private party
-
అమెరికా అభ్యర్థన రాలేదు
సాక్షి, న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కేంద్ర ప్రభు త్వం మొదటిసారిగా అధికారికంగా స్పందించింది. ఇది కేవలం ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు, అమెరికా న్యాయవిభాగాలకు సంబంధించిన న్యాయ పరమై న వ్యవహారమని పేర్కొంది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాకు ఈ విషయం తెలిపారు. అదానీకి నోటీసు/ అరెస్ట్ వారెంట్‌పై అమెరికా నుంచి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థన కూడా రాలేదన్నారు. అదానీపై కేసు నమోదుపై ముందుగా అమెరికా భారత ప్రభుత్వా నికి ఎటువంటి సమా చారం ఇవ్వలేదని కూడా స్పష్టం చేశారు. ఈ కేసులో సహకరించాలంటూ అమెరికా ప్రభుత్వం నుంచి ఎటువంటి విజ్ఞాపనా అందలేదని, దీనిపై రెండు ప్రభుత్వాల స్థాయిలో ఏ చర్చా జరగలేదని కూడా జైశ్వాల్ తెలిపా రు. ప్రస్తుతానికి ఈ అంశంతో భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన వివరించారు. అదానీ అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్న వేళ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. -
డ్రగ్స్ టెస్ట్.. ఫిన్లాండ్ ప్రధానికి భారీ ఊరట
హెల్సెంకీ: ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్(36)కు భారీ ఊరట కలిగింది. స్నేహితులతో పార్టీ చేసుకున్న ఆమె.. డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తన నిజాయితీ నిరూపించుకునేందుకు ఆమె డ్రగ్స్ టెస్ట్‌లకు సిద్ధమయ్యారు. ఆగస్టు 19న ఆమె నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించారు అధికారులు. అయితే డ్రగ్స్ టెస్టుల్లో ఆమె ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని తేలిందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మద్యం మాత్రం సేవించినట్లు స్వయంగా మారిన్ ఇదివరకే వెల్లడించడం తెలిసిందే. Finland’s Prime Minister @MarinSanna is in the headlines after a video of her partying was leaked today. She has previously been criticized for attending too many music festivals & spending too much on partying instead of ruling. The critics say it’s not fitting for a PM. pic.twitter.com/FbOhdTeEGw — Visegrád 24 (@visegrad24) August 17, 2022 ఇదిలా ఉంటే.. స్నేహితులతో కలిసి సరదాగా పార్టీ చేసుకున్న ఆమె వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. దీంతో ఆ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారనే అనుమానాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్టులకు ముందుకు రావాలని ఆమెను డిమాండ్ చేశాయి. 2019లో 34 ఏళ్ల వయసులో సన్నా మారిన్ ఫిన్లాండ్కు ప్రధానిగా ఎన్నికయ్యారు. గతంలోనూ అధికారిక భవనంలో పార్టీలు చేసుకుని ఆమె విమర్శలపాలయ్యారు కూడా. ఇదీ చదవండి: ఎట్టకేలకు.. శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక -
షాకింగ్ వీడియో.. వ్యక్తిని లాగేసిన స్విమ్మింగ్‌పూల్ సింక్‌హోల్!
జెరుసలేం: ఓ ఇంట్లో నిర్వహించిన పార్టీ విషాదాంతంగా మారింది. ఆనందంగా గడుపుతున్న బంధువులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతుండగా ఒక్కసారిగా మధ్యలో సింక్‌హోల్ ఏర్పడింది. పూల్‌లోని నీరు వేగంగా సింక్‌హోల్‌లోకి వెళ్లగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా భయంతో వెనక్కి వెళ్లాడు. బాధితుడు సుమారు 43 అడుగుల లోతైన గుంతలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిని సింక్‌హోల్ లాక్కెళుతున్న షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ఇజ్రాయెల్‌లోని కర్మీ యోసెఫ్ నగరంలో గురువారం జరిగింది. సింక్‌హోల్ తెరుచుకున్న ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుడు 30 ఏళ్ల కిమ్హీగా పోలీసులు గుర్తించారు. అతడిని కాపాడేందుకు యత్నించిన 34 ఏళ్ల వ్యక్తికి స్వల్పగాయాలైనట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో మొత్తం ఆరుగురు ఉన్నారు. అయితే.. మిగిలిన వారు ప్రమాదాన్ని గుర్తించటం వల్ల ఎలాంటి హాని జరగలేదు. “One man has been injured and another is missing after a sinkhole opened up in a inground pool at a home in central Israel. The incident occurred during a pool party." pic.twitter.com/S9cByAFebx — natureismetal (@NIMactual) July 21, 2022 నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఆ విల్లా యజమానులైన ఆరవై ఏళ్ల దంపతులను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఐదురోజుల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. వృద్ధ దంపతులు తమ ఇంట్లో గురువారం పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సుమారు 50 మంది వరకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆరుగురు స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ సరదాగా గడిపారు. అయితే.. ఒక్కసారిగా పూల్ మధ్యలో భారీ గొయ్యి ఏర్పడటం వల్ల వారు గమనించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే స్విమ్మింగ్ పూల్ నిర్మించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: డ్రైవర్ తప్పిదం.. వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు 24 మంది విద్యార్థులు.. -
డేటింగ్‌కు ఫుల్స్టాప్!
బాలీవుడ్లో ఎవరు ఎందుకు కలుస్తారో... విడిపోతారో అర్థం కాదు. చాలా కాలంగా ఒకరికి ఒకరుగా తిరిగిన వర్ధమాన తారలు శ్రద్ధాకపూర్, ఆదిత్యారాయ్ కపూర్లు ఉన్నట్టుండి విడిపోయారు. ఇప్పటి వరకూ ఇరువురూ తమ రిలేషన్ గురించి పబ్లిక్‌లో ఎక్కడా చెప్పకపోయినా... అర్ధరాత్రుళ్లు కలసి తిరగుతూ, ప్రైవేటు పార్టీలకు అటెండవుతూ కనిపించారు. అయితే కొంత కాలంగా ఇద్దరి మధ్యా పొసగడం లేదనేది ఇండస్ట్రీ టాక్. ఇలాంటి పరిస్థితుల్లో కలిసుండి కొట్టుకోవడం కన్నా... విడిపోయి ‘గుడ్ ఫ్రెండ్స్’గా మిగిలిపోవడమే మంచిదని భావించినట్టు సమాచారం. ఇదిలావుంటే... ఎవరికి వారు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కెరీర్‌పై కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతోనే దూరంగా ఉంటున్నారన్నది మరో కథనం. -
ఫోన్లో మాట్లాడితే బాయ్‌ఫ్రెండేనా?
సెలబ్రిటీలు బయటికొస్తే... లక్షల కళ్లు వాళ్లనే గమనిస్తుంటాయి. వాళ్లు ఆనందంతో ఉన్నా, బాధతో ఉన్నా ఆ కళ్లు ఇట్టే పట్టేస్తుంటాయి. అందుకే... ఎన్ని బాధలున్నా... మనసులోనే దాచుకొని, లేని నవ్వును మొహాన పులుముకుని బయటకు కనిపిస్తుంటారు కథానాయికలు. అలా కనిపించినా... వాళ్ల మానసిక పరిస్థితికి తగ్గట్టుగా కథనాలు మాత్రం యథాప్రకారంగా వచ్చేస్తుంటాయి. మరి మీడియానా మజాకా. ఇటీవల ప్రియాంక చోప్రా విషయంలో అదే జరిగింది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ప్రైవేటు పార్టీకి హాజరయ్యారు ప్రియాంక. అయితే... ఆ పార్టీలోకి ఎంటరైనప్పట్నుంచీ ఆమె చాలా సీరియస్‌గా కనిపించారు. ప్రియాంకలో పార్టీ మూడ్ ఏ మాత్రం లేకపోవడం అక్కడ చర్చనీయాంశమైంది. కొత్త బాయ్‌ఫ్రెండ్ సాహిల్ ష్రాఫ్‌తో మాట పట్టింపులొచ్చి ఉంటాయని, ప్రియాంక సీరియస్‌గా ఉండటానికి కారణం అదేనని అక్కడికక్కడే ఎవరికి తోచినట్లు వారు కథలు అల్లేసుకున్నారు. ఇంతలో ప్రియాంక ఫోన్ రింగయ్యింది. అంతే... ఈ ముద్దుగుమ్మ పార్టీలో మాయమై పోయింది. ప్రియాంక ఎక్కడికెళ్లిందబ్బా.. అని అందరూ వెతుకుతుండగా.. ఈ అందాలభామ వాయిస్ బాత్రూమ్లో వినిపించిందట. ఫోన్ రాగానే బాత్రూమ్లోకి వెళ్లి డోర్ బిగించి మరీ... సీరియస్‌గా మాట్లాడుతున్నారట ప్రియాంక. ఇంకేముంది.. వారి అనుమానాలకు కొండంత బలం రానేవచ్చింది. ఇక పార్టీ మొత్తం సందడే సందడి. ఆ వార్త అలా అలా మీడియా చెవిన కూడా పడింది. ఇక వాళ్లెందుకు ఊరుకుంటారు.. ప్రియాంక పార్టీలో సీరియస్‌గా ఉండటం, ఫోన్ రాగానే.. బాత్రూమ్లోకి వెళ్లి సీరియస్‌గా సంభాషించడం... ఇదంతా ఓ కామెడీ స్టోరీగా డూప్ కేరక్టర్లతో ప్రసారం చేశారట. దాంతో ప్రియంకకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీయాల్సిన అవసరం ఎందుకొచ్చింది. నేనేం పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటున్నారా? ఫోన్లో మాట్లాడితే... బాయ్‌ఫ్రెండేనా’’ అని పార్టీకి వచ్చిన కొంతమందికి ఫోన్ చేసి మరీ.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారట ప్రియాంక. ఇంట్లోవాళ్లతో, స్నేహితులతో మాట్లాడేటప్పుడు బాత్రూమ్లోకెళ్లి మాట్లాడటం దేనికి? అంటూ బాలీవుడ్లో పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.