red flags
-
వాషింగ్టన్లో కార్చిచ్చు బీభత్సం
వాషింగ్టన్: అమెరికా, కెనడాలను కార్చిచ్చులు ఇంకా వెంటాడుతున్నాయి. రోజుకో ప్రాంతంలో కార్చిచ్చులు రేగుతూ ఆందోళన పెంచుతున్నాయి. తాజాగా వాషింగ్టన్‌లోని స్పోకాన్ ప్రాంతంలో మొదలైన కార్చిచ్చు త్వరితగతిన వ్యాపిస్తోంది. కొద్ది గంటల్లో 3 వేల ఎకరాలను భస్మం చేసింది. దీంతో భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది. చాలా ఇళ్లు బూడిదగా మారాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. శనివారం వాషింగ్టన్‌ను మంటలు కమ్మేయడంతో రెడ్ ఫ్లాగ్ వారి్నంగ్ జారీ చేశారు. అత్యంత తీవ్ర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వారి్నంగ్ జారీ చేస్తుంటారు. కెనడాలో 200 కార్చిచ్చులు కెనడా దేశంలోనూ కార్చిచ్చులు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. వాయవ్య కెనడా ప్రాంతంలో 200కుపైగా కార్చిచ్చు ఘటనలు సంభవించాయి. ఈ ఘటనల్లో అగ్గి దావానలంగా వేగంగా పరిసరాలకు వ్యాపించంతో వేలాది మందిని విమానాల్లో సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు. -
ఎర్ర జెండాలనే ఎందుకు వాడుతున్నారో తెలుసా ?
ఇంద్రధనుస్సులో ఏడు రంగులు కలయిక ఒక అద్భుతం. ప్రతి రంగు దేనికదే ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అలాగే ఈ రంగులను శాంతికి, మంచి ఆలోచనలకు, ఉత్సాహానికి, బాధకు ఒక్కొక్క రంగుని నిర్దేశించారు. ఏంటి ఇదంతా అని అనుకోకండి అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఇంటర్నేట్ ప్రభంజనంతో చిన్న పెద్ద అంతా ఎక్కువగా సోషల్ మాధ్యమాలతోనే గడుపుతుంటారు. అయితే ఈ మధ్య అంతా ఎక్కువగా ఎరుపు రంగు జెండాల(రెడ్ ఫ్లాగ్స్) ఎమోజీలనే ఎక్కువగా వాడుతుంటున్నారట. నెటిజన్లు నుంచి ప్రముఖ దిగ్గజ కంపెనీల వరకు అంతా ఎరుపు రంగు జెండా చిహ్నాలనే అత్యధికంగా వాడుతున్నారట. అయితే ఎరుపు రంగు అంటే కోపానికి, దూకుడు స్వభావానికి సంకేతంగా చెబుతారు. అంతేకాదు మనందరి దృష్టిలో రెడ్ అంటే డేంజర్‌కి గుర్తు అని తెలుసు. అంతెందుకు హెచ్చరికలను కూడా రెడ్ అలర్ట్ అంటూ ఎరుపు రంగు అక్షరాలతో తెలియజేస్తారు. అలాంటి రెడ్ ఎమోజీలను ఎక్కువగా వాడుతూ తమకు ఇష్టం కానివాటిని, వద్దునుకుంటున్నవాటిని, వదిలేస్తున్నా అని చెప్పడానికీ ఈ ఎరుపు రంగుల జెండాలనే వాడుతూ అసలు విషయాన్ని చెప్పకనే చెబుతున్నారట. ప్రస్తుతం నెట్టింట ఇది కాస్త తెగ వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో 1.5 మిలియన్ల రెడ్ ఫ్లాగ్‌లను ఉపయోగించారట. ఆఖరికీ ఎంటర్టైన్మెంట్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ గేమింగ్ ఇండస్ట్రీ నెట్ ఫ్లిక్స్ కూడా ఈ ఫ్లాగ్‌లను ఉపయోగించడం విశేషం. -
ఉవ్వెత్తున ఎగిసిన కార్మిక జెండా
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం మే డే వేడుకలు అంబరాన్నంటాయి. ఎక్కడిక్కడ కార్మికులు, కార్మిక నాయకులు పతాకాలను ఎగురవేసి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడంతో జిల్లా మొత్తం ఎరువు వర్ణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా కార్మిక నాయకులు సర్కారు అనుసరిస్తున్న కార్మిక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. -
నయీం భూములను పేదలకు పంచుతాం
సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణ న్యూశాయంపేట : డకాయిట్ నయీం ఆక్రమించిన భూముల్లో ఎర్రజెండాలు పాతి పేదప్రజల కు పంచిపెడతామని సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి తగిన కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీం చర్యలపైన సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపడితే ఆస్తులు కోల్పోయిన వారికి న్యాయం జరుగుతుందని, అలాగే అతనితో అంటకాగిన అధికారులు, అనధికారు లు, రాజకీయ నాయకుల బండారం బయట పడుతుందన్నారు. సిట్ అధికారులు సేకరించి న ఆధారాలను ప్రతీరోజు హైకోర్టు ముందుం చాలని చెప్పారు. మల్లన్న సాగర్ భూసేకరణ విషయంలో డకాయిట్ నÄæూంకు ప్రభుత్వాని కి తేడా ఏమీ లేదని విమర్శించా రు. ఒక టీ ఎం సీ నిల్వ సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్ ప్రాజెక్టును 50 టీఎంసీలకు పెంచి తన ఇష్టానుసారం గా చట్టాన్ని రూపొందించి రైతుల నుంచి భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజామోదంతో భూసేకరణ చేయాలే తప్ప బలవంతపు సేకరణ చేయెుద్దని సూచిం చారు. సీఎం కేసీఆర్ నీళ్ల పంపిణీ కంటే రానున్న ఎన్నికల నిధిపైనే మక్కువ చూపుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ, ఆంధ్రా సీఎంలు ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రజలకు మెండి చేయిచూపుతున్నారని అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అఖిల పక్షాన్ని పిలిచి నిధులు, నీళ్ల విషయంలో కేంద్రపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అధిక ధరలను నిరసిస్తూ ఈనెల 17న దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చామని, సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సమ్మెకు తమ సంఘీభావాన్ని ప్రకటించినట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, నాయకులు మేకల రవి, కరుణాకర్, విజయసారథి పాల్గొన్నారు. ప్రజా ఉద్యమంలో విజయం సాధించాం భీమారం : ప్రజా ఉద్యమంలో సీపీఐ విజయం సాధిం చిందని.. అయితే ఓట్లల్లో లక్ష్యాన్ని అధిగమించలేకపోతుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నా రు. నగరంలోని 57వ డివిజన్ సుందరయ్యనగర్‌లో శనివారం జరిగిన సీపీఐ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో మెరుగైన ఓట్లు సాధించేందుకు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నా రు. స్విస్ బ్యాంకులో మన దేశ నాయకులకు సంబంధించిన అవినీతి డబ్బులు రూ.70 లక్షల కోట్లు ఉన్నాయని.. వాటిని ఇక్కడికి తీసుకొస్తే 50 ఏళ్ల పాటు ప్రజలు ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా దర్జాగా బతుకుతారని చెప్పారు. తొలుత ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే సుందరయ్యనగర్ లో జరిగిన పార్టీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్చీ ప్రారంభించారు. సీపీఐ నాయకుడు ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన మహాసభలో మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, నగర కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకుడు ఆంజనేయులు, రోహిత్, నాయకులు ప్రభాకర్, రాజేష్, సదానందం, శారద, రంజిత్, అశోక్ స్టాలిన్, సిరబోయిన సతీష్ పాల్గొన్నారు. -
రేణుకాచౌదరి భూముల్లో ఎర్రజెండాలు
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని బీసీఎం రోడ్ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉన్న ఎంపీ రేణుకా చౌదరి భూములతోపాటు, చెరువుబంజర్, మేడికుంట చెరువు భూముల్లో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో పేదలు ఎర్రజెండాలు పాతారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని ఐలయ్య మాట్లాడుతూ రేణుకాచౌదరి మూడు దశాబ్దాల క్రితం ఆక్సికో కర్మాగారం నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం నుంచి 43 ఎకరాలు తీసుకున్నారని, నేటికీ కర్మాగారం నెలకొల్పకపోగా.. మామిడితోట సాగు చేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి ఆక్రమణలను అడ్డుకున్నారు. కోడ్ అమలులో ఉన్నందున ఆక్రమణలకు దిగవద్దని సూచించారు. తహసీల్దార్ విషయాన్ని సబ్ కలెక్టర్ కాళీచరణ్ ఎస్.కర్టేడ్ దృష్టికి తీసుకెళ్లగా భూములు సర్వే చేసి కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.