ఇంద్రధనుస్సులో ఏడు రంగులు కలయిక ఒక అద్భుతం. ప్రతి రంగు దేనికదే ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అలాగే ఈ రంగులను శాంతికి, మంచి ఆలోచనలకు, ఉత్సాహానికి, బాధకు ఒక్కొక్క రంగుని నిర్దేశించారు. ఏంటి ఇదంతా అని అనుకోకండి అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఇంటర్నేట్ ప్రభంజనంతో చిన్న పెద్ద అంతా ఎక్కువగా సోషల్ మాధ్యమాలతోనే గడుపుతుంటారు.
అయితే ఈ మధ్య అంతా ఎక్కువగా ఎరుపు రంగు జెండాల(రెడ్ ఫ్లాగ్స్) ఎమోజీలనే ఎక్కువగా వాడుతుంటున్నారట. నెటిజన్లు నుంచి ప్రముఖ దిగ్గజ కంపెనీల వరకు అంతా ఎరుపు రంగు జెండా చిహ్నాలనే అత్యధికంగా వాడుతున్నారట. అయితే ఎరుపు రంగు అంటే కోపానికి, దూకుడు స్వభావానికి సంకేతంగా చెబుతారు. అంతేకాదు మనందరి దృష్టిలో రెడ్ అంటే డేంజర్‌కి గుర్తు అని తెలుసు. అంతెందుకు హెచ్చరికలను కూడా రెడ్ అలర్ట్ అంటూ ఎరుపు రంగు అక్షరాలతో తెలియజేస్తారు.
అలాంటి రెడ్ ఎమోజీలను ఎక్కువగా వాడుతూ తమకు ఇష్టం కానివాటిని, వద్దునుకుంటున్నవాటిని, వదిలేస్తున్నా అని చెప్పడానికీ ఈ ఎరుపు రంగుల జెండాలనే వాడుతూ అసలు విషయాన్ని చెప్పకనే చెబుతున్నారట. ప్రస్తుతం నెట్టింట ఇది కాస్త తెగ వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో 1.5 మిలియన్ల రెడ్ ఫ్లాగ్‌లను ఉపయోగించారట. ఆఖరికీ ఎంటర్‌టైన‍్మెంట్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ గేమింగ్ ఇండస్ట్రీ నెట్ ఫ్లిక్స్ కూడా ఈ ఫ్లాగ్‌లను ఉపయోగించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment