kindness
-
మంచి మాట: కృతజ్ఞత గొప్ప సంస్కారం
‘కృతజ్ఞత ’ అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచి పోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, మనకు ఏదో ఒక సహాయం అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే వారు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత అనేది మానవ సంస్కారం. ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమానమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం. ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా కాకుండా, మన ఉనికికి, ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి, విధివశాత్తూ కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే –అతని పట్ల సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతజ్ఞత ఎలా ఔతుంది. మేలు చేసిన సమస్త జీవుల పట్ల కృతజ్ఞత, మేలు చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మనుషులకే కాదు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, పాములు, తేళ్ళు.. ఇలా అన్నింటికి మేలు కలగాలనే భావన ఉండాలి. శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా సరే అందరి మేలును కాంక్షించి కృతజ్ఞత, దయ కలిగి ఉండాలి. ప్రాణులన్నింటికి దుఃఖాలు బాధలు సహజం. కనుక వాటి దుఃఖాన్ని తొలగించటానికి, సుఖాన్ని కలిగించటానికి, అవసర సమయాలలో మేలుచేయటానికి ప్రయత్నించాలి. అయితే ఇలా సమస్త జీవుల పట్ల దయ కలగాలన్నా కష్టమే. మనకు మేలు చేసిన వారిపై అనురాగం కృతజ్ఞత ఉంటాయి. కనుక తిరిగి వారికి మేలు చేయాలనిపిస్తుంది. కాని మనకు కీడు చేసిన వారైతేనో వారికి కూడా మేలు చేయాలనుకుంటామా.. అనుకోలేము. కాని వారియందు కూడా కృతజ్ఞతాభావం, మేలుచేయాలనే గుణం కలిగి ఉండాలన్నది శాస్త్ర ప్రమాణమని పెద్దలు చెబుతున్నారు. ఇది వినటానికి బాగానే ఉంది. కాని ఆచరణకు వచ్చేటప్పటికి ఈ నీతి సూత్రాలన్నీ గుర్తుకు రావు. అయితే ఎవరికి సమబుద్ధి ఉంటుందో, అందరిని ఒకేవిధంగా, ఆత్మస్వరూపులుగా, ఒక్కటిగా చూడగలుగుతారో వారే అపకారులకు కూడా ఉపకారంచేస్తూ కృతజ్ఞత చూపగలుగుతారు. మేలు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఇలా జీవులకు చేసే హితం, సేవ పరమాత్మకు చేసినట్లే. ఎందుకంటే సమస్త జీవులయందు పరమాత్మే ఉన్నాడు గనుక. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ, చూపే కృతజ్ఞత వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఇస్తుంది. అందువలన మనం అత్యాశను వదిలిపెట్టి సంతృప్తిని, కృతజ్ఞతను అలవరచుకోవటానికి ప్రయత్నించాలి. సంతృప్తితో జీవించేవారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకోవటం సహజం. దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే అతను తన ఆశకు పరిమితులని ఏర్పరచుకోవాలి. అన్నీ ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలనుకోవడం వలన అతనికి అనందం లభించదు. సంతృప్తి ప్రతి వ్యక్తికీ తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే ఎంత ఉన్నా మనిషికి ఆనందం ఉండదు. కోరికలను పెరగనిస్తూ పోతే ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఒక వ్యక్తికి చాలవు. అందువలన అత్యాశకు అవకాశం ఇవ్వకూడదు. తనకు దక్కిన దానితో సంతోషపడటం ప్రతివ్యక్తి నేర్చుకోవాలి. అత్యాశ లేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. అరణ్యాలలో నివసించిన ఋషులు చాలా సంతోషంగా జీవించారు. అక్కడ భౌతిక సంపదలు లేవు. అయితే వారికీ సంతృప్తి అనే సంపద ఉన్నది. అది వారికి ఆనందాన్ని ఇచ్చింది. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంతృప్తి అవసరం. మన కోరికలను తగ్గించుకోవటం మీద మన సంతృప్తి ఆధారపడి ఉంటుంది. – భువనగిరి కిషన్ యోగి -
Harsh Goenka: కైండ్‌నెస్‌కి కొత్త అర్థం చెప్పిన బిజినెస్‌మ్యాన్
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయోంకా తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. వీల్‌చైర్‌లో ఉన్న అమ్మాయి వర్షంలో తడవకుండా ఓ అబ్బాయి గొడుకు పట్టుకున్న ఫోటోను హర్ష్ గోయెంకా షేర్ చేశారు. దానికి క్యాప్షన్‌గా కైండ్‌నెస్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ చెప్పారు. హర్ష్ చేసిన ఈ ట్వీట్ గంటల్లోనే వైరల్‌గా మారింది. అనేక మంది నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. మరికొందరు తమకు ఎదురైన ఘటనలు ట్వీట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ బిజినెస్‌మ్యాన్ చేసిన ట్వీట్ మరోసారి మనుషుల్లోని మానవత్వాన్ని తట్టి లేపింది. Random acts of kindness never go in vain. What goes around comes around. pic.twitter.com/bEllwllWI5 — Talkative Dollar 🇮🇳 (@Talkativedollar) December 13, 2021 Kindness is the beauty that never fades.👌 — Romulus Iglesìas (@tu_sharcastic) December 13, 2021 చదవండి:900 మంది ఉద్యోగుల తొలగింపుపై హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు -
Kindness Day: దయ చుట్టంబౌ.. నేడు ప్రపంచ దయాగుణ దినోత్సవం
దేవుడు భక్తుణ్ణి అడిగాడట– ‘నేను నీ ఇంటికొస్తే నాకు అన్నమెందుకు పెట్టలేదు’ అని. ‘నువ్వెప్పుడొచ్చావు తండ్రీ’ అన్నాడట భక్తుడు. ‘ఒకరోజు నీ ఇంటి ముందు ఒక దీనుడు క్షుద్బాధతో అన్నం అడిగాడు. అతడికి నీవు పెట్టి ఉంటే అతడిలో నేను కనపడేవాణ్ణి’ అన్నాడట దేవుడు. దయను మించిన అంటు లక్షణం మరొకటి లేదు. మనం ఒకరితో దయగా ఉంటే ఆ ఒకరు మరొకరితో దయగా ఉంటారు. సాహసం, వీరత్వం కంటే దయ కలిగినవాడే గొప్పవాడు. ఇంట్లో, ఆఫీసుల్లో, సంఘంలో దయ లోపించడం వల్లే ఇవాళ సమస్యలు పెరిగిపోయాయి. దయ చూపేవారికి సాటి మనిషి తోడు నిలుస్తాడు. దయే నేడు కావలసిన చుట్టం. వెతకవలసిన దైవం. దేవుడు మనుషుల పట్ల ఎంతో దయగా ఉన్నాడు. లేకుంటే ఉష్ణం గక్కే పగలు నుంచి సాంత్వనం కోసం రాత్రిని ఇచ్చేవాడా? క్రూరమృగాల కీకారణ్యంలో తీయని ఫలాలను వేళ్లాడగట్టేవాడా? నదులను గీత కొట్టి అంతే పారాలని చెప్పేవాడా? సముద్రానికి చెలియలికట్టలు గీచేవాడా. దేవుడు మనుషులతో ఎంతో దయగా ఉన్నాడు. జబ్బు ఉన్నచోటే మందు ఇచ్చాడు. గాయపడిన చోట మాన్పుకోవడమూ నేర్పాడు. కంటిలో నీరు ఇచ్చి ఆనందబాష్పాలను కూడా చిలకరించాడు. మనిషి? అన్నీ ఫ్రీ. గాలిలోని ఆక్సిజన్ ఫ్రీ. సూర్యుడిలోని డి విటమిన్ ఫ్రీ. మబ్బులోని వాన ఫ్రీ. చంద్రుడిలోని వెన్నెల ఫ్రీ. చెట్ల ఆకుపచ్చదనం ఆకాశంలోని నీలిమ.. అన్నీ ఫ్రీ. ఇన్ని ఫ్రీగా తీసుకుంటూ అతడు బదులుగా ఇవ్వవలసింది చూపవలసింది ఏమిటి? సాటిమనిషి పట్ల కాసింత దయ. కొంచెం కరుణ. గుప్పెడు ఆర్ద్రత. చిటికెడు చెమరింత. ఇంగ్లిష్‌వాడు మానవజాతిని ‘మేన్‌కైండ్’ అన్నాడు. ‘కైండ్’గా ఉండటమే మానవజాతి లక్షణం. మానవీయమైన గుణం కలిగినవాడే మానవుడు. మానవీయగుణం అంటే దయ, కరుణ. ‘ఇంటి దగ్గర ఉండే లేగదూడకు పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నన్ను చంపి తిను’ అన్న గోవు మాట మీద నిలబడి తిరిగి వస్తే క్రూరమృగమైన పులికి దయ కలిగింది. ఆవును వదిలిపెట్టింది. కాని నేటి మనిషి పులి కంటే కఠినంగా మారుతున్నాడా? దయ, జాలి, కరుణ అనే మాటల్నే మరుస్తున్నాడా? ఇలాంటి మనిషిని ప్రకృతి ఇష్టపడుతుందా? ఇల్లు–ఇరుగు పొరుగు ‘పిల్లల పట్ల పెద్దలు దయగా ఉండాలి’ అని అంటారు. పిల్లలకు ఇంటి పని నేర్పించడం వేరు. ఇంటి పని పిల్లల చేత చేయించడం వేరు. బాల కార్మిక వ్యవస్థ బయట శిక్షార్హమైన నేరం. కాని ఇళ్లల్లో సొంత పిల్లలను రకరకాల పనుల్లో పెట్టి వారిని చెప్పుకోలేని బాధకు గురి చేసే తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి పనికీ పిల్లల్ని కేక వేయడానికి వారు పనిమనుషులు కాదు. ఇక వారిని తిట్టడం, కొట్టడం వారిని భవిష్యత్తులో నిర్దాక్షిణ్యులుగా మార్చడమే. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో ఇరుగు పొరుగువారితో దయగా ఉంటే, ‘వాచ్‌మెన్‌కు ఈ టిఫిన్ ఇచ్చిరా’ అని పిల్లల చేత పంపిస్తే, ‘పాపం.. వాళ్ల బండి పంక్చర్ అయ్యిందట.. మన బండి తాళం ఇచ్చిరా’ అని పంపిస్తే... పిల్లలు దయను కూడా నేర్చుకుంటారు. అవును. మంచి గుణాలను నేర్పించాలి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరో చేయి సాచగానే తండ్రి నోటి నుంచి బూతులు, తల్లి మాటల్లో ఈసడింపు కనిపిస్తే పిల్లలు అలాంటి పేదవారి గురించి భవిష్యత్తులో దయగా ఉండే అవకాశం ఉండదు. ఇరుగు పొరుగు పిల్లలతో, క్లాస్‌లోని పిల్లలతో ఎంతో స్నేహంగా, దయగా ఉండాలని పిల్లలకు నేర్పించాలి. పెద్దలు తమ ప్రవర్తనతో చూపాలి. యువతలో ఈ దయాగుణం లోపిస్తున్నదని అమెరికా, ఆస్ట్రేలియా, యు.కెలలో క్లాస్ 12 లోపు పిల్లల కోసం ‘కైండ్‌నెస్ కరిక్యులమ్’ ప్రవేశపెడుతున్నారు. పని చోట మనతో పని చేసే వారితో మనం కఠినంగా ఉండాలి అనుకోవడమే సగం అనారోగ్యం. పని రాబట్టుకోవాలంటే కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమగా ప్రశంసగా కూడా పని జరుగుతుంది చాలాసార్లు. కొలీగ్స్‌ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూడటానికి మించిన నిర్దయ లేదు. వారి నిజమైన సమస్యలకు స్పందించడం, కనీసం వినడం, వారి పని సర్దుబాటులో, సెలవుల అవసరంలో సాయంగా ఉండటం పని చోట చూపాల్సిన కనీస దయ. పని చోట రాజకీయాలు నడిపితే అనారోగ్యం వస్తుందని దయగా ఉంటే మనశ్శాంతితో ఉంటూ శరీరంలో మంచి ఎంజైమ్‌లు ఊరుతూ ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అందరూ పౌరులే ఈ దేశంలో అందరూ సమాన పౌరులే. అందరికీ రాజ్యాంగం శిరోధార్యమే. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలి. అలా జీవించే హక్కు వారికి ఉంది. ప్రాంతాన్ని బట్టి, సామాజిక వర్గాన్ని బట్టి, మతాన్ని బట్టి, భాషను బట్టి, ఆచారాలను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి ఫలానా వారి పట్ల నిర్దయగా ఉండొచ్చు అనుకోవడానికి మించి సంకుచితత్వం లేదు. నువ్వు నిర్దయగా ఉన్నావంటేనే పైచేయి తీసుకుంటున్నట్టు అర్థం. పైచేయి తీసుకోవడం అంటే పీడన చేయడానికి సిద్ధమవడమేనని అర్థం. పీడిస్తే సంఘంలో బాధ ప్రవహిస్తుంది. దయగా ఉంటే సంతోషం, సామరస్యం పెల్లుబుకుతాయి. ఇవాళ ద్వేషం కాదు కావలÜంది దయ. బాగున్న వర్గాలు బాగలేని వర్గాల పట్ల నిర్దయను మానుకుంటే చాలు. వారి హక్కుల్ని వారు సాధించుకుంటారు. గ్రామీణులు ‘ఫలానా అతను దయగల్లోడు’, ‘ఫలానా ఇల్లాలు దయగలది’ అంటుంటారు. ఇవాళ, ఈ రోజున, మనల్ని ఎవరైనా అలా అంటున్నారా లేదా అని ఆత్మశోధన చేసుకోవడమే మనం చేయవలసిన పని. దయగా ఉంటే ఏం పోతుంది. మహా అయితే అందరూ మనతో దయగా ఉంటారు. అంతేగా? -
పునీత్ ఔదార్యాన్ని చూడలేక విధికి కన్నుకుట్టింది
సాక్షి, హైదరాబాద్:కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు పునీత్ ఆకస్మిక మరణంపై టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ట్వీట్ చేస్తున్నారు. దీంతో మిస్ యూ అప్పూ ట్రెండింగ్‌లో ఉంది.(Puneeth Rajkumar: పునీత్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ..వైరల్) బెంగళూరులో విక్రమ్ ఆసుపత్రి వెలుపల వందలాదిగా అభిమానులు హృదయవిదారకంగా రోదించిన దృశ్యాలు ఆయన గొప్పదనానికి అద్దం పట్టాయి. ముఖ్యంగా పునీత్ రాజ్‌కుమార్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఒక్కసారిగా బారికేడ్‌ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారంటే వారి అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది నిజం కాకుండా ఉంటే బావుండు అంటూ కంట తడి పెడుతున్నారు ఈ సందర్భంగా అభిమానులపై పునీత్ పంచిన ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. ఆయనొక జెమ్...ఆయన లేని లోటు తీరదంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఔదార్యానికి, సేవాతత్పరతకు సంబంధించిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. అక్టోబర్ 29 శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. A man with golden heart 💓 45 Free Schools 26 Orphanages 16 Old age homes 19 Goshala lu 1800 Students Education 2 Eyes were Donated Finally 1 Man He is #PuneethRajkumar ❣️🙏 Miss u so much sir 😞#PuneetRajkumar @PuneethRajkumar pic.twitter.com/GT3gFhYUEJ — Gani Thor (@gani_thor) October 29, 2021 45 Free Schools 26 Orphanages 16 Old age homes 19 Goshala lu 1800 Students Education 2 Eyes were Donated Finally 1 Man He is @PuneethRajkumar 💔 Still You are alive in our hearts 😥 pic.twitter.com/DdZ7vc7U6y — TRSsm (@Aditya22526310) October 29, 2021 45 Free Schools 26 Orphanages 16 Old age homes 19 Goshala lu 1800 Students Education 2 Eyes were Donated Finally 1 Man He is #PuneethRajkumar ❣️🙏 pic.twitter.com/QdAv1MncrP — 𝙱𝚑𝚎𝚎𝚜𝚑𝚖𝚊 𝚃𝚊𝚕𝚔𝚜 (@BheeshmaTalks) October 29, 2021 -
జయాజీ... కొంచెం దయ చూపించండి
బాలీవుడ్లో సుశాంత్ సింగ్ మరణం తర్వాత డ్రగ్స్ కలకం మొదలయింది. ఇటీవలే నటుడు, యంపీ రవి కిషన్ ‘డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి. దోషుల్ని పట్టుకొని విచారణ జరపాలి’ అని ఈ విషయం మీద తన అభిప్రాయాన్ని పార్లమెంట్లో వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్‌ను ఉద్దేశిస్తూ సీనియర్ నటి, యంపీ జయాబచ్చన్ మాట్లాడారు. ‘‘కొంతమంది అన్నం పెట్టిన చేతినే కరవాలనుకుంటారు. సినిమా ఇండస్ట్రీకి అండగా ప్రభుత్వం నిలబడాలి. ఎలాంటి విపత్తులు వచ్చినా ఇండస్ట్రీ తన వంతు సహాయం చేసింది. కొందరు చేసే తప్పుల వల్ల మొత్తం ఇండస్ట్రీ తప్పు అనే ఇమేజ్ తీసుకురావడం కరెక్ట్ కాదు’’ అని జయ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు జయ మాట్లాడిన విషయాన్ని కొనియాడారు. కంగనా రనౌత్ మాత్రం జయతో ఏకీభవించలేదు. ‘‘జయాజీ, మీ అమ్మాయి శ్వేతా బచ్చన్ కూడా టీనేజ్‌లో డ్రగ్స్‌కి బానిసయి, లైంగిక వేధింపులకు గురైతే ఇలానే మాట్లాడతారా? మీ అబ్బాయి అభిషేక్ కూడా అదే పనిగా హెరాస్మెంట్ ఎదుర్కొని, ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటే ఇలాంటి స్టాండే తీసుకోగలరా? కొంచెం మా గురించి కూడా ఆలోచించండి. కొంచెం దయ చూపించండి’’ అని జయా బచ్చన్ వీడియోను ఉద్దేశించి ట్వీట్ చేశారు కంగనా. -
దేవుడు ఒకటి తీసుకుంటే మరోటి ఇస్తాడు
‘‘దేవుడు మన దగ్గరి నుంచి విలువైనది ఏదైనా తీసుకున్నాడంటే మనల్ని ఉత్సాహపరచడానికి భారీ మోతాదులో మరోటి ఇస్తాడు’’ అన్నారు దర్శకుడు సెల్వ రాఘవన్. ‘పుదుపేటై్ట, 7/జీ రెయిన్బో కాలనీ (తెలుగులో 7/జీ బృందావన కాలనీ), అయిరత్తిల్ ఒరువన్ (తెలుగులో యుగానికి ఒక్కడు), వెంకటేష్‌తో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాలు తీశారు సెల్వ. ప్రస్తుతం ఓ ఎన్జీవోతో కలసి సోషల్ మీడియాలో ‘కైండ్‌నెస్ చాలెంజ్’లో పాల్గొన్నారాయన. ఈ సవాల్‌కి సై అన్నవాళ్లు ఏం చేయాలంటే.. తమ చిన్ననాటి ఫొటో ఒకటి పోస్ట్ చేసి, ఆ వయసులో ఎదురైన చేదు అనుభవాలకు ఇప్పుడు ధైర్యం చెబుతూ ఓ లేఖ రాయాలి. ఆ వయసులో ఉన్న చిన్ననాటి మనకి ఇప్పుడు మనం ఏదైనా సలహా ఇవ్వాల్సి వస్తే ఏమిస్తాం? అనేది ఆ చాలెంజ్. ఈ చాలెంజ్‌లో పాల్గొన్న సెల్వ తన చిన్ననాటి (14 ఏళ్ల వయసులో దిగినది) ఫొటోను పోస్ట్ చేసి ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘ప్రియమైన సెల్వా (వయసు 14), ప్రపంచం నీ వైకల్యం (సెల్వకి ఒక కన్ను సరిగ్గా ఉండదు) చూసి నవ్వుతోంది. నీ కన్ను సరిగ్గా లేదని, సరిగ్గా చూడలేవని అందరూ నిన్ను విచిత్రంగా చూస్తారు. ప్రతి రాత్రి ఆ విషయాలను, ఆ అవమానాలను తలచుకొని నువ్వు ఏడుస్తూ ఉంటావు. దేవుడా... నన్ను ఎందుకు ఇలా చేశావు? అని ఆయన్ని ప్రశ్నిస్తావు. కానీ జీవితంలో ముందుకు వెళ్లడానికి భయపడకు. అధైర్యపడకు. సరిగ్గా పదేళ్లలో నువ్వో బ్లాక్‌బస్టర్ సినిమా రాసి, డైరెక్ట్ చేయబోతున్నావు. ఆ సినిమా నీ జీవితాన్ని మార్చేస్తుంది. అప్పుడు ఎంతో మంది నీవైపే చూస్తారు. ఈసారి చిన్నచూపో, హేళన భావమో ఆ చూపులో ఉండదు. కేవలం గౌరవం, ఆరాధన ఉంటాయి. ఆ తర్వాత వరుసగా పదేళ్లు నువ్వు తీసే ప్రతి సినిమా క్లాసిక్ అంటారు. ట్రెండ్ సెట్టర్స్ అంటారు. నిన్నో మేధావి అంటారు. అప్పుడు నిన్ను కంటి చూపుతో బాధపడ్డ కుర్రాడిగా ఎవరూ చూడరు. నీ సినిమాలతో వాళ్ల జీవితాల్లో ఏదో మార్పు తీసుకొచ్చిన దర్శకుడిలానే చూస్తారు. అందుకే అబ్బాయ్... భయపడకు. ధైర్యంగా ఉండు. ఫొటోలకు నవ్వుతూ పోజు ఇవ్వు. నువ్వు నవ్వుతున్న ఫొటో ఒక్కటి కూడా లేదు నా దగ్గర. త్వరలోనే నువ్వు చాలా ఫొటోలు దిగాలి. నిన్ను నువ్వు ప్రేమించు’. ఇట్లు.. సెల్వ రాఘవన్ (వయసు 45). ఈ లేఖలో ఇప్పటి 45 ఏళ్ల సెల్వరాఘవన్ అప్పటి 14 ఏళ్ల సెల్వాకి స్ఫూర్తి నింపే మాటలు చెప్పారు. ఈ మాటలు సెల్వాలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నవారికి స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈ చాలెంజ్ ఆశయం అదే. -
అరాచకం, అస్థిరతలపై అసహనం
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దాలన్నీ యువతరానివేనని, వ్యవస్థపై వారికి అపారమైన నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యవస్థలు సరిగా స్పందించకపోతే యువతలో ప్రశ్నించే ధోరణి కనిపిస్తోందని కొనియాడారు. ఆకాశవాణిలో ఆదివారం నాడు ఈ ఏడాది చివరి మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. అరాచకత్వం, అనిశ్చితి పరిస్థితుల్ని నేటి తరం ద్వేషిస్తున్నారని ప్రధాని అన్నారు. కులతత్వం, బంధుప్రీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు. పౌరసత్వ చట్ట సవరణలకు, ప్రతిపాదిత ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఇటీవల యూనివర్సిటీల్లో నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘నాకు తెలిసినంతవరకు నేటి తరం వ్యవస్థలపైనే నమ్మకం ఉంచింది. వాటిని అనుసరించాలనీ భావిస్తోంది. వ్యవస్థలు సరిగా స్పందించనప్పుడు వారిలో అసహనం పెరిగిపోతోంది. ధైర్యంగా ప్రశ్నించే తత్వం కూడా కనబడుతోంది’’అని మోదీ అన్నారు. దేశంలో యువత అరాచకం ఏ రూపంలో ఉన్నా సహించలేరని, పాలనా వైఫల్యాలను, అస్థిరతను తట్టుకోలేకపోతున్నారని అన్నారు. జాతి నిర్మాణంలో పాల్గొనాలి ధైర్యసాహసాలు, ఉత్తేజపూరిత స్వభావం కలిగిన యువతే మార్పుకి బాటలు వేస్తుందని స్వామి వివేకానంద మాటల్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుకు తెచ్చుకున్నారు. జనవరి 12 వివేకానందుడి జయంతిని పురస్కరించుకొని యువత జాతి నిర్మాణంలో తమ వంతు బాధ్యతని తలకెత్తుకోవాలని, దేశ పురోగతికి కావల్సిన ఆలోచనలు చేయా లని పిలుపునిచ్చారు. దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లే సత్తా యువతకే ఉందన్నారు. దేశీయ ఉత్పత్తులకి ప్రాచుర్యం కల్పించాలి వచ్చే రెండు మూడేళ్లు దేశీయ ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2022లో భారత్ 75ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను పూర్తి చేసుక్నుంతవరకు స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని అన్నారు. భారత్‌లో భారతీయుల చేతులతో, వారి స్వేదాన్ని చిందించి తయారు చేసిన ఉత్పత్తుల్ని ఒక రెండేళ్లు వాడేలా యువతే ముందుకు రావాలని అన్నారు. -
స్వర్గానికి ఓ దారి
ముగ్గురు వ్యక్తులు పుష్పక విమానంలో స్వర్గానికి వెళ్తున్నారు. కిందికి చూస్తుంటే వారికి ఎత్తయిన కొండమీద ఒక పాము కప్పను మింగుతున్న దృశ్యం కనిపించింది. వారిలో ఒకడు వెంటనే కప్ప పడుతున్న బాధను చూసి ‘‘సర్పరాజమా! పాపం ఆ కప్పపై నీకు జాలి లేదా? దానిని వదిలి పెట్టు’’ అన్నాడు. ఆ మాటలకు పాముకు కోపం వచ్చింది. ‘‘నా ఆహారం నేను తినడం కూడా తప్పేనా? పైగా దానిని వదిలిపెట్టు అని చెబుతున్నావా? నీవు నరకానికి పో’’ అని శపించింది. అతడు నరకానికి వెళ్లాడు. రెండవ వ్యక్తి అది చూసి విభ్రాంతికి గురయ్యాడు. ఆ తరువాత సర్పాన్ని సమర్థిస్తూ ఇలా అన్నాడు: ‘‘కప్ప నీకు సహజమైన ఆహారం. నీవు దానిని భుజించి నీ ఆకలి తీర్చుకోవడం తప్పేమీ కాదు’’ అన్నాడు. ఆ మాటలకు కప్పకు కోపం వచ్చింది. ‘‘నన్ను భుజించమని సర్పానికి సలహా ఇస్తావా? దయ, జాలీ లేని ఓ బండ మనిషీ! నువ్వు నరకానికి పోతావు’’ అని శపించింది. అతడు కూడా నరకంలో పడ్డాడు. మూడవ వ్యక్తి మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. దాంతో అతను స్వర్గానికి చేరుకున్నాడు. బహుశా ఈ ఇతివృత్తాన్ని బట్టే మింగమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే సామెత ఏర్పడి ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో ఏదో ఒకటి మాట్లాడడం కంటె, మౌనంగా ఉండటమే మేలని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. – డి.వి.ఆర్. -
ఆ పాత్ర నా జీవితాన్ని మార్చేసింది!
నీర్జా బానోత్.. విమాన ఉద్యోగి అయిన ఆమె 23 ఏళ్ల వయస్సులో నిరూపమానమైన ధైర్యసాహసాన్ని చూపింది. ఉగ్రవాదులు హైజాక్ చేసిన విమానంలోని ప్రయాణికులను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టింది. తన పుట్టినరోజుకు కేవలంర రెండురోజుల ముందు ఉగ్రవాదుల కాల్పుల్లో ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె జయంతి సెప్టెంబర్ 7 కావండంతో బాలీవుడ్ నటి సోనం కపూర్.. ఆమెను స్మరించుకుంది. సాటివారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆమె గొప్పతనాన్ని కీర్తిస్తూ ఘనంగా నివాళులర్పించింది. నీర్జా బానోత్ పాత్రను వెండితెరపై అద్భుతంగా పోషించిడం ద్వారా ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలను సోనం కపూర్ పొందిన సంగతి తెలిసిందే. నీర్జా బానోత్ కు నివాళులర్పిస్తూ.. ఆమె తల్లితో దిగిన ఫొటోను సోనం ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ' హ్యాపీ బర్త్ డే నీర్జా. నీ జన్మదినం నాకెంతో ప్రత్యేకమైనది. నువ్వెప్పుడూ చీకట్లో వెలుగుదీపమై నన్ను నడిపిస్తావు. నాకు ఎన్నో విధాలుగా స్ఫూర్తినిచ్చావు. నీ పాత్ర పోషించడంతో నాలో సహనం, దయాగుణాన్ని మరింతగా నింపింది. అన్నింటికన్నా స్వీయ ఉనికి అంటే ఏమిటో తెలిపింది' అని సోనం పేర్కొంది. -
సైకిల్ మెకానిక్.. ఐఏఎస్ అయ్యాడు!
చిన్న వయసులోనే తండ్రి తనువు చాలించడంతో తన చదువును ఆపేసిన ఓ బాలుడు... కష్టాలకు ఎదురీదాడు. పూట గడవని స్థితిలో ఫీజులు కట్టలేక ఎన్నోసార్లు విద్యాభ్యాసానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే విరమించుకున్న ప్రతిసారీ ఏదో ఒకరూపంలో అతడికి ప్రోత్సాహం లభించడంతో పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి చదువును కొనసాగిస్తూ వచ్చాడు. అయితే చిన్నతనంలో డాక్టర్ అయ్యి.. అందరికీ సేవలు అందించాలనుకున్న తన కోర్కెను.. జీవితానుభవాలకు అనుగుణంగా మార్చుకొన్న ఆ బాలుడు.. ప్రజాసేవే లక్ష్యంగా ఐఏఎస్ ఆఫీసర్ అయి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా, బైసర్ పట్టణానికి చెందిన వరుణ్ భరన్వాల్.. చిన్నతనంలో డాక్టర్ అవ్వాలని కలలుగనేవాడు. వరుణ్ తండ్రి సైకిల్ రిపేర్ షాపును నడిపిస్తూ.. వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించేవాడు. వరుణ్ తోపాటు అతడి సోదరికి కూడ మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నదే లక్ష్యంగా పనిచేసేవాడు. కానీ వరుణ్ 2006 సంవత్సరంలో పదోతరగతి పరీక్షలు రాశాడో లేదో తండ్రి ఉన్నట్లుండి గుండెజబ్బుతో మరణించాడు. అప్పటికి సైకిల్ షాపు లాభాల్లోనే కొనసాగుతోంది. కానీ తండ్రి ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక వరుణ్ కుటుంబం అప్పులపాలైపోయింది. సోదరి టీచర్ అయినప్పటికీ ఆమె వేతనం ఇల్లుగడవడానికే చాలీ చాలకుండా ఉండేంది. దాంతో అప్పుల భారం పెరిగిపోయింది. ఇంటి పరిస్థితులను గమనించిన వరుణ్.. చదువుకు స్వస్తి చెప్పేసి, తండ్రి వ్యాపారాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. షాపులో పని ప్రారంభించిన కొన్నాళ్ళకు పదోతరగతి పరీక్షల్లో పట్టణంలోనే రెండో అత్యధిక మార్కులతో పాసయ్యాడు. తోటి స్నేహితులు, టీచర్లు వరుణ్ మార్కులను చూసి ఎంతో సంతోషించడంతోపాటు అతడ్ని పై చదువులకు ప్రోత్సహించారు. దీంతో వ్యాపారాన్ని తల్లికి అప్పగించి వరుణ్ తిరిగి చదువును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఆ పరిస్థితుల్లో కాలేజీ ఫీజు పదివేల రూపాయలు కట్టలేక తిరిగి వ్యాపారాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. అదే సమయంలో వరుణ్ తండ్రికి చికిత్స అందించిన డాక్టర్ కంప్లి.. వరుణ్ అభీష్టాన్ని తెలుసుకొని ఫీజు కట్టేందుకు ముందుకొచ్చాడు. జేబునుంచి పదివేల రూపాయలు తీసివ్వడంతో కాలేజీలో చేరిన వరుణ్.. నెలవారీ ఫీజు కట్టేందుకు చదువుతోపాటు రేయింబగళ్ళు ఖాళీసమయాల్లో ట్యూషన్లు చెప్పేవాడు. వచ్చిన సంపాదనతో ఫీజులు కట్టేవాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత తాను అనుకున్నట్లుగా ఎంబిబిఎస్ చదివేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, ఎంఐటీ కాలేజ్ పూనె లో ఇంజనీరింగ్ లో చేరాడు. మొదటి సంవత్సరం మంచి మార్కులతో పాసై... స్కాలర్ షిప్ తెచ్చుకొని ఇంజనీరింగి పూర్తయ్యే లోపే క్యాంపస్ సెలెక్షన్ లో 2012 లో మల్టీ నేషనల్ కంపెనీ డెలాయిట్ లో ఉద్యోగం సంపాదించాడు. ఇక జీవితం స్థిరపడిపోయినట్లే అనుకునే సమయంలో అతడి జీవితం మరో మలుపు తిరిగింది. అప్పట్లో అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్ కోసం అన్నా హజారే నిర్వహించిన ఉద్యమం వరుణ్ లో స్ఫూర్తిని నింపింది. ప్రజాసేవే పరమావధిగా భావించిన వరుణ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నిశ్చయించుకొని, మిత్రుల సహాయంతో ఆర్నెల్లపాటు యూపీఎస్ సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. అందుకు పుస్తకాలు కొనడానికి కూడ ఎంతో ఇబ్బందులు పడి, చివరికి ఓ ఎన్జీవో సంస్థ సహాయంతో పుస్తకాలు కొని పట్టుదలతో చదివి 2014 యూపీఎస్ సీ పరీక్షల్లో 32వ ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని హిమ్మత్ నగర్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న వరుణ్.. ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. -
ప్రజాసేవలో పులకించిన గ్రామం
లండన్: సోమర్సెట్ కౌంటీలోని కాంగ్రెస్బరి ఓ చిన్న గ్రామం. గ్రామ జనాభా 3,500. అందులో 1215లో నిర్మించిన సెయింట్ ఆండ్రూ చర్చికి 2015 నాటికి 800 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా కలసి ఏడాదిపాటు ఎలాంటి ప్రత్యోపకారం ఆశించకుండా ఇరుగుపొరుగు వారికి, అపరిచితులకు మనస్ఫూర్తిగా 800 రకాల సేవలు అందించాలని తీర్మానించుకున్నారు. వార్షికోత్సవం నాటికి ఎవరు, ఏ రకంగా ఇతరులకు సేవలిందించారో వివరిస్తూ ఓ పోస్ట్ కార్డును చర్చివద్దనున్న ఓ బాక్స్‌లో వేయాలని తమకు తామే నిర్ణయించుకున్నారు. ఏడాది తిరిగే సరికల్లా గ్రామరూపురేకలే మారిపోయాయి. అప్పటివరకు ఒకరికొకరు అపరిచితులుగా బతికినవారి ప్రజల మధ్య కొత్తగా ఆత్మీయ సంబంధాలు ఏర్పడ్డాయి. ఏడాది సేవలో భాగంగా కొందరు ఇరుగుపొరుగు ఇళ్లకు రంగులేశారు. మరికొందరు దెబ్బతిన్న ఇళ్ల ప్రహారి గోడలను పునరుద్ధరించారు. కొందరు పక్కింటి కార్లను శుభ్రంగా కడిగిపెట్టారు. మరి కొందరు ఇళ్ల యజమానులకు తెలియకుండానే వారి నల్లా బిల్లులను, పెంపుడు జంతువుల వెటర్నరీ ఆస్పత్రుల బిల్లులను ఆన్లైన్లో చెల్లించారు. కొందరు పడుకునేందుకు సరైన దుప్పట్లు కూడా లేని వారికి వాటిని పంచిపెట్టారు. పెన్షనర్లకు ఊహించని గిఫ్ట్‌లు కొని పెట్టారు. ఊరికొచ్చిన పొరుగూరి ప్రజలను తమ కార్లలో ఎక్కించుకొని షాపింగ్‌లకు తీసుకెళ్లారు. యువతీ యువకులు వీధులను, పబ్లిక్ పార్కులను శుభ్రం చేశారు. పార్కుల్లోని బెంచీలకు రంగులు వేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రంగులేసి కొత్త శోభను తీసుకొచ్చారు. ‘స్టార్‌వార్స్: ది ఫోర్స్ అవేకన్స్’ టిక్కెట్లు దొరకని వారికి టిక్కెట్టు కొనిపెట్టారు. పిల్లలకు స్వీట్లు పంచారు. ఇలా ఎవరికి తోచిన సేవలను వారందించారు. క్రిస్మస్ నాటికి గ్రామ ప్రజలు పెట్టుకున్న 800 సేవల లక్ష్యం పూర్తయింది. ఇప్పటికి వారి సేవలు 817కు చేరుకున్నాయి. ఈ స్వచ్ఛంద సేవల గురించి తెల్సి అక్కడికెళ్లిన మీడియాతోని ప్రజలు తమ అనుభూతులను, మనోభావాలను పంచుకున్నారు. ‘ఏడాదంతా తమకు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఓ పండుగలాగా గడిచిపోయింది. ఎన్నడూ కనీసం మొఖం మొఖం చూసుకోని వాళ్లం కూడా కుటుంబ సభ్యుల్లా కలసిపోయాం. ఆత్మీయతానురాగాలు ఏర్పడ్డాయి. కొత్త బంధాలు చిగురించాయి. చేసిన సాయం చిన్నదైనా పెద్ద మనస్సుతో స్వీకరించాం, ఆనందాన్ని పంచుకున్నాం. మనుషుల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే పెద్ద సాయమే చేయక్కర్లేదు. తోటీ మనిషి ఎదురైనప్పుడు ఓ చిరునవ్వు చిందించడం, వీలైతే చేతులు కలిపినా చాలన్న సూత్రాన్ని గ్రహించాం. ఇలాంటి సేవలను ఇంతటితో ఆపకూడదని, మున్ముందు కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాం’ అని గ్రామస్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. బ్రిస్టల్ నగరానికి కేవలం 13 మైళ్ల దూరంలోవున్న కాంగ్రెస్బరి గ్రామం ఇప్పుడు బ్రిటన్‌కే ఆదర్శంగా నిలిచింది. -
కైండ్‌నెస్‌తో మ్యాన్‌కైండ్‌ను గెలవొచ్చు!
‘మ్యాన్‌కైండ్’ అనే పదంలోనే ‘కైండ్’ అనే మాట ఉంది. మతం అంటే మానవాళి అందరిపట్లా దయతో ఉండమని అర్థం. జీసస్కు జన్మనిచ్చినందుకు సర్వమానవాళీ మేరీమాతకు తమ తమ సొంత అమ్మలకు ఇచ్చే గౌరవం ఇచ్చింది. అందుకే తెలుగులో ఆమెను మనం సంబోధించినప్పుడల్లా ‘మేరీ మాత’ అంటాం. ఒక్క బిడ్డకు జన్మనివ్వడం ద్వారా ఆమె విశ్వమానవాళికే తల్లి అయ్యింది. అంతేకాదు... దయా దృష్టితో, కరుణతో సేవ చేసే వాళ్లందరినీ తల్లిని పిలిచినట్లే సంబోధిస్తాం. అందుకే మదర్ థెరిసాను తల్లిగా సంబోధించకుండా పిలువలేం. సేవ చేసే ప్రతి మనసులోనూ మాతృహృదయామృతాన్నే చవిచూస్తాం. అందుకే ఏ మతం వారు ఆమె పేరును ఉచ్చరించాలన్నా ‘అమ్మ’ అనే విశేషణం లేకుండా ఆమెను పిలవలేరు. అదే సేవలోని గొప్పదనం. సేవాదృక్పథానికి మతం అనే కృత్రిమమైన ఎల్లలు ఎప్పుడూ అడ్డురావు. - డా॥బొల్లినేని భాస్కర్‌రావు చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, కిమ్స్, సికింద్రాబాద్ -
ఒక్క పేరులో బంధించలేం
కోకొల్లలుగా దేవుళ్లు ఉన్న ఈ ప్రపంచంలో, నిజమైన దేవుడు ఎవరో అర్థం కాక అనేకులు సతమతమౌతూ ఉంటారు. తమ దేవుడే నిజమైన దేవుడని ప్రతి మతస్థుడూ చెబుతాడు. అయితే సనాతన ధర్మం ఏకైక భగవానుని ఆరాధించాలని ప్రబోధిస్తోంది. భగవంతుడొక్కడేనని, ఆయనే పూజనీయుడని, సమస్త ఘనతకు, మహిమకు పాత్రుడనీ ఋగ్వేదం చెబుతోంది. దేవుడొక్కడేనని బ్రహ్మసూత్రం సంకేతపరుస్తోంది. అలాగే బైబిలు, ఖురాన్ గ్రంథాలు కూడా దేవుడొక్కడే అని ప్రవచిస్తున్నాయి. అందుకే సృష్టికర్త, మహాశక్తిమంతుడు, మహోన్నతుడు, సర్వాంతర్యామి; కరుణ, దయ, ప్రేమ కలిగిన ఆ దేవ దేవుణ్ణి మనం ఒక్క పేరులో బంధించలేం. ఎందుకంటే ప్రతి పేరుకూ ఒక అర్థం ఉంటుంది. భగవంతునికున్న భిన్న లక్షణాలన్నీ వివరించడానికి ఈ భూప్రపంచమంత విశాలమైన కాగితం మీద, వృక్షాలన్నిటినీ కలంగా మార్చి, సముద్ర జలాలన్నిటినీ సిరాలా ఉపయోగించి రాసినా పూర్తిగా ఆయన్ని వర్ణించలేమని ఖురాన్ చెబుతోంది. అంచేత సత్యం ఒక్కటే. దేవుడు ఒక్కడే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించిననాడు, మతం పేరిట జరుగుతున్న అనర్థాలు సమసిపోయి, శాంతి స్థాపన జరుగుతుంది. లోకం స్వర్గమయం అవుతుంది. - యస్. విజయభాస్కర్ -
కాలచక్రంపపంచానికి శాంతి చక్రం
సందర్భం దలైలామా నిర్వహించే కాలచక్ర ఉత్సవం ప్రపంచ బౌద్ధ ఉత్సవాలలో ప్రముఖమైనది. టిబెట్ దేశానికి చెందిన ఈ బౌద్ధ సంప్రదాయం ప్రపంచ మానవాళిలో ప్రేమ, దయ, కరుణ, ప్రజ్ఞ, ఉపేక్ష భావాల్ని పెంపొందించి, సర్వ జీవుల్లో సమరస భావాన్ని నింపి, మానవ మనస్సుల్లోని సంకుచితత్వాన్ని పారద్రోలి, శాంతి పరిమళాలు వెదజల్లడం కోసం కృషి చేస్తుంది. ప్రతి మనిషి నిస్వార్థంగా మారడానికి, దుఃఖాన్నుండి విముక్తి కావడానికి కావలసిన మానసిక, శారీరక సాధనల్ని ఈ కాలచక్రం నిర్దేశిస్తుంది. ఈ కాలచక్ర పూజా విధానం మనుషుల మనస్సుల్లో పరిపూర్ణత్వాన్ని నింపుతుందని బౌద్ధుల నమ్మకం. కాలచక్ర అంటే? కాలానికి సంబంధించినదే ఈ కాలచక్ర. మనం సాధారణంగా క్యాలెండరు లేదా పంచాంగాన్ని కాలచక్రం అంటాం. అంటే కాలాన్ని కొలిచే విధానంగా కాలచక్రాన్ని భావిస్తాం. కానీ బౌద్ధుల ఈ ‘కాలచక్ర’ కాలానికి సంబంధించినదే అయినా, అది రోజులకు, వారాలకు, పక్షాలకు, మాసాలకు, రుతువులకు ఆయనాలకు సంబంధించినది మాత్రం కాదు. ఈ సృష్టి రచనకు సంబంధించినది కాలచక్ర - విధానాలు ఈ కాలచక్ర ఒక అద్భుతమైన తత్త్వం. ప్రకృతి, మనిషి వేరువేరు కావని చెప్పే ఒక విశ్వ ఐక్యతావాదం. ఆ విషయం కాలచక్రంలో ప్రధానంగా ఉన్న మూడు విధానాలు తెలియజేస్తాయి. ఇందులో మొదటిది బాహ్య కాలచక్ర. దీన్ని ‘కాలచక్ర భూమి’ అని కూడా అంటారు. విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, సౌరవ్యవస్థ, భూమి, మూలకాలు, మూల రాశులు - ఇలా భౌతిక జగత్తంతా ఈ బాహ్యకాలచక్రలో భాగమే. రెండోది అంతర కాలచక్ర. మనిషి, పుట్టుక, జీవనం, అనుభవాలు, మనస్సు, నాడీ చలనాలు, హృదయ స్పందనలు - ఇలా మనిషీ మనస్సు కలిసినదంతా ఈ విభాగంలోకి వస్తుంది. ఇక మూడోది ప్రత్యామ్నాయ కాలచక్ర. పైన చెప్పిన రెండు రకాల అంతర, బాహ్య కాలచక్రాల్ని ఒకటిగా అనుసంధానం చేసే విధానం ఇది. ఈ అనుసంధానం చేసే పద్ధతి ధ్యాన పద్ధతి. - బొర్రా గోవర్ధన్ టిబెట్‌లో దలైలామాలు, పంచన్లామాలు అక్కడి బౌద్ధ గురువులు. కాలచక్ర పథ మార్గాన్ని నడిపించే గురువులు వాళ్ల్లే. ఒకటవ, రెండవ, ఏడవ, ఎనిమిదవ, పద్నాలుగవ దలైలామాలు ఈ కాలచక్ర కార్యక్రమాల్ని ఎక్కువగా నిర్వహించారు. ప్రస్తుత దలైలామా 14వ దలైలామా. అయన అసలు పేరు ‘టెన్జిన్ గాట్సో’. ఆయన ఇప్పటికి 33 కాలచక్రలు నిర్వహించారు. ప్రస్తుతం జూన్ 3 నుంచి 14వ తేదీవరకు భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతంలో ‘లే’ (లడక్) లో 34వ కాలచక్రను నిర్వహిస్తున్నారు. 2006లో అమరావతిలో నిర్వహించిన కాలచక్ర ముప్పయ్యవది. కాలచక్ర పూజావిధానం కాలచక్ర అనేది భిక్షుదీక్షను ఇచ్చే కార్యక్రమం. దీక్ష నిచ్చే గురువును ‘వజ్రగురువు’ అంటారు. ఆయన ఒక ఉన్నత ఆనసం మీద కూర్చుని కార్యక్రమం నిర్వహిస్తారు. కాలచక్రలో ప్రధానంగా మూడు వలయాలు ఉంటాయి. మొదటి వలయంలో బాహ్యకాలచక్రలో ఉండే నక్షత్రాది గ్రహాలు ఉంటాయి. రెండో వలయంలో అంతర కాలచక్రలో ఉండే శరీర, మనోస్థితులు ఉంటాయి. మూడో వలయంలో బుద్ధి, కాలం ఉంటాయి. అంటే ఆయా వలయాలు ఆయా రాశులకు సంకేతాలుగా ఉంటాయి. ఈ మూడు వలయాల్ని 12 రోజుల్లో దాటుకుంటూ చివరికి చేరాలి. ఈ 12 రోజుల్ని 11 దశలుగా పూర్తి చేయాలి. ఈ దశల్ని అభిషేకాలంటారు. లామా ఈ కాలచక్రను కొన్ని మండలాలుగా విభజిస్తాడు. ఈ మండలాల్ని రంగురంగుల ఇసుకతో నింపుతాడు. కాలచక్ర చిత్రాన్ని గీస్తాడు. ఆ చక్రంలో 720 మంది దేవతల్ని ప్రతిష్ఠిస్తాడు. కోర్కెలకు ప్రతీకగా శ్వేత వర్ణ బొమ్మల్ని కాలచక్ర కాళ్లకింద అణచివేస్తున్నట్లు చిత్రిస్తాడు. ఈ బొమ్మల్లో చక్రం.. పరిణామానికి (పురుషుడు), కాలం.. ప్రజ్ఞ (స్త్రీ) కి ప్రతీకలుగా భావిస్తారు. అయితే కాలచక్ర తంత్రం స్వభావరీత్యా స్త్రీతంత్రం. స్త్రీలు ఆచరించేది కాదు. ఈ తంత్ర స్వభావం అది. అందుకే ఈ తంత్రాన్ని ‘విశ్వమాత’గా పిలుస్తారు. కాలచక్ర అంటే విశ్వమాత అని. చివరి రోజున గుణాలకు ప్రతీకలైన రంగురంగుల ఇసుకను చెరిపివేసి, సైకత ఆలయాన్ని కూల్చేసి, ఆ ఇసుకను, రంగుల్నీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ నది ప్రవహించే కాలానికి ప్రతీక. ఈ పన్నెండు రోజుల కార్యక్రమంలో బోధి చిత్తాన్ని పొందిన భిక్షువులు దుఃఖరహితులై, శాంతి కాముకులై, సర్వజీవశ్రేయస్సు కోసం పాటుపడతారు. ప్రపంచాన్ని శాంతికమలంలా పూయిస్తారు. కాలచక్ర అంటే ప్రపంచశాంతి చక్రమే.