స్విమ్మింగ్‌ పూల్‌లో దూకి యువకుడు మృతి.. కారణమిదే.. | Man Died After Jumping Into Swimming Pool At Secunderabad | Sakshi
Sakshi News home page

Secunderabad: స్విమ్మింగ్‌ పూల్‌లో దూకి యువకుడు మృతి.. కారణమిదే..

Published Thu, Jun 8 2023 5:02 PM | Last Updated on Thu, Jun 8 2023 5:13 PM

Man Died After Jumping Into Swimming Pool At Secunderabad - Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ క్లబ్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో విషాదం నెలకొంది. స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి సంపత్‌ అనే యువకుడు మృతిచెందాడు. 

వివరాల ప్రకారం.. సంపత్‌ అనే యువకుడు గురువారం స్విమ్మింగ్‌ చేసేందుకు తెలంగాణ క్లబ్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌కు వచ్చాడు. ఈ క్రమంలో సంపత్‌ మద్యం సేవించి ఉండటంతో యాజమాన్యం స్విమ్మింగ్‌కు అనుమతించలేదు. అయినప్పటికీ సంపత్‌ వారి మాటలు పట్టించుకోకుండా స్విమ్మింగ్‌ పూల్‌లో డై కొట్టడంతో వెంటనే మునిగిపోయి చనిపోయాడు. 

ఇది కూడా చదవండి: సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ యాక్సిడెంట్‌!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement