బీజింగ్ : కొన్ని ఘటనలు అప్పుడప్పుడు మనను ఆశ్చర్చానికి గురి చేస్తాయి. ఏడేళ్ల బాలుడు సరదాగాఈత కొడదామని వచ్చి గుహలో చిక్కకున్న ఘటన చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ యోంగ్జియా కౌంటీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. యోంగ్జియో ప్రాంతానికి చెందిన ఒక బాలుడు తన తాత లావో ఈ తో కలిసి బీచ్‌లో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఇద్దరూ ఈత కొడుతుండగా బాలుడు మిస్ అయ్యాడు. చుట్టుపక్కల గాలించినా ఆచూకి లేదు. దీంతో తాత చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి బాలుడి మిస్సింగ్ గురించి చెప్పారు. దీంతో వారంతా వచ్చి బీచ్‌లో బాబుని వెతకసాగారు. ఇంతలో ఒక రంధ్రంలో బాలుడి చేయి కనిపించింది. కాపాడండి అంటూ అరుపులు వినిపిస్తున్నాయి. చేయి పట్టేంత రంధ్రంలోకి అతను ఎలా పట్టాడు అని అక్కడి వాళ్లెవరికీ అర్థం కాలేదు.
నదీతీరంలో ఈ రంధ్రం ఎలా వచ్చిందని ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. నదీ తీరంలో ఉన్న నేల సాధారణమైనది కాదు. అది గుహ పై భాగం. ఈ గుహకు వెళ్లాలంటే నది నుంచి మార్గం ఉంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. బాలుడు ఈత కొడుతున్నప్పుడు సుడిలో ఇరుక్కుపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో అతడిని గుహలోకి నెట్టేసింది. చీకటిగా ఉండడంతో బాలుడు భయంతో గజగజా వణికి పోయాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందివ్వగా వచ్చి బాలుడిని ప్రాణాలతో రక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment