ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్ఫటికాల గుహ. బయటి నుంచి లోపలకు చూస్తే, భారీ స్ఫటిక శిలలు ధగధగలాడుతూ కనిపిస్తాయి. గుహ లోలోపలికి వెళుతుంటే మాత్రం తాళలేనంత వేడిసెగలు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఈ స్ఫటికాల గుహ మెక్సికోలోని చిహువాహువా సమీపంలో ఉంది. నైకా గనితో ఈ గుహను అనుసంధానించారు. ఇందులో జిప్సమ్, క్యాల్షియమ్ ఖనిజాల వల్ల ఏర్పడిన స్ఫటిక శిలలు భారీ పరిమాణంలో కనిపిస్తాయి. ఈ గుహను పూర్తిగా పరిశీలించడం ఎవరికీ సాధ్యం కాదు. లోలోపలకు వెళితే, అక్కడి ఉష్ణోగ్రతలు 58 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. లోపలి గాలిలో తేమ 90–99 శాతం మేరకు ఉంటుంది.
గని కార్మికులైన జువాన్, పెడ్రో అనే సోదరులు తవ్వకాలు జరుపుతున్న సమయంలో పాతికేళ్ల కిందట ఈ గుహను గుర్తించారు. గుహలోని నేలకు అడుగు భాగంలో కరిగే స్థితిలో ఉన్న లావా కారణంగానే ఈ గుహలో విపరీతమైన వేడి, ఉక్కపోత వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment