
ఇలాన్ మస్క్ మినీ సబ్‌మెరైన్
మే సాయ్ : థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్నవారి కోసం చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం 12 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో నలుగురు విద్యార్థులు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కోచ్‌తో పాటు మిగిలిన 8 మంది విద్యార్థుల్ని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరి ఆపరేషన్‌కు సాయంగా టెక్ పారిశ్రామిక వేత్త ఇలాన్ మస్క్ ఓ మినీ-సబ్‌మెరైన్‌ను రూపొందించారు. లాస్ ఎంజెల్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో దీన్ని పరీక్షించిన వీడియోను సైతం ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. ‘బహుషా.. ఇది థాయ్ ఆపరేషన్‌కు ఉపయోగపడుతుందనుకుంటున్నా.’ అని ఆ వీడియోకు క్యాప్షన్‌గా పేర్కొన్నారు.
ఆ గుహలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఈ చిన్న సైజు సబ్‌మెరైన్ ఉపయోగపడనుంది. ఇలాన్ తెలిపిన సమయం ప్రకారం ఇది ఇప్పటికే థాయ్‌లాండ్‌కు చేరి ఉంటుంది. ఇక ఇది రక్షణదళాలు ఉపయోగించే సబ్‌మెరైన్‌ను పోలీ ఉండే ఈ మినీ సబ్‌మెరైన్ ద్వారా ఆక్సిజన్, ఆహారం తీసుకెళ్లడంతో పాటు.. దీని సహాయంతో నీటీ నుంచి సులవుగా బయటకు రావచ్చు. సహాయక కోచ్ ఎకపాల్(25)తో కలసి12 మంది విద్యార్థులు గత జూన్ 23న తామ్ లువాంగ్ గుహలోకి ప్రవేశించారు, వరదనీటితో ప్రవేశద్వారం మునిగిపోవడంతో వీరంతా లోపల ఇరుక్కున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment