నయీం భూములను పేదలకు పంచుతాం | distributs to the poor Nayim occupied land | Sakshi
Sakshi News home page

నయీం భూములను పేదలకు పంచుతాం

Published Sat, Aug 13 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

నయీం భూములను పేదలకు పంచుతాం

నయీం భూములను పేదలకు పంచుతాం

  • సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణ 
  • న్యూశాయంపేట : డకాయిట్‌ నయీం ఆక్రమించిన భూముల్లో ఎర్రజెండాలు పాతి పేదప్రజల కు పంచిపెడతామని సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి తగిన కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.  హన్మకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీం చర్యలపైన సిట్టింగ్‌ జడ్జిచే విచారణ చేపడితే ఆస్తులు కోల్పోయిన వారికి న్యాయం జరుగుతుందని, అలాగే అతనితో అంటకాగిన అధికారులు, అనధికారు లు, రాజకీయ నాయకుల బండారం బయట పడుతుందన్నారు. సిట్‌ అధికారులు సేకరించి న ఆధారాలను ప్రతీరోజు హైకోర్టు ముందుం చాలని చెప్పారు. మల్లన్న సాగర్‌ భూసేకరణ విషయంలో డకాయిట్‌ నÄæూంకు ప్రభుత్వాని కి తేడా ఏమీ లేదని విమర్శించా రు. ఒక టీ ఎం సీ నిల్వ సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును 50 టీఎంసీలకు పెంచి తన ఇష్టానుసారం గా చట్టాన్ని రూపొందించి రైతుల నుంచి భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజామోదంతో భూసేకరణ చేయాలే తప్ప బలవంతపు సేకరణ చేయెుద్దని సూచిం చారు. సీఎం కేసీఆర్‌ నీళ్ల పంపిణీ కంటే రానున్న ఎన్నికల నిధిపైనే మక్కువ చూపుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ, ఆంధ్రా సీఎంలు ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రజలకు మెండి చేయిచూపుతున్నారని అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అఖిల పక్షాన్ని పిలిచి నిధులు, నీళ్ల విషయంలో కేంద్రపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అధిక ధరలను నిరసిస్తూ ఈనెల 17న దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చామని, సెప్టెంబర్‌ 2న జరిగే దేశవ్యాప్త సమ్మెకు తమ సంఘీభావాన్ని ప్రకటించినట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, నాయకులు మేకల రవి, కరుణాకర్, విజయసారథి పాల్గొన్నారు.
     
    ప్రజా ఉద్యమంలో విజయం సాధించాం
    భీమారం : ప్రజా ఉద్యమంలో సీపీఐ విజయం సాధిం చిందని..  అయితే ఓట్లల్లో లక్ష్యాన్ని అధిగమించలేకపోతుందని  ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నా రు. నగరంలోని 57వ డివిజన్‌ సుందరయ్యనగర్‌లో శనివారం జరిగిన  సీపీఐ మహాసభకు ఆయన  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో మెరుగైన ఓట్లు సాధించేందుకు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నా రు. స్విస్‌ బ్యాంకులో మన దేశ నాయకులకు సంబంధించిన అవినీతి డబ్బులు రూ.70 లక్షల కోట్లు ఉన్నాయని.. వాటిని ఇక్కడికి తీసుకొస్తే 50 ఏళ్ల పాటు ప్రజలు ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా దర్జాగా బతుకుతారని చెప్పారు.  తొలుత ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే  సుందరయ్యనగర్‌ లో జరిగిన పార్టీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్చీ ప్రారంభించారు. సీపీఐ నాయకుడు ప్రవీణ్‌ అధ్యక్షతన జరిగిన మహాసభలో మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌ రావు, నగర కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ నాయకుడు ఆంజనేయులు, రోహిత్, నాయకులు ప్రభాకర్, రాజేష్, సదానందం, శారద, రంజిత్, అశోక్‌ స్టాలిన్, సిరబోయిన సతీష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement