ప్రముఖ రేసింగ్ బైక్ల తయారీదారు కవాసకీ పలు ఏంపిక చేయబడిన బైక్ల ధరలను గణనీయంగా పెంచనుంది. 2021 ఆగష్టు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఎంపిక చేయబడిన పలు బైక్‌ల కొత్త ధరలను కవాసకి ఇండియా ప్రకటించింది. ఎంట్రీ లెవల్ బైక్ల ధరల్లో కవాసకి ఏలాంటి మార్పు చేయలేదు. మిడిల్‌వెయిట్, లీటర్-క్లాస్ బైక్‌ల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. మోడల్‌ను బట్టి 6000 నుంచి రూ.15,000 వరకు కవాసాకి బైక్ ధరలు పెరిగాయి. ఈ త్రైమాసికంలో ధరలను పెంచిన మొదటి ప్రీమియం బైక్ తయారీదారుగా కవాసాకి నిలిచింది.
మోడల్ | ప్రస్తుత ధర | ఆగస్టు 1 నుంచి కొత్త ధర | వ్యత్యాసం |
కవాసకి నింజా 650 | రూ.6.54లక్షలు | రూ. 6.61 లక్షలు | రూ. 7000 |
కవాసకి జెడ్ 650 | రూ.6.18లక్షలు | రూ. 6.24 లక్షలు | రూ. 6000 |
కవాసకి వెర్సిస్ 650 | రూ.7.08 లక్షలు | రూ. 7.15 లక్షలు | రూ. 7,000 |
కవాసకి వల్కాన్ ఎస్ | రూ. 6.04 లక్షలు | రూ. 6.10 లక్షలు | రూ. 6,000 |
కవాసకి డబ్య్లూ800 | రూ. 7.19 లక్షలు | రూ. 7.26 లక్షలు | రూ.7,000 |
కవాసకి జెడ్900 | రూ. 8.34 లక్షలు | రూ. 8.42 లక్షలు | రూ. 8,000 |
కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్ | రూ. 11.29 లక్షలు | రూ. 11.40 లక్షలు | రూ. 11,000 |
కవాసకి నింజా జెడ్‌ఎక్స్ -10 ఆర్ | రూ. 14.99 లక్షలు | రూ. 15.14 లక్షలు | రూ. 15,000 |
కవాసకి వెర్సిస్ 1000 | రూ. 11.44 లక్షలు | రూ. 11.55 లక్షలు | రూ.11,000 |
Comments
Please login to add a commentAdd a comment