జంతు సంక్షేమం. సంరక్షణకు సంబంధించి మహిళల కృషి నిన్నామొన్నటిది కాదు. దీనికి ఎంతో చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా జంతుసంరక్షణకు సంబంధించిన ఉద్యమాలు, సంస్థలలో ఎక్కువగా మహిళలే నాయకత్వ బాధ్యత వహిస్తున్నారు. మన దేశంలో జంతుసంక్షేమ విధానానికి వెన్నెముక అయిన పీసీఏ యాక్ట్‌లో అప్పటి రాజ్యసభ ఎంపీ, ప్రముఖ నృత్యకారిణి రుక్మిణీ ఆరండల్ కీలకపాత్ర పోషించింది.
‘మన దేశంలో జంతువులపై క్రూరత్వాన్ని నిరో«ధించే విషయంలో మహిళా నాయకుల చొరవ, శ్రమ ఎంతో ఉంది. జంతు సంరక్షణ ఉద్యమంలో ఎన్నో వినూత్న విధానాలకు రూపకల్పన చేస్తున్నారు. నా మిత్రురాలు స్వర్ణాలీరాయ్ కోల్‌కతాలో బడులు, కాలేజీలకు వెళుతూ వ్యవసాయ రంగంలో జంతువులను ఎలా చూస్తున్నారు నుంచి జంతు సంక్షేమం వరకు ఎన్నో విషయాల గురించి అవగాహన కలిగిస్తుంది. పంజాబ్ యూనివర్శిటీలో వందలాదిమంది విద్యార్థులకు వ్యవసాయంలో భాగమైన జంతువుల సంక్షేమం గురించి ఎంతో అవగాహన కలిగించింది. ఇలాంటి వారు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు’ అని చెబుతున్నారు అలోక్‌పర్ణ సేన్‌గుప్తా.
అలోక్‌పర్ణసేన్ యానిమల్ రైట్స్ అడ్వకేట్. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్. వీధికుక్కల సంక్షేమం నుంచి వ్యవసాయ రంగంలో జంతు సంరక్షణ వరకు ఎన్నో అంశాలపై పనిచేస్తోంది.
‘రుక్మిణీదేవి కృషి వల్లే పీసీఏ చట్టం, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చాయి. జంతుసంక్షేమానికి సంబంధించిన లక్ష్యాల కోసం మహిళలు అంబాసిడర్‌లుగా పనిచేస్తున్నారు. తాము పనిచేయడమే కాదు ఇతరులకు స్ఫూర్తిని ఇస్తున్నారు. జంతు సంక్షేమ ఉద్యమంలో కూడా ఎంతోమంది మహిళలు పనిచేస్తున్నారు. కొందరు ప్రముఖంగా కనిపించవచ్చు. చాలామంది తెరవెనుక నిశ్శబ్దంగా పనిచేస్తున్నారు’ అంటుంది జంతు సంక్షేమ ఉద్యమకారిణి నజరేత్.
Comments
Please login to add a commentAdd a comment