కైండ్‌నెస్‌తో మ్యాన్‌కైండ్‌ను గెలవొచ్చు! | Kindness With Mankind wins allways! | Sakshi
Sakshi News home page

కైండ్‌నెస్‌తో మ్యాన్‌కైండ్‌ను గెలవొచ్చు!

Published Sun, Dec 20 2015 12:12 AM | Last Updated on Tue, Oct 9 2018 4:36 PM

కైండ్‌నెస్‌తో మ్యాన్‌కైండ్‌ను గెలవొచ్చు! - Sakshi

కైండ్‌నెస్‌తో మ్యాన్‌కైండ్‌ను గెలవొచ్చు!

‘మ్యాన్‌కైండ్’ అనే పదంలోనే ‘కైండ్’ అనే మాట ఉంది. మతం అంటే మానవాళి అందరిపట్లా దయతో ఉండమని అర్థం. జీసస్‌కు జన్మనిచ్చినందుకు సర్వమానవాళీ మేరీమాతకు తమ తమ సొంత అమ్మలకు ఇచ్చే గౌరవం ఇచ్చింది. అందుకే తెలుగులో ఆమెను మనం సంబోధించినప్పుడల్లా ‘మేరీ మాత’ అంటాం. ఒక్క బిడ్డకు జన్మనివ్వడం ద్వారా ఆమె విశ్వమానవాళికే తల్లి అయ్యింది. అంతేకాదు... దయా దృష్టితో, కరుణతో సేవ చేసే వాళ్లందరినీ తల్లిని పిలిచినట్లే సంబోధిస్తాం. అందుకే మదర్ థెరిసాను తల్లిగా సంబోధించకుండా పిలువలేం.

సేవ చేసే ప్రతి మనసులోనూ మాతృహృదయామృతాన్నే చవిచూస్తాం. అందుకే ఏ మతం వారు ఆమె పేరును ఉచ్చరించాలన్నా ‘అమ్మ’ అనే విశేషణం లేకుండా ఆమెను పిలవలేరు. అదే సేవలోని గొప్పదనం. సేవాదృక్పథానికి మతం అనే కృత్రిమమైన ఎల్లలు ఎప్పుడూ అడ్డురావు.
- డా॥బొల్లినేని భాస్కర్‌రావు
 చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, కిమ్స్, సికింద్రాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement