వామ్మో.. ఇది ఇంటిని మింగేసేలా ఉందిగా | Giant Sinkhole Mexico Farm Swallows Family Home Viral | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఇది ఇంటిని మింగేసేలా ఉందిగా

Published Fri, Jun 11 2021 9:59 PM | Last Updated on Fri, Jun 11 2021 11:03 PM

Giant Sinkhole Mexico Farm Swallows Family Home Viral - Sakshi

కొన్ని చోట్ల ఆకస్మాత్తుగా భూమి కుంగిపోవ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. దీనినే సింక్‌ హోల్‌ అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఏకంగా ఓ పుట్‌ బాల్‌ గ్రౌండంతా భూమి కుంగిపోయింది. ఎక్కడంటే?  మెక్సికోలోని శాంటా మారియా జాకాటెపెక్‌లోని ఓ పొలంలో భూమి ఉన్న‌ట్లుండి కుంగిపోయింది. ప్రస్తుతం ఆ సింక్ హోల్ అక్కడే ఉన్న ఇంటిని త్వరలోనే మింగేసేంతలా కనపడుతోంది. సింక్‌ హోల్‌ ఏర్పడిన మొద‌ట్లో ఆ ఇంటికి చాలా దూరంలో ఇది ఏర్ప‌డినా.. త‌ర్వాత మెల్ల‌గా పెరుగుతూ ఇంటి వ‌ర‌కూ వ‌చ్చేసింది.

కాగా సింక్‌హోల్‌ చుట్టుపక్కల ఉన్న పొలంలో కుక్కలు నాలుగు రోజుల క్రితం పడిపోయాయి. వాటిని కాపాడాలని జంతుప్రేమికలు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలాంటి సింక్ హోల్ నుంచి ఆ కుక్కలను ర‌క్షించ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అధికారులు తెలిపారు. ఇది సుమారు 125 మీటర్లు, 45 మీటర్ల లోతు ఉండవచ్చని అధికారలు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ చుట్టు పక్కల 600 మీటర్ల వరకు ప్రజలను అనుమతించకూడదని మెక్సికన్ ప్రభుత్వం తెలిపింది. మ‌ట్టి వ‌దులుగా ఉన్న ప్రాంతాల్లో భూమి ఇలా ఉన్న‌ట్టుండి కుంగిపోతుంది.

చదవండి: వైరల్‌: అమెరికా అధ్యక్షుడికి భార్య కౌంటర్‌.. దెబ్బకు సైలంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement