![Rolls-Royce Plunges Into Sinkhole](/styles/webp/s3/article_images/2017/10/3/rolls-royce-.jpg.webp?itok=fjkMb-xr)
బీజింగ్ : సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. దర్జాగా రోడ్డుపై రోల్స్ రాయ్స్ కారులో వెళుతూ అనూహ్యంగా ప్రమాదంలో పడిన ఓ చైనా వ్యక్తికి సంబంధించిన సంఘటనే ఆ వీడియోలోని సారాంశం. వివరాల్లోకి వెళితే.. చైనాలోని హెయిలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో హార్బిన్ అనే పట్టణంలో ఓ వ్యక్తి రోల్స్ రాయల్స్ కారులో వెళుతూ ఓ ట్రాఫిక్ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆగిపోయారు.
ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ పడగానే ముందుకెళదామని కారు స్టార్ట్ చేసి కదిలించారు.. కానీ అనూహ్యంగా అతని కారు ఓ ఆరడుగుల లోతుకు కుంగిపోయింది. నడి రోడ్డుపై పెద్ద సింకోల్(రోడ్డు కుంగిపోవడం) ఏర్పడి పెద్ద గొయ్యి ఏర్పడి అందులో పడిపోయింది. దాంతో ఒక్కసారిగా అతడికి గుండె ఆగినంత పనైంది. వెంటనే కారు పై సీటు వరకు వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని బయటపడ్డారు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియోను నెటిజన్లు తెగ చూస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి మరీ..!
Comments
Please login to add a commentAdd a comment