భువనేశ్వర్: ఒడిశాలోని గజపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భారీ వర్షాల నుంచి తప్పించుకునేందుకు బరఘరా గ్రామానికి చెందిన కొందరు ఓ గుహలోకి వెళ్లగా, ఒక్కసారిగా అది కుంగిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద నలిగిపోయి 12 మంది చనిపోయినట్లు భావిస్తున్నామని సహాయక చర్యల ప్రత్యేక కమిషనర్ బీసీ సేథి తెలిపారు. మరో నలుగురి జాడ తెలియడంలేదు. సహాయక చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తు నిర్వహణ ప్రతిస్పందన బృందాన్ని(ఎన్డీఆర్‌ఎఫ్) పంపామన్నారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. మార్గమంతా చెట్లు కూలిపోయాయి. మరోవైపు తిత్లీ విధ్వంసంపై సమీక్ష నిర్వహించిన ఒడిశా సీఎం పట్నాయక్.. గంజాం, గజపతి, రాయగఢ్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పునరావాస శిబిరాల్లో 1.27 లక్షల మంది తలదాచుకుంటున్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న తిత్లీ తుపాను పేరును కొందరు తమ పిల్లలకు పెట్టారు. తుపాను తీరం దాటేముందు, దాటిన తర్వాత పుట్టిన పిల్లలకు తిత్లీ (హిందీలో సీతాకోకచిలుక అని అర్థం) అని పేరు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment