షాకింగ్‌ వీడియో : నాలాలో పడిపోయిన మహిళలు | Shocking Video Sinkhole Swallowing Two Women In Turkey | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో : కుప్పకూలిన నాలా

Published Fri, Oct 26 2018 11:36 AM | Last Updated on Fri, Oct 26 2018 12:12 PM

Shocking Video Sinkhole Swallowing Two Women In Turkey - Sakshi

అప్పటి వరకు పేవ్‌మెంట్‌పై సరదాగా సంభాషిస్తూ నడుచుకుంటూ వెళ్లిన ఇద్దరు మహిళలకు ఊహించని పరిణామం ఎదురైంది. నాలా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇద్దరూ అందులో పడిపోయారు. ఈ ఘటన టర్కీలోని దియార్బీకిర్‌ సిటీలో చోటుచేసుకుంది. ప్రమదానికి గురైన మహిళల్లో ఒకరు డాక్టర్‌ కాగా మరొకరు నర్సుగా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వీరిద్దరిని స్థానిక ప్రజలు ఆసుపత్రిలో చేర్చారు.

కాగా ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయింది. టర్కీ భద్రతా విభాగం ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనలో మహిళలు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement