motor bikes
-
ప్రపంచంలో అత్యంత ఖరీదైన బైకులు ఇవే (ఫోటోలు)
-
అకస్మాత్తుగా కుంగిన రోడ్డు..ఒక్కసారిగా కుక్క, రెండు బైక్‌లు..
ఇటీవలకాలంలో పలు మెట్రో నగరాల్లో రోడ్లు అకస్మాత్తుగా కుంగిన ఘటనలను ఎన్నోచూశాం. భారీ వర్షాల కారణంగా నీళ్లు నిలిచిపోవడంతో ఇలాంటి ఘటనలు ఎదువ్వడం చూశాం. కానీ ఉన్నట్టుండి..అదికూడా ఒక ఇరుకు సందు రోడ్డు కుంగిపోవడం అందర్నీ షాక్ గురి చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న ఓ కుక్క, రెండు బైక్‌లో ఆ గుంతలో పడిపోయాయి. జస్ట్ అప్పుడే అటగా వచ్చిన ఒక వాహనదారుడు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ఇరుకైన రోడ్డు సందులో రెండు బైక్‌ల మధ్య ఒక కుక్క కూర్చొని కనిపిస్తోంది. అంతే అకస్మాత్తుగా రోడ్డు కూలినట్లు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఏం జరిగిందో అనుకుంటూ..కొంతమంది రాగా, ఇంతలో మరోభాగం కూడా కూలిపోతుంది. ఫిబ్రవరి 22న ఢిల్లీలోని ఆర్కే పురం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసకుంది. ఐతే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అలాగే ఆ రోడ్డును మరమత్తు చేసినట్లు కూడా తెలిపారు. #WATCH | A road collapsed in Delhi’s RK Puram area on February 22. A dog and a bike fell inside a hole formed after a narrow passage of the road collapsed. No fatalities were reported: Delhi Police (CCTV visuals verified by Police) pic.twitter.com/EbK2Q6no0P — ANI (@ANI) February 25, 2023 (చదవండి: భారత్ గగనతలంపై స్పై బెలూనా? అదీకూడా అమెరికా కంటే..) -
ఈ కంపెనీ బైక్ ధరలు మరింత ప్రియం..!
ప్రముఖ రేసింగ్ బైక్‌ల తయారీదారు కవాసకీ పలు ఏంపిక చేయబడిన బైక్‌ల ధరలను గణనీయంగా పెంచనుంది. 2021 ఆగష్టు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఎంపిక చేయబడిన పలు బైక్‌ల కొత్త ధరలను కవాసకి ఇండియా ప్రకటించింది. ఎంట్రీ లెవల్ బైక్‌ల ధరల్లో కవాసకి ఏలాంటి మార్పు చేయలేదు. మిడిల్‌వెయిట్, లీటర్-క్లాస్ బైక్‌ల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. మోడల్‌ను బట్టి 6000 నుంచి రూ.15,000 వరకు కవాసాకి బైక్ ధరలు పెరిగాయి. ఈ త్రైమాసికంలో ధరలను పెంచిన మొదటి ప్రీమియం బైక్ తయారీదారుగా కవాసాకి నిలిచింది. పలు కవాసకి బైక్‌ల నూతన ధరలు మోడల్ ప్రస్తుత ధర ఆగస్టు 1 నుంచి కొత్త ధర వ్యత్యాసం కవాసకి నింజా 650 రూ.6.54లక్షలు రూ. 6.61 లక్షలు రూ. 7000 కవాసకి జెడ్ 650 రూ.6.18లక్షలు రూ. 6.24 లక్షలు రూ. 6000 కవాసకి వెర్సిస్ 650 రూ.7.08 లక్షలు రూ. 7.15 లక్షలు రూ. 7,000 కవాసకి వల్కాన్ ఎస్ రూ. 6.04 లక్షలు రూ. 6.10 లక్షలు రూ. 6,000 కవాసకి డబ్య్లూ800 రూ. 7.19 లక్షలు రూ. 7.26 లక్షలు రూ.7,000 కవాసకి జెడ్900 రూ. 8.34 లక్షలు రూ. 8.42 లక్షలు రూ. 8,000 కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్ రూ. 11.29 లక్షలు రూ. 11.40 లక్షలు రూ. 11,000 కవాసకి నింజా జెడ్ఎక్స్ -10 ఆర్ రూ. 14.99 లక్షలు రూ. 15.14 లక్షలు రూ. 15,000 కవాసకి వెర్సిస్ 1000 రూ. 11.44 లక్షలు రూ. 11.55 లక్షలు రూ.11,000 -
సైకిల్ కథ
ఇప్పుడంటే నానా రకాల మోటర్ బైకులు రయ్‌మంటూ రోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి గానీ, దాదాపు రెండు శతాబ్దాల కిందట మనుషులు ఇలాంటి వాహనాలు అందుబాటులోకి రాగలవని ఊహించనైనా ఊహించలేదు. మోటర్ ఇంజిన్‌కు ముందే అప్పట్లో తక్కువ శ్రమతో మనుషులు నడప గలిగే తేలికపాటి వాహనాన్ని తయారు చేయడానికి యూరోప్‌లో కొంతమంది ప్రయత్నాలు చేశారు. అలాంటి ప్రయత్నాల్లోంచి పుట్టిందే సైకిల్. పంతొమ్మిదో శతాబ్ది ప్రారంభంలో తొలిసారిగా తయారు చేసిన సైకిల్‌కు కలప ఫ్రేమ్‌ను ఉపయోగించారు. దానికి ముందు చక్రం పెద్దగా, వెనుక చక్రం చిన్నగా ఉండేది. తొక్కడానికి ముందు చక్రానికి పెడల్స్ ఉండేవి. వాహనం తేలికగానే ఉన్నా, దీన్ని నడపాలంటే సర్కస్ ఫీట్లు చేసినంత కష్టపడాల్సి వచ్చేది. తర్వాతి కాలంలో చైన్, బాల్ బేరింగుల ఏర్పాటుతో తేలికగా తొక్కగలిగే సైకిల్ రూపొందింది. ఆధునిక సైకిల్‌కు మాతృక అయిన ఈ సైకిల్‌ను బ్రిటిష్ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త జాన్ కెంప్ స్టార్లే 1885లో రూపొందించారు. ఈ సైకిల్‌కు బ్రేకులు పెట్టారు. దీనిని రోవర్ సేఫ్టీ బైసికిల్ అనేవారు. ఇవి పాశ్చాత్య దేశాల్లో విరివిగా కనిపించేవి. తొలినాళ్లలో పోలీసులు, పోస్ట్మన్లు కూడా వీటి మీదే ఆధార పడేవారు. ఖరీదు తక్కువ కావడంతో మోటరు సైకిళ్లు అందుబాటు లోకి వచ్చిన తర్వాత కూడా సామాన్యుల వాహనంగా చలామణీ అయ్యేవి. కాలంతో పాటు సైకిళ్లలోనూ మార్పులు వచ్చాయి. వీధుల్లోనే కాదు... కొండలు, గుట్టలపైనా తొక్కగలిగే సైకిళ్లు వచ్చాయి. బ్యాటరీతో నడిచే సైకిళ్లూ వచ్చాయి. అయితే, నగరాల్లో ట్రాఫిక్ పుణ్యమా అని ఇప్పుడు సైకిళ్లు బహు అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. -
'చేతికేమీ చిక్కలేదని, బైక్స్ తగులపెట్టాడు'
-
'చేతికేమీ చిక్కలేదని, బైక్స్ తగులపెట్టాడు'
హైదరాబాద్ : హైదరాబాద్ మీర్పేట్లో శ్రీను అనే దొంగ ఈరోజు అర్థరాత్రి హల్చల్ చేశాడు. అన్నపూర్ణ కాలనీలో మూడు ఇళ్లల్లో చోరీకి యత్నించి విఫలం అయ్యాడు. చేతికి ఏమీ చిక్కలేదని తిక్కరేగిందేమో ఎదురుగా కనిపించిన రెండు మోటార్ బైక్స్‌ను తగులబెట్టాడు. మంటల ధాటికి అక్కడే ఉన్న ఒక కారు కూడా కాస్త దెబ్బతింది. పొగ వాసనకు బయటకు వచ్చిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడే అనుమానంగా తిరుగుతున్న శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు.