Chile Mysterious Sinkhole Could Be Human Made Says Officials - Sakshi
Sakshi News home page

వీడియో: ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి.. వీడిన మిస్టరీ.. ఎలా ఏర్పడిందంటే..

Published Wed, Aug 17 2022 1:48 PM | Last Updated on Mon, Aug 22 2022 1:35 PM

Chile mysterious sinkhole could be human made Says Officials - Sakshi

శాంటియాగో: భారీగా, ఎంతలా అంటే ఊళ్లకు ఊళ్లనే మింగేసేంతగా ఆ గొయ్యి.. అంతకంతకు పెరుగుతూ చిలీ దేశాన్ని.. అక్కడి నుంచి ప్రపంచాన్నే వణికించింది. ఏదో వినాశనం తప్పదంటూ ప్రచారమూ ఊపందుకుంది. ఈ ఊదరగొట్టుడు హెడ్‌లైన్స్‌ వెనుక అతిశయోక్తి మాత్రమే ఉందని చెబుతూ.. అసలు విషయాన్ని వెల్లడించారు అధికారులు.

చిలీ రాజధాని శాంటియాగోకు 800 కిలోమీటర్ల దూరంలోని, అటకామా రీజియన్‌లో టియెర్రా అమరిల్లా దగ్గర ఈ నెల మొదట్లో ఈ భారీ గుంత ఏర్పడి.. క్రమక్రమంగా పెరుగుకుంటూ పోతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. వెడల్పు అంతకు అంతకు పెరుగుతూ.. సుమారు 200 మీటర్ల లోతైన ఈ గుంత.. మన శాట్చ్యూ ఆఫ్‌ యూనిటీ విగ్రహాన్ని(198 మీటర్లు) మింగేసేంత సామర్థ్యం ఉంటుందన్న మాట.

అయితే.. ప్రాథమిక దర్యాప్తులో ఈ భారీ గొయ్యి ఎలా ఏర్పడిందన్న దానిపై ఎలాంటి అంచనాకు రాలేకపోయారు అక్కడి అధికారులు.. ఇప్పుడు ఆ మిస్టరీని దాదాపుగా చేధించారు. మానవ కార్యకలాపాల వల్లే ఆ భారీ గొయ్యి ఏర్పడిందని నిర్ధారణకు వచ్చేశారు. ఆ ప్రాంతంలో భారీ మైనింగ్‌ కార్యకలాపాల వల్ల ఆ గుంత ఏర్పడి ఉంటుందని అంచనాకి వచ్చి.. దానిని పూడ్చేసే ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నారు. Tierra Amarilla.. ప్రపంచంలోనే ఎక్కువగా కాపర్‌ను ఉత్పత్తి చేసే హబ్‌. కెనడాకు చెందిన ఓ కంపెనీ కార్యకలాపాల వల్లే ఈ భారీ గొయ్యి ఏర్పడి ఉంటుందని ఒక అంచనాకి వచ్చారు అక్కడి అధికారులు.

ఈ విషయంపై మైనింగ్‌ మినిస్టర్‌ మార్సెలా హెర్నాండో స్పందిస్తూ.. మితిమీరిన మైనింగ్‌ కార్యకలాపాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ భారీ గొయ్యి ఏర్పడిన సమీప ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement