Unknown Facts Kannada Star Puneeth Rajkumar Who Passed Away With Heart Attack - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar:పునీత్‌ ఔదార్యాన్ని చూడలేక విధికి కన్నుకుట్టింది

Published Fri, Oct 29 2021 5:26 PM | Last Updated on Sat, Oct 30 2021 11:04 AM

unknown factkannada star Puneeth rajkumar who passed away with heart attack - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు పునీత్‌ ఆకస్మిక మరణంపై టాలీవుడ్‌, మాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు.  దీంతో మిస్‌ యూ అప్పూ ట్రెండింగ్‌లో ఉంది.(Puneeth Rajkumar: పునీత్‌, అశ్విని రేవంత్‌ లవ్‌ స్టోరీ..వైరల్‌)

బెంగళూరులో విక్రమ్ ఆసుపత్రి వెలుపల వందలాదిగా అభిమానులు హృదయవిదారకంగా రోదించిన దృశ్యాలు ఆయన గొప్పదనానికి అద్దం పట్టాయి. ముఖ్యంగా పునీత్ రాజ్‌కుమార్‌ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఒక్కసారిగా  బారికేడ్‌ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారంటే వారి అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది నిజం కాకుండా ఉంటే బావుండు అంటూ కంట తడి పెడుతున్నారు

ఈ సందర్భంగా అభిమానులపై పునీత్‌ పంచిన ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. ఆయనొక జెమ్‌...ఆయన లేని లోటు తీరదంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఔదార్యానికి, సేవాతత్పరతకు సంబంధించిన ట్వీట్‌ ఒకటి వైరల్‌ అవుతోంది.  అక్టోబర్ 29 శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement