంది. వెంటనే కారు పై సీటు వరకు వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని బయటపడ్డారు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియోను నెటిజన్లు తెగ చూస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి మరీ..! -
సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్
-
ట్రాఫిక్ అధికారి ముందే పసిగట్టాడు..హీరో అయ్యాడు
అది నాలుగు కూడళ్ల రోడ్డు. సరిగ్గా నాలుగు నిమిషాల ముందు వాహనాలు రాకపోకలతో రద్దీగా ఉన్న ప్రాంతం. వాహనాలను నియంత్రిస్తూ విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారి రోడ్డుపై అటూ ఇటూగా నడుస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నాడు. ఎంతో ఒత్తిడితో చేసే పని అయినా, బిజీగా తన పనిలో ఉన్నా కూడా నాలుగు కూడళ్ల వద్ద రోడ్డు బీటలు రావడాన్ని ఆ అధికారి గమనించాడు. వెంటనే రోడ్డు పై అటూ ఇటూగా నడిచి ఎంత మేర వరకు ప్రమాదకరమో గుర్తించి ఆ ప్రాంతంలోకి వాహనాలు రాకుండా చుట్టూ మూసివేశాడు. సరిగ్గా కొద్ది నిమిషాల్లోనే ఆ అధికారి గుర్తించిన ప్రాంతం మొత్తం కుంగిపోయింది. ఈ సంఘటన జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హోంగ్జూలో చోటుచేసుకుంది. ఈ వీడియో అక్కడే ఉన్న సీసీకెమరాకు చిక్కింది. ప్రమాదాన్ని గుర్తించడం కొద్దిగా ఆలస్యమైతే పెను ప్రమాదం సంభవించిఉండేదని, సదరు అధికారిని ప్రపంచ మీడియాతో పాటూ, వీడియో చూసిన వారంతా రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
సింక్ హోల్లో పడిపోయిన దంపతులు
సియోల్: బస్సు స్టాప్‌లో బస్సు ఆగింది. తాము దిగే స్టాప్ వచ్చిందని భర్త దిగాడు. అతడి వెంటనే అడుగులో అడుగు వేసుకుంటూ భార్య కూడా దిగింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పాదచారుల మార్గంలో నడుస్తుండగా... ఆ మార్గం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ దంపతులు ఇద్దరు ఒక్కసారిగా భూమిలోకి చోచ్చుకుని పడిపోయారు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్రేన్ల సహాయంతో భార్యాభర్తలను బయటకు తీశారు. అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన దక్షిణ కోరియా రాజధాని సియోల్ నగరంలో చోటు చేసుకుంది. ఇదంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. పాదచారుల మార్గంలో డోల్లా ఎలా ఏర్పడిందనే అంశంపై విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.