పిట్స్‌బర్గ్ : మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే అలాంటి ఊహించని ఘటనలు జరిగినప్పుడు జాగ్రత్తగా బయటపడడమే తప్ప మనమేం చేయలేం. తాజాగా అమెరికాలోని పిట్స్‌బర్గ్ సిటీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పిట్స్‌బర్గ్‌లో కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో అక్కడి రోడ్లలో తరచూ గుంతలు ఏర్పడుతున్నాయి. సోమవారం కూడా ఉదయం పూట రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పిట్స్‌బర్గ్ జంక‌్షన్ వద్దకు రాగానే రెడ్ సిగ్నల్ పడడంతో ఒక బస్సు వచ్చి ఆగింది.
గ్రీన్ సిగ్నల్ పడగానే బస్సును ముందుకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా భూమి కుంగిపోయి దాదాపు పది అడుగుల మేర భారీ గుంత ఏర్పడింది. దాదాపు సగం బస్సు ఆ గుంతలో కూరుకుపోయింది. అయితే ఆ సమయంలో బస్సు డ్రైవర్‌తో పాటు కేవలం ఒక పాసింజర్ మాత్రమే ఉండడంతో వారిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, ప్యాసింజర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే బస్సు వెనకే వచ్చిన ఒక కారు ముందుబాగం కూడా ఆ గుంతలో కూరుకుపోయింది.వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గుంతలో పడిన బస్సును ప్రొక్లెయినర్‌తో బయటికి తీశారు. అందుకే మనకు తెలియకుండానే ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment