World Kindness Day 2024 : హృదయాన్ని కదిలించే వీడియోలు! | World Kindness Day 2024 : history and significance and viral videos | Sakshi
Sakshi News home page

World Kindness Day 2024 : హృదయాన్ని కదిలించే వీడియోలు!

Published Wed, Nov 13 2024 4:35 PM | Last Updated on Wed, Nov 13 2024 7:04 PM

World Kindness Day 2024 : history and significance and viral videos

ప్రపంచ దయ దినోత్సవాన్ని  (World Kindness Day  ) ఏటా నవంబర్ 13న జరుపుకుంటారు. వ్యక్తులుగా ఒకరిపట్ల ఒకరు, తమ పట్ల , వారి చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల దయ చూపేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. మానవులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ, తోటివారితోపాటు  ఈ ప్రకృతి, జంతువుల పట్ల ప్రేమతో, దయతో కృతజ్ఞతగా  ఉండడంలోని ప్రాధాన్యతను గుర్తించే రోజు ప్రపంచ దయ దినోత్సవం.   చుట్టూ ఉన్న సమాజం పట్ల దయతో  ఉండటం  మనుషులుగా మనందరి ప్రాథమిక లక్షణం,

ప్రపంచ దయ దినోత్సవం: చరిత్ర
వరల్డ్ కైండ్‌నెస్ డేని 1998లో వరల్డ్ కైండ్‌నెస్ మూవ్‌మెంట్  ప్రారంభించింది.  సామరస్య ప్రపంచాన్ని సృష్టించడంలో దయ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం లక్ష్యం. 1997లో జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగిన మొదటి ప్రపంచ దయ ఉద్యమ సదస్సు తర్వాత ప్రపంచ దయ ఉద్యమం ఏర్పడింది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement