ఒక యువతికి తమ ఇంటి కింది భాగంలో ఒక రహస్య గది కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులకు, అధ్యాపకులకు తెలిపింది. దీంతో వీరంతా ఆ గదిలోనికి వెళ్లి, లోపల ఏముందో చూసే ప్రయత్నం చేశారు. ఆ గది 1800 శతాబ్దం నాటిదని గుర్తించారు. ఈ ఉదంతం బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో చోటుచేసుకుంది.
ది సన్ రిపోర్టును అనుసరించి ఈ నేలమాళిగ 200 ఏళ్ల క్రితం నాటిది. అమ్మాయిలంతా దానిలోనికి వెళ్లి చూడగా వారికి అక్కడ ఒక ఫ్లోర్ కనిపించింది. అక్కడ నాలుగు మూలలా బెంచీలు కనిపించాయి. అలాగే పలు అల్మరాలు కూడా ఉన్నాయి. అది వారికి ఒక స్టోర్ రూమ్ మాదిరిగా కనిపించింది. ఆ యువతి కుటుంబం ఈ ఇంటిలోకి షిష్ట్ అయ్యే సమయంలో వారికి ఈ సంగతి తెలియదు.
నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్శిటీ జర్నలిజం విద్యార్థి స్టెఫానీ బెన్నెట్.. కొద్దిపాటి భయాందోళనల వాతావరణం మధ్య తన ఈ నూతన ఆవిష్కరణ ఎలా జరిగిందో మీడియాకు తెలియజేసింది.. ‘అదేమీ పెద్ద గది కాదు. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగివుంది. ఈ ఆవిష్కరణ ఎంతో ఆసక్తికరంగా సాగింది. లోపల ఏముందో చూడాలనే ఆసక్తితో తామంతా ఒకేసారి ఆ గదిలోనికి ప్రవేశించాం. అయితే ఆ గదిని ఎందుకు వినియోగించేవారో కనుగొనలేకపోయాం’ అని పేర్కొంది.
ఈ యువతుల బృందం ఈ విషయాన్ని స్థానిక పురాతత్వ శాస్త్రవేత్తలకు తెలియజేసింది. వారు వెంటనే గుహను సందర్శించారు. అది రెండు శతాబ్ధాల క్రితం నిర్మితమయినదని తెలిపారు. నాటింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ యాక్టింగ్ ఆర్కియాలజిస్ట్ స్కాట్ లోమాక్స్ మాట్లాడుతూ ఆ గుహ ఒక నేలమాళిగ అని తెలిపారు. దానిపైన భవనం నిర్మితమవడాన్ని గమనిస్తే అది 19వ శతాబ్దం నాటిదిగా తెలుస్తున్నదన్నారు. ఈ నేలమాళిక అనేక పురాతన విశేషాలను తెలియజేస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: ‘ఆరోపణలతో పెరుగుతున్న ఆదరణ’.. ట్రంప్ మరో వింత వ్యాఖ్యానం!
Comments
Please login to add a commentAdd a comment