నయీం కేసును సీబీఐకి అప్పగించాలి
నయీం కేసును సీబీఐకి అప్పగించాలి
Published Fri, Aug 26 2016 10:52 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
నాంపల్లి : నయీం కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ 152 టీఎంసీలకు తీర్మానం చేస్తే టీఆర్‌ఎస్ పార్టీ 148 టీఎంసీలకు మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రాజెక్ట్‌లకు రీ డిజైన్ చేసి రాష్ట్ర ప్రజలకు నష్టం వాటిల్లేలా చేస్తుందని విమర్శించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగాలేదని ముఖ్యమంత్రి వారిని సరైన దారిలో పెట్టాలన్నారు. జిల్లాలోనే వెనుకబడిన మండలం నాంపల్లికి బస్సుడిపో, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మండలంలో పైచదువుల కోసం విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్‌గా ఎన్నికైన ఏదుళ్ల రాములును ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంభం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, మండల అధ్యక్షుడు నిమ్మల వెంకట్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నేర్లకంటి జంగయ్య, పానగంటి వెంకటయ్య, నాంపల్లి గ్రామ సర్పంచ్ పెరమాల్ల శైలజాశ్యామ్‌సుందర్, ఎంపీటీసీ కొరె ప్రమీలమురళి, సర్పంచ్‌లు గిరి లక్ష్మీవెంకటేశ్వర్లు, లక్ష్మవెంకట్‌రెడ్డి, కలకొండ దుర్గయ్య, కోన్‌రెడ్డి వెంకటయ్య, నెర్లకంటి రవి, కస్తూరి గోవర్ధన్, సుదర్శన్, ఏదుళ్ల రాములు, జంగయ్య, తదితరులున్నారు.
Advertisement
Advertisement