ఆదిమానవులు ఉనికి ఉందని ఎప్పటి నుంచే చెబుతూనే ఉన్నారు చరిత్రకారులు. అందుకు చారిత్రక ఆధారాలు ఏమిటి అనేదాని గురించి పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రాచీన యుగంలో క్రీస్తూ పూరం 1300 ఏళ్ల క్రితం అని అంచనాలు వేసి చెప్పేరే గానీ అందుకు కచ్చితమైన ఆధారాలు లేకపోయాయి. తవ్వకాల్లో వారి ఉనికి ఉందని చెప్పే పనిమూట్లు, వారికి సంబంధించిన మానవ ఎముకల ఆధారంగా చెప్పడం జరిగింది. దీని గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న శాస్రతవేత్తల కృషి ఇప్పటికీ ఫలించింది. మానువులు ఎప్పటి నుంచి ఉన్నారు. ఆ తర్వాత నిష్క్రమించి ఎటు వెళ్లారనే వాటి గురించి వెలుగులోకి వచ్చిన ఆధారాలను చూసి పరిశోధకులే కంగుతిన్నారు.
అసలేం జరిగిందంటే..గ్రీస్‌లోని థెస్సాలీలోని మధ్య గ్రీకు ప్రాంతంలో థియోపెట్రా అనే గుహ వద్ద పురావస్తు శాఖ ఎన్నో ఏళ్లుగా తవ్వకాల్లో జరిపింది. ఆ తవ్వకాల్లో ఆ గుహ మానవజాతి మూలాలను గూర్చి వెల్లడించింది. ఆ తవ్వకాల్లో అనేక మనుషుల ఎముకలు, వారు ఉపయోగించిన రాతి పనిముట్లు, జంతువుల ఎముకలు, పూరాత మానవ నిర్మిత నిర్మాణాలను కనుగొన్నారు. 13 వేల ఏళ్ల క్రితం నుంచే మానువులు ఉన్నారని రేడియో కార్బన్ ఆధారాలు చెబతున్నాయి. వారిలో నియాండర్తల్‌లు అనే మానవ జాతి ఉనికిలో ఉన్న నాటి మానవ జాతుల్లో ఒకటని చెప్పారు.
వారు బలిష్టంగా కండలు తిరిగి ఉండేవారని, విచిత్రంమైన కనుబొమ్మలు, పొడుచుకుని వచ్చినట్లు ముక్కులు కలిగి ఉండేవారని తెలిపారు. ఈ నియాండర్తల్‌లు మానవులు జీవించే విధానం కంటే భిన్నంగా జీవితాన్ని గడిపేవారని అన్నారు. కొన్ని రకాల అడవి జంతువులను వేటాడేవారని, తమను తాము రక్షించుకునేందుకు కఠినమైన గుహ వాతావరణంలో జీవించేవారని అన్నారు. ఐరోపా అంతటా ఉన్న గుహల్లో ఉండేవారని పరిశోధనలో వెల్లడించారు. అంతేగాదు థియో పెట్రా గుహ మానవ నిర్మిత ప్రదేశంలో ఇదే ఒకటిగా పేర్కొన్నారు. ఇక్కడ నుంచి మానవులు సుమారు 50 వేల ఏళ్ల క్రితం నుంచి నిష్క్రమించారని తెలిపారు.
1987 నుంచి తప్పకాలు..
ఈ గుహ ఒక లోయ పైన సుమారు వంద మీటర్లు(330 అడుగులు) వరకు విస్తరించి ఉందని చెప్పారు. దీన్ని థియోపెట్రా రాక్ అని పిలేచే వారని, ఇక్కడ సున్నపురాయి కొండ ఈశాన్యవాలు చూడవచ్చని చెప్పారు. ఈ గుహకు సమీపంలో పినయోస్ నదికి చెందిన లెథాయోస్ నది ప్రవహిస్తుంది. ఇక పురావస్తు శాఖ అధికారులు 1987 నుంచి ఈ గుహ వద్ద తవ్వకాలు జరపడం ప్రారంభించారు. అలా 2007వరకు కొనసాగింది.
ఈ మధ్య కాలంలో అనేక విశేషమైన ఆవిష్కరణలు జరిగాయి. పురావస్తు పరిశోధన మొదట ప్రారంభించినప్పుడూ థియోపెట్రా గుహా స్థానిక గొర్రెల కాపరులు తమ జంతువులును ఉంచడానికి తాత్కాలిక ఆశ్రయంగా ఉపయోగించేవారని భావించారు. కానీ ఈ గుహ తవ్వేకొద్ది ఆధ్యాంతం కొంగొత్త విషయాలను వెల్లడించింది. ఇందులో బయటపడ్డ అవక్షేపాలన్నీ ఆసక్తికలిగించే సరికొత్త విషయాలను తెలియజేశాయి.
( చదవండి: అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..)
Comments
Please login to add a commentAdd a comment