Swimming Pool Died
-
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
మంచిర్యాలక్రైం/నస్పూర్: తమ ఇద్దరు కుమారులకు ఈతనేర్పించేందుకు స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లిన ఆ తండ్రి అదే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఊపిరాడక కొడుకుల కళ్లెదుటే మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నస్పూర్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల మేరకు గద్దెరాగడికి చెందిన పంజాల సతీష్‌గౌడ్ (41) మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బ్లూకోర్ట్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా తన ఇద్దరు కుమారులతో కలిసి సీసీసీలోని సింగరేణి స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్తున్నాడు. ఆదివారం స్విమ్మింగ్ చేస్తుండగా అధిక రక్తపోటుకు గురికావడంతో నీటిలో మునిగిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి స్విమ్మర్లు, సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు యశ్వంత్(12) వేయాన్(10) ఉన్నారు. స్పప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నివాళులర్పించిన డీసీపీ అశోక్ కుమార్ కానిస్టేబుల్ సతీష్ మృతిని జిల్లా పోలీస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం రాత్రి తమతో కలిసి బ్లూకోర్ట్ పెట్రోలింగ్ విధుల్లో ఉత్సాహంగా పాల్గొన్న సతీష్ మృతి చెందిన వార్త తెలియగానే డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాశ్, ఎస్సైలు, సీఐలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కొత్తగా ఇంటిని నిర్మించుకున్న సతీష్ ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కూడా చేశాడు. కొత్త ఇంట్లోకి ప్రవేశించి ఏడాది కూడా పూర్తికాకముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతూ కానిస్టేబుల్ మృతి నివాళులర్పించిన డీసీపీ అశోక్‌కుమార్ -
స్విమ్మింగ్ పూల్‌లో దూకి యువకుడు మృతి.. కారణమిదే..
సాక్షి, సికింద్రాబాద్: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ క్లబ్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో విషాదం నెలకొంది. స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి సంపత్ అనే యువకుడు మృతిచెందాడు. వివరాల ప్రకారం.. సంపత్ అనే యువకుడు గురువారం స్విమ్మింగ్ చేసేందుకు తెలంగాణ క్లబ్‌లోని స్విమ్మింగ్ పూల్‌కు వచ్చాడు. ఈ క్రమంలో సంపత్ మద్యం సేవించి ఉండటంతో యాజమాన్యం స్విమ్మింగ్‌కు అనుమతించలేదు. అయినప్పటికీ సంపత్ వారి మాటలు పట్టించుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లో డై కొట్టడంతో వెంటనే మునిగిపోయి చనిపోయాడు. ఇది కూడా చదవండి: సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్! -
షాకింగ్ వీడియో.. వ్యక్తిని లాగేసిన స్విమ్మింగ్‌పూల్ సింక్‌హోల్!
జెరుసలేం: ఓ ఇంట్లో నిర్వహించిన పార్టీ విషాదాంతంగా మారింది. ఆనందంగా గడుపుతున్న బంధువులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతుండగా ఒక్కసారిగా మధ్యలో సింక్‌హోల్ ఏర్పడింది. పూల్‌లోని నీరు వేగంగా సింక్‌హోల్‌లోకి వెళ్లగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా భయంతో వెనక్కి వెళ్లాడు. బాధితుడు సుమారు 43 అడుగుల లోతైన గుంతలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిని సింక్‌హోల్ లాక్కెళుతున్న షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ఇజ్రాయెల్‌లోని కర్మీ యోసెఫ్ నగరంలో గురువారం జరిగింది. సింక్‌హోల్ తెరుచుకున్న ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుడు 30 ఏళ్ల కిమ్హీగా పోలీసులు గుర్తించారు. అతడిని కాపాడేందుకు యత్నించిన 34 ఏళ్ల వ్యక్తికి స్వల్పగాయాలైనట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో మొత్తం ఆరుగురు ఉన్నారు. అయితే.. మిగిలిన వారు ప్రమాదాన్ని గుర్తించటం వల్ల ఎలాంటి హాని జరగలేదు. “One man has been injured and another is missing after a sinkhole opened up in a inground pool at a home in central Israel. The incident occurred during a pool party." pic.twitter.com/S9cByAFebx — natureismetal (@NIMactual) July 21, 2022 నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఆ విల్లా యజమానులైన ఆరవై ఏళ్ల దంపతులను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఐదురోజుల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. వృద్ధ దంపతులు తమ ఇంట్లో గురువారం పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సుమారు 50 మంది వరకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆరుగురు స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ సరదాగా గడిపారు. అయితే.. ఒక్కసారిగా పూల్ మధ్యలో భారీ గొయ్యి ఏర్పడటం వల్ల వారు గమనించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే స్విమ్మింగ్ పూల్ నిర్మించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: డ్రైవర్ తప్పిదం.. వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు 24 మంది విద్యార్థులు.. -
రాజేంద్రనగర్‌లో విషాదం!
-
స్విమ్మింగ్ పూల్‌లో యంగ్ క్రికెటర్ దుర్మరణం
సాక్షి, కోలంబో: శ్రీలంక టూర్‌కి వెళ్లిన ఓ యువ క్రికెటర్ స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. పమునుగమలోని ఓ స్టార్ హోటల్ లో ఘటన చోటుచేసుకుంది. శ్రీలంకలో నిర్వహిస్తున్న అండర్ 17 టోర్నమెంట్ లో భాగంగా గుజరాత్‌కు చెందిన 12 ఏళ్ల కుర్రాడు 19 మంది టీమ్ సభ్యులతోపాటు విల్లా పామా హోటల్లో బసచేశాడు. మంగళవారం సాయంత్రం స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు. ఆ సమయంలో అక్కడే మరో నలుగురు ఆటగాళ్లు ఉన్నప్పటికీ వాళ్లు ఏం కాపాడే ధైర్యం చేయలేకపోయారని సమాచారం. ఆపై అతన్ని హోటల్ సిబ్బంది సహకారంతో బయటికి తీసి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.