ఇస్తాన్‌బుల్: టర్కీ, సిరియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ భయానక విపత్తులో 5,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 24 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
టర్కీలో భూకంపం తర్వాత దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, శిథిలాలను చూస్తుంటే గుండె తరుక్కుపోయేలా ఉంది. భూకంపం తర్వాత టర్కీ హతాయ్ ప్రాంతంలో పరిస్థితిని కళ్లగట్టేలా ఓ హుమానిటేరియన్ రిలీఫ్ ఫౌండేషన్ డ్రోన్ దృశ్యాలను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
A drone video released by Humanitarian Relief Foundation shows the extent of destruction in Hatay province in Turkey, which was rocked by a 7.8 magnitude earthquake pic.twitter.com/L6mbqIkJZp
— Reuters Asia (@ReutersAsia) February 7, 2023
చదవండి: భూకంపం వస్తుందని మూడు రోజుల ముందే చెప్పాడు.. కానీ ఎవరూ నమ్మలే
Comments
Please login to add a commentAdd a comment