అమెరికా అభ్యర్థన రాలేదు | Legal matter involving private firms and US justice department | Sakshi
Sakshi News home page

అమెరికా అభ్యర్థన రాలేదు

Published Sat, Nov 30 2024 5:41 AM | Last Updated on Sat, Nov 30 2024 5:41 AM

Legal matter involving private firms and US justice department

అదానీ అరెస్ట్‌ వారెంట్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కేంద్ర ప్రభు త్వం మొదటిసారిగా అధికారికంగా స్పందించింది. ఇది కేవలం ప్రైవేట్‌ కంపెనీలు, వ్యక్తులు, అమెరికా న్యాయవిభాగాలకు సంబంధించిన న్యాయ పరమై న వ్యవహారమని పేర్కొంది.  విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ శుక్రవారం మీడియాకు ఈ విషయం తెలిపారు. 

అదానీకి నోటీసు/ అరెస్ట్‌ వారెంట్‌పై అమెరికా నుంచి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థన కూడా రాలేదన్నారు. అదానీపై కేసు నమోదుపై ముందుగా అమెరికా భారత ప్రభుత్వా నికి ఎటువంటి సమా చారం ఇవ్వలేదని కూడా స్పష్టం చేశారు. ఈ కేసులో సహకరించాలంటూ అమెరికా ప్రభుత్వం నుంచి ఎటువంటి విజ్ఞాపనా అందలేదని, దీనిపై రెండు ప్రభుత్వాల స్థాయిలో ఏ చర్చా జరగలేదని కూడా జైశ్వాల్‌ తెలిపా రు. ప్రస్తుతానికి ఈ అంశంతో భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన వివరించారు.  అదానీ అంశంపై పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడుతున్న వేళ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement