జెరుసలేం: ఓ ఇంట్లో నిర్వహించిన పార్టీ విషాదాంతంగా మారింది. ఆనందంగా గడుపుతున్న బంధువులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతుండగా ఒక్కసారిగా మధ్యలో సింక్‌హోల్ ఏర్పడింది. పూల్‌లోని నీరు వేగంగా సింక్‌హోల్‌లోకి వెళ్లగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా భయంతో వెనక్కి వెళ్లాడు. బాధితుడు సుమారు 43 అడుగుల లోతైన గుంతలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిని సింక్‌హోల్ లాక్కెళుతున్న షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ఇజ్రాయెల్‌లోని కర్మీ యోసెఫ్ నగరంలో గురువారం జరిగింది.
సింక్‌హోల్ తెరుచుకున్న ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుడు 30 ఏళ్ల కిమ్హీగా పోలీసులు గుర్తించారు. అతడిని కాపాడేందుకు యత్నించిన 34 ఏళ్ల వ్యక్తికి స్వల్పగాయాలైనట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో మొత్తం ఆరుగురు ఉన్నారు. అయితే.. మిగిలిన వారు ప్రమాదాన్ని గుర్తించటం వల్ల ఎలాంటి హాని జరగలేదు.
“One man has been injured and another is missing after a sinkhole opened up in a inground pool at a home in central Israel.
— natureismetal (@NIMactual) July 21, 2022
The incident occurred during a pool party." pic.twitter.com/S9cByAFebx
నిర్లక్ష‍్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఆ విల్లా యజమానులైన ఆరవై ఏళ్ల దంపతులను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఐదురోజుల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. వృద్ధ దంపతులు తమ ఇంట్లో గురువారం పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సుమారు 50 మంది వరకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆరుగురు స్విమ‍్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ సరదాగా గడిపారు. అయితే.. ఒక్కసారిగా పూల్ మధ్యలో భారీ గొయ్యి ఏర్పడటం వల్ల వారు గమనించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే స్విమ్మింగ్ పూల్ నిర్మించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: డ్రైవర్ తప్పిదం.. వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు 24 మంది విద్యార్థులు..
Comments
Please login to add a commentAdd a comment