
ఈక్వెడార్ రాజధాని క్విటో శివారులోని ఓ గుహ..
రాత్రి ఏడు అవుతోంది..
ఇంతలో కొన్ని జంటలు ఆ గుహలోకి ప్రవేశించాయి..
అంతా చిమ్మచీకటి.. ఏమీ కనిపించడం లేదు..
వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు..
ఇంతలో ఓ స్వరం.. ఇటు రండి సర్ అని..
ఓ వ్యక్తి.. ఆ చీకటిలో వీరికి దారి చూపుతున్నాడు..
కొంతసేపు తర్వాత వారిని ఓ ప్రదేశానికి తీసుకెళ్లి..
అక్కడున్న సీట్లలో కూర్చోబెట్టాడు..
మీకో విషయం తెలుసా? ఆ చిమ్మచీకటిలో కళ్లున్న వారందరికీ
దారి చూపించిన ఆ వ్యక్తికి అసలు కళ్లే లేవు.. అతడు అంధుడు..
క్విటోలోని రఫాస్ కేవ్ రెస్టారెంట్.. డార్క్‌నెస్‌లో డిన్నర్ చేయడం వంటి కాన్సెప్టులు చాలా చోట్ల ఉన్నవే.. అయితే.. రఫాస్ ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ వెయిటర్లంతా అంధులే.. ఇంకో విశేషమేమిటంటే.. రెస్టారెంట్‌కు తినడానికి వచ్చినోళ్లంతా దేన్నో ఒకదాన్ని తన్నుకుంటూ.. తడబడుతూ నడుస్తుంటే.. అంధులైన వెయిటర్లు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఠీవిగా నడుస్తూ కనిపిస్తారు. ఇక్కడ సెల్‌ఫోన్లు, కాంతిని వెదజల్లే గడియారాలు వంటివి నిషిద్ధం. అక్కడక్కడా చిన్నపాటి వెలుతురు వస్తుంటుంది.. ఈ రెస్టారెంట్‌ను రాఫెల్‌వైల్డ్ అనే ఆయన ప్రారంభించారు. ఓ వినూత్న అనుభూతిని అందించడంతో పాటు అంధుల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రెస్టారెంట్‌ను పెట్టినట్లు ఆయన చెప్పారు.
- సాక్షి, తెలంగాణ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment